Share News

కష్టాలు తీరేనా!

ABN , Publish Date - Dec 16 , 2024 | 12:27 AM

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం వందల కుటుంబాలు అనేక పాట్లు పడ్డాయి. పుట్టి పెరిగిన గ్రామంతో తెగతెంపులు చేసుకుని పిల్లాపాపలతో పునరావాస కాలనీలకు తరలి వెళ్లేందుకు సిద్ధపడ్డాయి.

కష్టాలు తీరేనా!

ఐదేళ్ల వైసీపీ పాలనలో నిర్వాసితుల పాట్లు.. సీఎం చంద్రబాబుపై ఆశలు

వ్యక్తిగత పరిహారంలో దగా చేశారు

ఓట్ల కోసం వైసీపీ నేతల నాటకాలు

ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై ఆశలు

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దయ చూపాలంటున్న నిర్వాసితులు

మంత్రి నిమ్మల దృష్టికి పలు సమస్యలు

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం వందల కుటుంబాలు అనేక పాట్లు పడ్డాయి. పుట్టి పెరిగిన గ్రామంతో తెగతెంపులు చేసుకుని పిల్లాపాపలతో పునరావాస కాలనీలకు తరలి వెళ్లేందుకు సిద్ధపడ్డాయి. తమకు అధికారంగా ప్రకటించిన పరిహారం అందేలా చూడాలని పదేపదే ప్రాధేయపడ్డాయి. గడచిన రెండు దశాబ్దాల కాలంలో పోలవరం నిర్వాసిత కుటుంబాల పాట్లు అన్నీ ఇన్నీ కావు. గడిచిన ఐదేళ్లు జగన్‌ నిర్వాకంతో ఈ కష్టాలు మరింత ముదిరాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసేందుకు సీఎం చంద్రబాబు పట్టుదలతో ఉండడంతో ఈసారైనా సంపూర్తిగా పరిహారం చెల్లించి తాము ఎదుర్కొంటున్న కష్టాలు తీరాతాయా అనే ప్రశ్న అన్ని కుటుంబాల్లో ఉంది.

ఏలూరు, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జాతీయస్థాయి బహుళార్ధ సాధక ప్రాజెక్టు అయిన పోలవరం నిర్మాణంలో ఎందరో త్యాగాలు ఉన్నాయి. కుక్కునూరు, వేలేరుపాడు, పోలవరం తదితర ముంపు మండలాల్లో అనేక గ్రామాలు, వందలాది కుటుంబాలు పోలవరం నిర్మాణానికే త్యాగానికోర్చాయి. తాము నష్టపోయి న ఫర్వాలేదు గాని రైతులు బాగుపడాలనే కాంక్ష.. ఆకాంక్షే అందరిది. ప్రాజెక్టు నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసేందుకు 2014–2019 మధ్య అప్పట్లో కొన్ని గ్రామాలను ఖాళీ చేయించారు. కొన్ని గ్రామాలను ఖాళీ చేయించేందుకు ప్రణాళిక రూపొందించారు. ఏలూరు జిల్లాలో కుక్కునూరు, వేలేరుపాడులో అత్యధిక గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. ఈ గ్రామాల్లో గిరిజనులే ఎక్కువ. గిరిజనేతరులు కూడా ఉన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి వీలుగా రెండు మండలాల్లో గ్రామాల ను ఖాళీచేసి వారిని పునరావాసా కాలనీలకు తరలించడానికి 15 క్రితమే కార్యాచరణ రూపొం దించారు. ముంపు గ్రామాల్లో బాధిత కుటుం బాలను గుర్తించి పెళ్లి కాని వారికి కూడా పరి హారం ఇచ్చేందుకు సమ్మతించారు. ఆ మేరకు పరిహారం జాబితా విడుదల చేస్తున్నట్లు ఆశలు చూపుతూ వచ్చారు.

