Share News

Teachers MLC: టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గోపీ మూర్తి విజయం

ABN , Publish Date - Dec 09 , 2024 | 01:25 PM

Andhrapradesh: ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పీడీఎఫ్ అభ్యర్థి గోపీ మూర్తి విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో పీడీఎఫ్ అభ్యర్థి మూర్తికి అధికంగా ఓట్లు పోలయ్యాయి. పోలైన 15490 ఓట్లలో మూర్తికి 8, 929 తొలి ప్రాధాన్యతా ఓట్లు లభించాయి. ప్రతి టేబుల్‌లో వెయ్యి ఓట్లకు 600 పైగా ఓట్లు గోపి మూర్తికే దక్కాయి.

Teachers MLC:  టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గోపీ మూర్తి విజయం
PDF Candidate Gopi Murthy

కాకినాడ, డిసెంబర్ 9: ఏపీ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పీడీఎఫ్ అభ్యర్థి గోపీ మూర్తి (PDF Candidate Gopi Murthy) విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో పీడీఎఫ్ అభ్యర్థి మూర్తికి అధికంగా ఓట్లు పోలయ్యాయి. పోలైన 15490 ఓట్లలో మూర్తికి 8, 929 తొలి ప్రాధాన్యతా ఓట్లు లభించాయి. ప్రతి టేబుల్‌లో వెయ్యి ఓట్లకు 600 పైగా ఓట్లు గోపి మూర్తికే దక్కాయి.

షాకింగ్.. ఆ రూట్‌లో తగ్గనున్న మెట్రో స్టేషన్లు..


ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి కాకినాడ జేఎన్‌టీయూలో సోమవారం కౌంటింగ్ ప్రక్రియ జరిగింది. పీడీఎఫ్‌కు చెందిన గోపీ మూర్తి విజయం ఖరారైంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి గతంలో షేక్ షాబ్జి ఎమ్మెల్సీ ఉపాధ్యాయ కోటాలో ఉన్నారు. ఆయన మరణించడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికలో దాదాపు 15490 ఓట్లు పోలయ్యాయి.

పార్లమెంట్‍లో మూడు కీలక బిల్లులు ఆమోదం !


దీనికి సంబంధించి కాకినాడ జేఎన్‌టీయూలో కౌంటింగ్ అవగా.. దాదాపు 14 టేబుళ్ల మీద ఓట్ల లెక్కింపు ప్రక్రియ సాగింది. మొదటి నుంచి కూడా పీడీఎఫ్ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. చివరకు వచ్చేసరికి మొత్తం పోలైన 15,490 ఓట్లలో దాదాపు 60 శాతం ఓట్లు గోపీ మూర్తికే వచ్చాయి. రెండో స్థానంలో ప్రైవేట్ కళాశాల నుంచి పోటీ చేసిన నారాయణ అనే అభ్యర్ధి ఉన్నారు. ఈ విజయంతో ఉభయ ఉమ్మడి గోదావరి జిల్లాలకు సంబంధించి పీడీఎఫ్ తన పట్టును నిలుపుకుందని చెప్పవచ్చు. గోపీ మూర్తి భారీ విజయంతో ఆయనకు మద్దతుగా నిలిచిన ఉపాధ్యాయ సంఘాలు సంబరాలు చేసుకుంటున్నాయి.


ఈ విజయం షేక్ షాబ్జీకి అంకితం: గోపీ మూర్తి

ఈ విజయం దివంగత ఎమ్మెల్సీ షేక్ షాబ్జీకి అంకితమని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ విజేత గోపి మూర్తి అన్నారు. ఇది ప్రజాస్వామ్య విజయమని.. రెండు జిల్లాల అధ్యాపకులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఉపాధ్యాయ సమస్యలపై పోరాడుతానని స్పష్టం చేశారు. సీపీఎస్ పోరాటం ఉధృతి చేస్తామన్నారు. విద్యారంగం ప్రైవేట్ పరం అవుతోందని.. వీరి సమస్యలను పరిష్కరించడానికి పొరడుతానన్నారు. వీరికి హెల్త్ కార్డులు.. ఇన్స్యూ రెన్స్ వచ్చేలా పోరాడుతానని తెలిపారు. 9,173 ఓట్లతో విజయం సాధించానని..గతంలో కంటే ఎక్కువ మెజరిట్టీ వచ్చిందని గోపి మూర్తి పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

తెలంగాణ తల్లి విగ్రహంపై సీఎం కీలక ప్రకటన.

జానీ మాస్టర్‌కు మరో బిగ్ షాక్..

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 09 , 2024 | 01:41 PM