ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ABN , Publish Date - Sep 05 , 2024 | 12:12 AM
జిల్లాలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు కార ణంగా వస్తున్న వరద నీరు వాగులు వంకలు, కాలువల్లో ప్రవాహం పెరిగిందని వీటిని దాటడానికి ప్రజలు ప్రయ త్నాలు చేయవద్దని జిల్లా ఎస్పీ కేపీఎస్ కిశోర్ సూచిం చారు.
జిల్లా ఎస్పీ కేపీఎస్ కిశోర్
ఏలూరు క్రైం, సెప్టెంబర్ 4 : జిల్లాలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు కార ణంగా వస్తున్న వరద నీరు వాగులు వంకలు, కాలువల్లో ప్రవాహం పెరిగిందని వీటిని దాటడానికి ప్రజలు ప్రయ త్నాలు చేయవద్దని జిల్లా ఎస్పీ కేపీఎస్ కిశోర్ సూచిం చారు. జిల్లాలో కొద్ది రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు జల్లేరు, ఎర్రకాలువ, తమ్మిలేరు, చిన్న చిన్న వాగులు, రామిలేరు వంటి కాలువల ప్రవాహం పెరిగిందని ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండా లన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పొంగుతున్న కొండవాగులు, కల్వర్టులు వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మరోవైపు గోదావరి నదిలో వరద నీరు చేరుతు ండడంతో ఆ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ముంద స్తుగా బ్రిడ్జిలు వద్ద, సప్టాలు వద్ద, లోబ్రిడ్జిలు వద్ద పోలీస్ పికె ట్లను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఎలాంటి ప్రాణ నష్టం కలుగకుండా జాగ్రత్తలు, రక్షణ చర్యలు తీసుకోవాలని పోలీస్ యాంత్రాంగానికి సహకరించాలన్నారు.
పెరుగుతున్న వరద నీరు
తమ్మిలేరు కాలువలో వరద నీరు తగ్గుముఖం పట్టడంతో శనివారపుపేట లోబ్రిడ్జి వద్ద ఈనెల 3వ తేదీ నుంచి యధావిధిగా రాకపోకలు సాగించాయి. బుధవారం మళ్ళీ తమ్మిలేరు వరద నీరు పెరుగుతుండడంతో శనివారపుపేట లోబ్రిడ్జి పై నుంచి వరద నీరు ప్రవహించే అవకాశాలు ఉన్నట్లుగా అధికారులు అంచనా వేశారు. ముందస్తుగా త్రి టౌన్ సీఐ కోటేశ్వరరావు, ఎస్‌ఐ ప్రసాద్‌ల ఆధ్వర్యంలో ఆ ప్రాంతాల్లో పోలీస్ పికెట్‌ను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు.
అధికారులు సిద్ధంగా ఉండాలి
పెదపాడు, సెప్టెంబరు 4 : వరద ముంపును ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని జడ్పీ చైర్మన్ ఘంటా పద్మశ్రీ సూచించారు. మండలం కొణికి గ్రామ సరిహద్దుల్లో ప్రవహిస్తున్న బుడమేరు నీటి ప్రవాహాన్ని బుధవారం పరిశీ లించారు. నాలుగు రోజులుగా కురిసిన వర్షాల ప్రభావంతో పైనుంచి వరదనీరు బుడమేరులో వస్తున్న సమీప గ్రామాలు ప్రమాదం బారినపడే అవకాశముందని అప్రమత్తంగా ఉండాలని పలు సూచనలు చేశారు.
కొణికి కాజ్‌వే మూసివేత
కొణికి గ్రామ సమీపంలో కాజ్‌వే పై నుంచి వరద నీటి ప్రవాహం ఉధృ తంగా ఉండటంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రాకపోకలను నిలిపివేసి నట్లుగా ఇన్‌చార్జి తహసీల్దారు ప్రసాద్‌బాబు తెలిపారు. కాజువే వద్ద పోలీసు, రెవెన్యూ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారన్నారు.