జగన్‌ సర్కార్‌ వంచన

గడిచిన ఐదేళ్లలో జగన్‌ సర్కారు వందలాది మంది నిర్వాసితులను వంచించింది. గడిచిన ఎన్నికలకు ముందుగానే నిర్వాసితుల భూములకు ఇచ్చే పరిహారం పూర్తి గా సవరిస్తామని, వ్యక్తిగత పరిహరం కూడా రూ.10 లక్షలకు పెంచుతామని, తాము అధికారంలోకి వస్తే ఇట్టే చేసి చూపుతా మని అప్పట్లో జగన్‌ జనాలకు హామీనిచ్చారు. వాస్తవానికి కుక్కునూరు, వేలేరుపాడు మండలా ల్లో వ్యక్తిగత పరిహారం అందుకునే అర్హుల సంఖ్య వేలల్లో ఉంది. దీనికి అనుగుణంగానే పరిహారం చెల్లించడానికి సుమారు రూ.3 వేల కోట్లు అవస రమని అప్పట్లో గుర్తించారు. అది పెద్దపని కాద న్నట్లు అధికారం చేపట్టిన కొత్తల్లో జగన్‌ ప్రభు త్వం జీవో కూడా జారీ చేసింది. నిర్వాసిత కుటుం బాలన్నీ వ్యక్తిగత పరిహారం రూ.10లక్షలు దక్కు తుందని ఆశలు పెంచుకున్నారు. ఏళ్ల తరబడి నిర్వాసితుల ఆశలు ఒక్కటి కూడా నెరవేరలేదు. కేవలం కొద్దిమంది ఖాతాల్లో కొద్దిగా జమ చేసి మమ అన్పించారు. నిర్వాసిత కుటుంబాల్లోని అవివాహితులకు పరిహారం చెల్లించాలనే డిమాం డ్‌కు తలూపి ఆనక పక్కకు తప్పుకున్నారు.

అభివృద్ధికి ఆస్కారం లేదు!

ముంపు గ్రామాల్లో గడిచిన దశాబ్దకాలంగా అభివృద్ధి ఆగిపోయింది. పరిహారం కూడా కొంత మేర చెల్లించినందున ఆయా గ్రామాలను వీడి నిర్వాసితులకు కేటాయించిన కాలనీలకు వెళ్లక తప్పదని ప్రభుత్వం నిర్దేశించింది. ఆయా గ్రామా ల్లో అభివృద్ధి పనులకు ఆస్కారం లేదని పక్కాగా తేల్చింది. జగన్‌ పాలనలో ఒకవైపు పూర్తి పరి హారం కోసం ఎదురు చూసినవారిని ఎవరూ పట్టించుకోలేదు. అఖరికి పరిహారం పేరిట అనేక మంది అక్రమాలకు పాల్పడ్డారు. బోగస్‌ కుటుం బాలను తెరముందుకు తెచ్చి సర్కారు సొమ్మును కాజేసే ప్రయత్నం చేశారు. ఐటీడీఏ కేంద్రంగా జరిగిన కుంభకోణాలు అన్ని ఇన్నీ కావు. ఇన్ని జరుగుతున్నా జరిగిన ఐదేళ్లలో నిర్వాసితులను ఆదుకోవడానికి వారికి కేటాయించిన కాలనీల్లో సౌకర్యాలు మెరుగుపర్చడానికి శ్రద్ధ తీసుకుంటే ఒట్టు. సాక్షాత్తూ స్థానిక ఎమ్మెల్యేలే ఈ దిశగా ప్రభుత్వాన్ని ఒప్పించలేకపోయారు. గిరిజనులు, గిరిజనేతర కుటుంబాలు కోరుకున్నట్లు పరిహారం విషయాన్ని అప్పటి ముఖ్యమంత్రి జగన్‌ దృష్టికి తీసుకెళ్లడంలో విఫలమయ్యారు. కనీసం ప్రభు త్వంపై ఒత్తిడి పెంచితే వందల కుటుంబాలు ఒడ్డెక్కుతాయన్న స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరిం చారు. పోలవరం నిర్వాసితులకు బుట్టాయిగూ డెం, పోలవరం జీలుగుమిల్లి మండలాల్లో ఏర్పాటైన కాలనీలకు కొద్ది మంది మాత్రమే తరలివచ్చారు. ఆయా కాలనీల్లో ఇప్పటికీ సౌకర్యాల లేమి తాండవిస్తోంది. పోల వరం కోసం అన్నీ త్యాగం చేసినా తమకు ఈ పరిస్థితి ఎందుకొచ్చిందని ఎవరైనా నిలదీస్తున్నా తగు సమాధానం లేకుండా పోయింది.

