Share News

30 నుంచి పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌కు దేహదారుఢ్య పరీక్షలు

ABN , Publish Date - Dec 29 , 2024 | 12:16 AM

ఈనెల 30వ తేదీ నుంచి పోలీస్‌ కానిస్టేబుళ్ళ దేహదారుఢ్య పరీక్షలను ఏలూరు పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో నిర్వ హిస్తున్నట్లు జిల్లా ఎస్పీ కేపీఎస్‌ కిశోర్‌ తెలిపారు.

30 నుంచి పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌కు దేహదారుఢ్య పరీక్షలు

ఏలూరు క్రైం, డిసెంబరు 28 (ఆంధ్ర జ్యోతి): ఈనెల 30వ తేదీ నుంచి పోలీస్‌ కానిస్టేబుళ్ళ దేహదారుఢ్య పరీక్షలను ఏలూరు పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో నిర్వ హిస్తున్నట్లు జిల్లా ఎస్పీ కేపీఎస్‌ కిశోర్‌ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ రిక్రూట్‌ మెంట్‌ బోర్డుచే ఉమ్మడి పశ్చిమ గోదా వరి జిల్లా పరిధిలోని సివిల్‌ (పురుష, మహిళలు), ఏపీఎస్‌పీ (పురుషులు) ప్రిలి మనరీ పరీక్షలలో ఎంపికైన అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలను ఈనెల 30వ తేదీ నుంచి నిర్వహించనున్న నేపథ్యంలో శనివారం సాయంత్రం పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌ను ఎస్పీ కిశోర్‌, అదనపు ఎస్పీ ఎన్‌ సూర్యచంద్రరావు పరిశీలిం చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 4976 మంది అభ్యర్థులకు హాల్‌ టిక్కెట్లు మంజూరు చేశామ న్నారు. వీరిలో 3997 మంది పురుషులు, 979 మహిళలు పాల్గొననున్నారని తెలిపారు. మహిళా అభ్యర్థినులకు ప్రత్యేకంగా జనవరి 3,4 తేదీలలో మహిళా సిబ్బందితో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 204 కానిస్టేబుల్‌ పోస్టులు ఉన్నాయని ఈ పోటీ పరీక్షలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నట్లు తెలి పారు. దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించే ప్రదే శాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. డ్రోన్‌ కెమెరాల ద్వారా చిత్రీకరణ జరుగుతుందని పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఈ పోటీ పరీక్ష లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముందస్తుగా రెండు అంబులెన్సులను కూడా ఏర్పాటు చేశా మన్నారు. పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఎలక్ర్టానిక్‌ వస్తువులను తీసుకురాకూ డదని, సెల్‌ఫోన్లు, వాచీలు ఇతర వస్తువులు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ంచబడవన్నారు. ఈ పరీక్షల కు హాజరయ్యే అభ్యర్థులు ఒరిజినల్‌, జిరాక్స్‌ కాపీలను తప్పనిసరిగా తీసుకు రావా లన్నారు. ఒరిజినల్‌ సర్టిఫికెట్లు తీసుకు రాలేని అభ్యర్థులను పరీక్షలకు అనుమతిం చబడదని స్పష్టం చేశారు. సమయం కూడా ఇవ్వడం జరగదన్నారు. ఈనెల 30వ తేదీ నుంచి జనవరి 9వ తేదీ వరకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఎస్పీతో పాటు ఎఆర్‌ అదనపు ఎస్పీ ఎన్‌ఎస్‌ఎస్‌ శేఖర్‌, ఎఆర్‌ డీఎస్పీ బి చంద్రశేఖర్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ మల్లేశ్వరరావు, ఆర్‌ఐ పవన్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 29 , 2024 | 12:16 AM