Share News

ఆ ఓటు.. ఈఓటు మాకే .!

ABN , Publish Date - Apr 25 , 2024 | 12:47 AM

పోలింగ్‌ గడువు ముంచుకొస్తున్న వేళ ముందస్తుగానే పటిష్ఠంగా ఓటరు ముందుకు చేరేందుకు... వారి మద్దతు పొంది సునాయాసంగా గెలుపొందేందుకు ప్రధాన పక్షాలన్ని ఎవరి ఎత్తుగడ వారు వేస్తున్నారు.

ఆ ఓటు.. ఈఓటు మాకే .!

ఇదే కూటమి లక్ష్యం.. అసెంబ్లీ నియోజక వర్గాల్లో పరస్పర సహకారానికి కోఆర్డినేటర్లు

ఇప్పటికే పార్టీల వారీగా ఇన్‌చార్జ్‌ల నియామకం

ఎంపీ అభ్యర్థులకు ఇదొక పరీక్షే

ఉమ్మడి పశ్చిమలో ఇప్పటి నుంచే అలర్ట్‌

వైసీపీ ఎత్తుగడలకు అంతటా చెక్‌పెట్టే వ్యూహం

పోలింగ్‌ గడువు ముంచుకొస్తున్న వేళ ముందస్తుగానే పటిష్ఠంగా ఓటరు ముందుకు చేరేందుకు... వారి మద్దతు పొంది సునాయాసంగా గెలుపొందేందుకు ప్రధాన పక్షాలన్ని ఎవరి ఎత్తుగడ వారు వేస్తున్నారు. ఓటుకు నోటుకు లింక్‌ పెట్టే క్రమంలో అధికారపక్షం వెంపర్లాడు తోందని, అడ్డగోలు, అడ్డదారి వ్యవహారాలతో ఓట్లు పొందాలని ఆ పార్టీ భావిస్తోందని ఇప్పటికే మిగతా పక్షాలు విరుచుకు పడుతూనే ఉన్నాయి. దీనికి విరుగుడుగా సాధ్యమైనంత మేర ఓటరు మద్దతుకు వీలుగా కూటమి మరో వ్యూహం అమలు చేస్తోంది. ఒకపార్టీ మద్దతు దారులు, అను కూలురు, ఇంకోపార్టీకి అనుకూలంగా ఓటు బదిలీ చేసే క్రమంలో ఎలాంటి ఒత్తిళ్లు, ఏమరపాటు లేకుండా ముందస్తుగానే కూటమిలోని పార్టీలు సిద్ధమవుతున్నాయి. దీన్ని బ్రేక్‌ చేసేందుకు వైసీపీ వెంపర్లాడుతోంది.

(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి) :