సీఎం చంద్రబాబుపైనే కోటి ఆశలు

సీఎం చంద్రబాబునాయుడుపైనే నిర్వాసిత కుటుంబాలన్నీ కోటి ఆశలు పెంచుకున్నాయి. జగన్‌ ప్రభుత్వ హయాంలో 41.75 మీటర్ల ఎత్తు వరకే ప్రాజెక్టు నిర్మిస్తారని, ఆ పరిధిలో వచ్చే గ్రామాలన్నింటికి మాత్రమే పరిహారం, అక్కడి నుంచి కుటుంబాల తరలింపు జరుగుతుందని చాన్నళ్లు పాటు హడావుడి చేశారు. అధికారులను రంగంలోకి దింపి వివరాలు సేకరించాల్సిందిగా కాలక్షేపం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిర్మితమవు తుందని, ఎత్తు కుదింపునకు ఆస్కారం లేదని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానా యుడు ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలో కుక్కునూరు, వేలేరుపాడు, పోలవరం ముంపు గ్రామాలన్నీంటిలో మళ్లీ కొత్త ఆశలు చిగురిం చాయ. ప్రాజెక్ట్‌ పూర్తి కావడంలో ముందస్తుగా తమకు పరిహారం చెల్లింపులోనూ ప్రభుత్వం చొరవ తీసుకోవాలని నిర్వాసిత కుటుంబాన్నీ గట్టిగానే కోరుకుంటున్నాయి. ఇప్పటి వరకు ఎత్తు తగ్గింపు పేరిట అనేక గ్రామాలకు పరిహారం చెల్లించడంలో జగన్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయగా, ఇప్పుడు దానిని సవరించాల్సి అవసరాన్ని గుర్తు చేస్తున్నారు. సీఎం చంద్రబాబు సైతం నిర్వాసిత కాలనీలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి అవసరాన్ని గుర్తు చేస్తున్నారు.

పక్కా పునరావాసమే మార్గం

తాడువాయిలో నిర్మిస్తున్న అతి పెద్ద పునరావాస కాలనీలు దాదాపు 10వేల మంది నివసించేందకు అనువైంది. వీరందరికి తక్షణం ఉపాధికి చర్యలు తీసుకుంటే తప్ప వేలమంది కాలనీల్లో బతుకీడ్చడం కష్టమనే వాదనను అప్ప టి కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. చిన్నతరహా పరిశ్రమలను తీసుకురా వడం ఒక్కటే ఈ సమస్యకు పరిష్కారమని సూచించారు. కుక్కునూరు, వేలేరుపాడులో వున్న గిరిజన కుటుంబాలన్నీ రోజువారీ కూలీ, చిన్న చితక అటవీ ఉత్పత్తుల ద్వారా వచ్చే ఆదాయం తోనే పొట్టు పొసుకునేవారు. అదే విషయాన్ని సీఎం చంద్రబాబు కూడా పునరాలోచించాలన్న వాదన రేకెత్తుతోంది. నేడు పోలవరం పర్యటనకు వస్తున్న సీఎం పోలవరం నిర్వాసితుల విషయం లోనూ ఎలాంటి ప్రకటన చేస్తారనే ఉత్కంఠ అందరిలో ఉంది. పోలవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా జససేన నుంచి చిర్రి బాల రాజును ఎన్నుకున్నారు. కూటమిలో జనసేన కూడా భాగస్వామి కాబట్టి ముఖ్యమంత్రి నిర్వాసితులను సంతృప్తిపరిచే విధానంలో ప్రకటన చేస్తారనే అందరూ వ్యక్తం చేశారు.

నిమ్మల.. పట్టుదల

జలవనరుల శాఖమంత్రి నిమ్మల రామానా యుడు నిర్వాసితులు, ప్రాజెక్టు విషయంలో సహేతుక నిర్ణయాలకు అనువుగా వ్యవహరిస్తు న్నారు. పోలవరం నిర్వాసితుల సమస్యలు ఇప్పటికే ఆయన దృష్టికి వెళ్లాయి. వారికి సాయం అందించడం, కాలనీల్లో సౌకర్యాలు కల్పన వంటి నిర్ణయాలకు మంత్రి చొరవ తీసుకుంటారన్న నమ్మకం నిర్వాసితుల్లో ఉంది. వీటిపై అధికారుల తో నిమ్మల సమీక్షలు నిర్వహించారు. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి పరిస్థితులు ఉన్నాయో కూడా ఆయన నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబుకు అంతా వివరించే అవకాశం లేకపోలేదు.

Updated Date - Dec 16 , 2024 | 12:27 AM