పోలింగ్ 93.27%
ABN , Publish Date - Dec 06 , 2024 | 12:39 AM
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్ని కల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూ రు, కాకినాడ, డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ, అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలోని 116 పోలింగ్ కేంద్రాల్లో 92.62 శాతం పోలింగ్ నమోదైంది.
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో మొత్తం ఓటర్లు 16,737 పోలైనవి 15,502
పశ్చిమలో మొత్తం ఓటర్లు 3,729.. పోలైనవి 3,478.. పరిశీలించిన కలెక్టర్ నాగరాణి, జేసీ
బ్యాలెట్ బాక్సులు కాకినాడకు
తరలింపు.. 9న కౌంటింగ్
భీమవరం టౌన్, డిసెంబరు 5(ఆంధ్ర జ్యోతి): ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్ని కల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూ రు, కాకినాడ, డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ, అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలోని 116 పోలింగ్ కేంద్రాల్లో 92.62 శాతం పోలింగ్ నమోదైంది. 16,737 మంది ఓటర్ల కు గాను 15,502 మంది ఓటు హక్కును వినియోగించుకు న్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుం డా గురువారం ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని 20 మండలాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల వద్ద ఉపా ధ్యాయులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆచంటలో అత్యధికంగా పోలింగ్ నమోదైంది. అత్యధిక పోలింగ్ 98.41 శాతం ఆచంట మండలంలో నమోదైంది. ఇక్కడ 63 మంది ఓట ర్లకు, 62 మంది ఓటు వేశారు. పీడీఎఫ్ తరపున పోటిలో వున్న బి.గోపిమూర్తి పోలింగ్ కేంద్రాలను పరిశీలించి పోలింగ్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈయనకు సీపీఎం, ప్రజా సంఘా లు మద్దతు ప్రకటించాయి. గంధం నారాయణరావుకు సీపీఐ, ఎస్టీయూ, మిగతా సంఘాలు మద్దతు ఇచ్చి పోలింగ్ కేంద్రాల వద్ద ప్రచారం నిర్వహించారు. పోలింగ్ స్టేషన్ల వద్ద 144 సెక్షన్‌ను అమలు చేశారు. పోలింగ్ మగిసిన తర్వాత సీల్ చేసిన బ్యాలెట్ బాక్సులను బందోబస్తు మధ్య భీమవరంలోని కలెక్టరేట్ కు తరలించారు. మూడు డివిజన్ల డీఆర్వోలు పర్యవేక్షించారు. బ్యాలెట్ బాక్సులను పోలీస్ బందోబస్తు మధ్య కాకినాడ జేఎన్‌టీయూలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సెంట్రల్ లైబ్రరీ వద్ద ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూమ్‌లో భద్రపర్చారు. ఇక్కడే ఈ నెల 9న ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుంది. అదే రోజు సాయం త్రానికి ఎన్నికల ఫలితాలను వెల్లడిస్తారు.
పోలింగ్ కేంద్రాల పరిశీలన
వీరవాసరం, పెనుమంట్ర పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ చదలవాడ నాగరాణి పరిశీలించగా, జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి కాళ్ల, భీమవరం పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. భీమవరం ఆర్డీవో ప్రవీణ్‌కుమార్‌రెడ్డి పాలకోడేరు పోలింగ్ స్టేషన్‌ను, నరసాపురం, పాలకొల్లు పోలింగ్ స్టేషన్‌లను ఆర్డీవో దాసి రాజు పరిశీలించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని కలెక్టరు నాగరాణి తెలిపారు. గురువారం వీరవాసరం కేంద్రాన్ని పరిశీలించి పోలింగ్ తీరును అడిగి తెలు సుకున్నారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నట్లు తెలిపారు.
జిల్లాల వారీగా ఓట్లు మొత్తం పోలైనవి శాతం
కాకినాడ 3418 3,118 91.22
తూర్పుగోదావరి 2,990 2,753 92.07
డాక్టరు బీఆర్ అంబేడ్కర్ కోనసీమ 3,296 3,138 95.21
అల్లూరి సీతారామరాజు 637 565 88.70
పశ్చిమగోదావరి 3,729 3484 93.43
ఏలూరు 2,667 2,444 91.64
మండలం మొత్తం పోలైన పోలింగ్
ఓట్లు ఓట్లు శాతం
అత్తిలి 90 88 97.78
ఆకివీడు 90 82 91.11
ఆచంట 63 62 98.41
భీమవరం 759 694 91.44
గణపవరం 66 63 95.45
ఇరగవరం 53 49 92.45
కాళ్ల 52 45 86.54
మొగల్తూరు 88 85 96.59
నరసాపురం 425 401 94.35
పెంటపాడు 73 68 93.15
పోడూరు 71 68 95.77
పాలకోడేరు 102 99 97.06
పెనుమంట్ర 85 79 92.94
పెనుగొండ 156 148 94.87
పాలకొల్లు 480 444 92.50
తాడేపల్లిగూడెం 377 353 93.63
తణుకు 407 381 93.61
ఉండి 69 63 91.30
వీరవాసరం 129 118 91.47
యలమంచిలి 94 88 93.62