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఏలూరు, నరసాపురం లోక్‌సభ స్థానాల్లో సగానికి సగంపైగా సీట్లను బీజేపీ, జనసేన అభ్యర్థులే పోటీ చేస్తున్నారు. నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం, పోలవరం, ఉంగు టూరు, కైకలూరు నియోజక వర్గాల నుంచి జనసేన, బీజేపీల అభ్యర్థులు పోటీ పడుతుండగా మిగతా స్థానాల్లో తెలుగుదేశం అభ్యర్థులు రంగంలో ఉన్నారు. ఈ మూడు పార్టీలు కలయిక ఓట్ల సమయంలోనూ తమకు సానుకూలంగా వర్తించాలని ఆ మేరకు ఓటు బదిలీ జరిగి తీరాలని కూట మి భావిస్తోంది. నామినేషన్‌ల పర్వం నేటితో పూర్తి కానుంది. ఇప్పటినుంచే ఇక రోజువారీ నియోజక వర్గాల వారీగా ఓటు బదిలీ ప్రక్రియ పకడ్బందీ వ్యూహం అమలు చేయబోతున్నారు. ఆ మేరకు తెలుగుదేశం నియోజకవర్గాల్లో కోఆర్డినేటర్‌లను నియమించింది. సీనియర్లను అప్ర మత్తం చేసింది. బీజేపీ సైతం ఇదేదారిలో కీలక నిర్ణయాలు తీసుకుంటోం ది. జనసేన తమ పార్టీ అభ్యర్థుల కదలికలు, ప్రచారం గమనిస్తూనే ఉంది. చెక్కుచెదర కుండా ఓటుకోసం వ్యూహం. తెలుగు దేశం, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి సార్వత్రిక ఎన్నికల్లో 14 అసెంబ్లీ నియోజక వర్గాల్లోనూ, రెండు పార్లమెంటరీ సీట్లలోనూ పోటీకి తలపడుతున్నాయి. ఏలూరు జిల్లాలో మూడు అసెంబ్లీ స్థానాలు, విభజిత పశ్చిమలో మూడు అసెంబ్లీ స్థానాలు మిత్రపక్షాలు తరపున ఉండగా, మిగతా స్థానాల్లో టీడీపీ బల పరిచిన అభ్యర్థులే పోటీ చేస్తున్నారు. ఎప్పుడైతే మూడుపార్టీల మధ్య అధికారికంగా పొత్తు కుదిరిందో ఆనాటి నుంచే ఓటు చెదరకుండా అధికార వైసీపీ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకునేలా కూటమి అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధిపతి పవన్‌కల్యాణ్‌ ఓటు బదలాయింపు పక్కాగా జరగాలని బహిరంగంగా పిలుపు ఇచ్చారు. ఉంగుటూరు నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు రెండులక్షలకు మందికి పైగానే ఉన్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ జనసేన ఒంటరిగా పోటీ చేయగా, 11 వేలకు పైగా ఓట్లు లభించాయి. అక్కడ అదే తెలుగుదేశం పార్టీకి 60వేల ఓట్లు దక్కాయి. ఇప్పుడు ఉంగుటూరు నుంచి జనసేన అభ్యర్థి ధర్మరాజు, టీడీపీ, బీజేపీ మద్దతుతో రంగంలో ఉన్నారు. ఈ రెండు పార్టీల కు చెందిన అనుకూల ఓట్లు జనసేన వైపు మళ్ళాలి. ఇంత పెద్దమొత్తంలో ఓట్ల బదలాయింపు జరగాలంటే పార్టీల మధ్య పరస్పర సహకారం తప్పనిసరి. దీన్నే తెలుగుదేశం గమ నించి తమకు ఉన్న బలాన్ని జనసేన అభ్యర్థికి మళ్ళేలా చూడాలి. బీజేపీ ఇప్పటి నుంచే గ్రామగ్రామాన ఇదే పంథాలో పయనించాలి. అప్పుడే ఉమ్మడి అభ్యర్థి అలవోకగా గెలుస్తారన్న అంచనాల్లో కూటమి ఉంది. భీమవరం,

తాడేపల్లిగూడెం, నరసాపురం అసెంబ్లీ స్థానాల్లో జన సేన అభ్యర్థులు బొలిశెట్టి శ్రీనివాస్‌, భీమవరం అంజిబాబు, నరసాపురం బొమ్మిడి నాయకర్‌ పోటీ చేస్తున్నందున కూటమిలో టీడీపీ, బీజేపీ ఓట్లు ఆసాంతం బదిలీ కావాల్సిందే. నియోజకవర్గాల వారీగా పరస్పర సమ న్వయంతో పాటు ప్రత్యర్థి పార్టీలు ఎత్తుగడలను చిత్తుచేసేలా అప్రమత్తం కావాల్సిందేనని కూటమి పార్టీల అధినేతలు ఇప్పటికే తమ కేడర్‌కు పిలు పునిచ్చారు. ఎందుకనంటే వచ్చే ఎన్నికల్లో అధికార వైసీపీ ధనబలం, కండబలం ప్రయోగిస్తుందనే అనుమానాలు ఓటర్లలో తాండవిస్తున్నాయి. పోలవరం వంటి నియోజకవర్గాల్లో విస్తీర్ణంలోనూ, ఓటర్ల సంఖ్యలోనూ అత్యధికమే. ఈ నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య రెండున్నర లక్షలమందికి పైగానే ఉంది. మారుమూల గిరిజన గ్రామాలు, ముంపు మండలాల్లో కాలి నడకన ప్రయాణించాల్సిన కుగ్రామాలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి సంక్లిష్ట నియోజకవర్గంలో రాజకీయ వ్యూహం అక్కడ ఓటర్లను ఒప్పించేదిగా నమ్మించేదిగా ఉండాలనేదే ప్రధాన పక్షాల అంతరంగికం. దీన్నిబట్టే ఇప్పటి నుంచే వ్యూహాలకు పదును పెట్టడం తాము వేసే ఎత్తుగడలు బయటకు పొక్కకుండా జాగ్రత్త పడడం, కూటమి ప్రత్యర్థి పార్టీలను ఒక కంట కని పెట్టి ఉండడం వంటివి పాటించాలంటూ కూటమి నాయకత్వం కేడర్‌ను అప్రమత్తం చేస్తూనే అభ్యర్థులకు ఈ దిశగా మార్గనిర్దేశం చేస్తున్నారు.

