Share News

పంటకు గండం

ABN , Publish Date - Nov 12 , 2024 | 12:53 AM

సార్వా పంటకు చివరిలో వాతావరణం గండంగా మారింది.

పంటకు గండం
భీమవరం మండలంలో మాసూళ్ల దశకు చేరుకున్న సార్వా పంట

మరో పదిరోజుల్లో మాసూళ్ళు ముమ్మరం అయ్యే అవకాశం

వర్షాలు పడితే మాసూళ్ళకు అడ్డంకి

తగ్గనున్న దిగుబడి

జిల్లాలో తుది దశకు లక్షా 80 వేల ఎకరాల పంట

భీమవరం రూరల్‌, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): సార్వా పంటకు చివరిలో వాతావరణం గండంగా మారింది. అల్పపీడనం ప్రభావంతో సోమవారం మధ్యాహ్నం నుంచి మేఘాలు కమ్ముకున్నాయి. దీంతో రైతులలో కంగారు మొదలైంది. పంట మాసూళ్ళు సమయం దగ్గర పడుతున్న తరుణంలో వర్షాలు పడితే నష్టం తప్పదనే భయం నెలకొంది. గత ఏడాది సార్వా పంట మాసుళ్ళు దగ్గరకు వచ్చిన తరువాత వర్షాలు పంటను నిండా ముంచేసింది. జిల్లా 55 వేల ఎకరాలు భారీగా దెబ్బతింది. దిగుబడి పడిపోయింది. కొన్ని చోట్ల పంట మసూళ్లు చేయలేదు. ఈ ఏడాది సార్వా పంటను ప్రకృతి ఆది నుంచి వర్షాలు రూపేణ ముంచుతూనే వచ్చింది. దాని కారణంగా జిల్లాలో 20 వేల ఎకరాల్లో సాగు నిలిచిపోయింది. 30వేల ఎకరాల్లో సాగు నాట్లు సమయంలో బాగా దెబ్బతింది. చివరికి లక్ష 65వేల ఎకరాల పంట సాగు చివరి దశకు చేరుకున్న సమయంలో వాతావరణం మార్పు నెలకొంది. గత ఏడాదిలా ముంచుతుందనే భయం నెలకొంది. వర్షాలు పడితే వరి చేను నేలకొరగడం.. చేలల్లో నీరు చేరుతుంది. దీంతో పంట మాసుళ్ళు ఆలస్యం, దిగుబడి తగ్గిపోయే అవకాశం ఉంది. ఈ సమయంలో వర్షాలు పడకుండా ఉంటేనే సాగు గట్టెక్కుతుందని రైతులు చెబుతున్నారు.

Updated Date - Nov 12 , 2024 | 12:53 AM