ఓటర్లకు రాజకీయాలు కొత్తేమి కాదు

‘ఇంతకు ముందు ఓటర్లు ఎన్నో ఎన్నికలు చూశారు. రాజకీయ పక్షాల పరస్పర పొత్తులను చూశారు. ఎవర్ని గెలిపించాలో వారికి విజ్ఞత ఉంది. పదేపదే వారికి అవగాహన కలిగించేలా ఇప్పటికే స్థానిక నాయకత్వం ఎలాగో ముందు ఉంది. ఒక్క ఓటుగుర్తు విషయంలో కొన్ని నియోజకవర్గాల్లో ప్రత్యేకించి ఓటర్లకు గుర్తు చేయాల్సి ఉన్నా ఇప్పటికే ఆ మేరకు ఓటర్లు కూడా చైతన్యవంతమైనట్లే కనిపిస్తోంది’.. ఈ తరహా సమాధానమే పార్టీలో ఉన్న సీనియర్ల మధ్య వినబడుతోంది.

ఎంపీ అభ్యర్థుల సంగతేంటి..?

ఇటు ఏలూరు పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం బల పరిచిన బీసీవర్గాల అభ్యర్థి పుట్టా మహేష్‌ కుమార్‌ యాదవ్‌ అటు నరసా పురం లోక్‌సభ స్థానంలో బీజేపీ బలపరిచిన అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస వర్మ పోటీలో ఉన్నారు. వీరిద్దరు గెలుపుతో పాటు అత్యధిక మెజార్టీ పొందా లనుకుంటే అధికార వైసీపీ ఎత్తుగడలను ఓవైపు గమనిస్తూనే ఇంకోవైపు కూటమిలోని పార్టీల నుంచి తమకు అనుకూలంగా ఓటు బదిలీ జరిగేలా జాగ్రత్త పడాల్సి ఉంది. కూటమి ఎంపీ అభ్యర్థులు ఇద్దరికి ఇప్పుడు ఇదే అగ్నిపరీక్ష. వీరిద్దరూ ఒకింత సానుకూలత కలిగిన వ్యక్తిత్వంతో ఉండడంతో ఆ మేరకు పార్టీల మధ్య సమన్వయానికి ప్రత్యక్ష సహకారానికి ముందుండి చర్యలు తీసుకుంటున్నారు. నరసాపురంలో శ్రీనివాసవర్మ, ఏలూరులో మహేష్‌కుమార్‌ ఇద్దరు అసెంబ్లీ స్థానాల్లో పోటీలో ఉన్న అభ్యర్థులతో పూర్తి సహకారంతో ఉండడంతో వారికి కలిసొచ్చే అంశంగానే కనిపిస్తోంది. అయినా కూడా ఏలూరు, నరసాపురం స్థానాల్లో ఓటుబదిలీ అత్యంత ముఖ్యంగా భావిస్తున్నారు.

Updated Date - Apr 25 , 2024 | 12:47 AM