Share News

రావిపాడులో అదే ఉద్రిక్తత

ABN , Publish Date - May 30 , 2024 | 12:10 AM

రావిపాడు స్థల వివాదంలో రెండో రోజు బుధవారం ఉద్రిక్తత కొనసాగిం ది. మంగళవారం రాత్రి అంబేద్కర్‌ విగ్రహాన్ని వివాద స్థలం నుంచి తొలగించడంతో దళితులు పోలీసులపై రాళ్ల దాడి చేయడంతో పలువురు గాయపడ్డారు.

రావిపాడులో అదే ఉద్రిక్తత
పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్న సైనికాధికారి భార్యను అడ్డుకుంటున్న పోలీసులు

ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సైనికాధికారి భార్య

అడ్డుకున్న పోలీసులు.. అదనపు బలగాల మోహరింపు.. దారులన్నీ నాకాబందీ

పలువురిపై కేసులు నమోదు.. కౌంటింగ్‌ తర్వాత సమస్య పరిష్కారానికి కలెక్టర్‌ హామీ

పెంటపాడు/తాడేపల్లిగూడెం రూరల్‌, మే 29 : రావిపాడు స్థల వివాదంలో రెండో రోజు బుధవారం ఉద్రిక్తత కొనసాగిం ది. మంగళవారం రాత్రి అంబేద్కర్‌ విగ్రహాన్ని వివాద స్థలం నుంచి తొలగించడంతో దళితులు పోలీసులపై రాళ్ల దాడి చేయడంతో పలువురు గాయపడ్డారు. దీంతో గ్రామంలో అద నపు బలగాలను మోహరించారు. నాకా బందీ నిర్వహించా రు. వివాదాస్పద స్థలంలో ఇంటి నిర్మాణం చేపడుతున్న సుభే దార్‌ మేజర్‌ పలివెల నాగేశ్వరరావు గ్రామానికి చేరుకున్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులతో చర్చించారు. ఒక సర్వే నెంబర్‌ స్థలాన్ని కేటాయించగా వేరొక సర్వే నెంబర్‌ స్థలంలో ఇంటి నిర్మాణం చేస్తున్నారని, 24 గంటల్లో స్థలాన్ని ఖాళీ చేయాలని తహసీల్దార్‌ సురేష్‌బాబు నోటీసు ఇచ్చారు. వీఆర్‌ వో కృష్ణస్వామి నోటీసును సైనికాధికారి ఇంటి గోడకు, నిర్మి స్తున్న ఇంటికి అంటించడంతో దీనిని నాగేశ్వరరావు, అతని భార్య విజయలక్ష్మి ప్రతిఘటించారు. ఆర్‌ఐ కనకదుర్గ, వీఆర్‌వో కృష్ణస్వామి తమకు పొజిషన్‌ ఇచ్చిన స్థలంలోనే ఇంటిని నిర్మి స్తున్నామని, ఇప్పుడు తప్పంతా తమపై నెడుతూ నోటీసు ఇవ్వడంపై నాగేశ్వరరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఇంటి నిర్మాణానికి రూ.8 లక్షల వరకు ఖర్చు చేసిన తర్వాత మీకిచ్చిన స్థలం ఇది కాదనడం ఎంత వరకు సమంజ సమన్నారు. ఇంటికి అంటించిన నోటీసును వెంటనే తీయాలని కోరడంతో అధికారులకు, బాధితులకు మధ్య వాగ్వాదం జరి గింది. విజయలక్ష్మి ఇంట్లోకి వెళ్లి పెట్రోల్‌ తెచ్చుకుని ఒంటిపై పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడంతో పోలీసులు అడ్డుకుని ఆమెను ఇంటిలోకి తీసుకు వెళ్ళారు. ఈ విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసు కువెళ్లాలని, ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడ వద్దని పోలీసు అధికారులు నాగేశ్వరరావును కోరారు. అనంతరం వారు భీమవరం వెళ్లి జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ను కలిసి తమ గోడు చెప్పుకున్నారు. దీనిపై కలెక్టర్‌ స్పందిస్తూ ఎన్నికల కౌంటింగ్‌ పూర్తయ్యే వరకు స్థలం జోలికి వెళ్ళవ ద్దని సూచించారు. తర్వాత ఇరు వర్గాల పెద్దలను పిలిచి సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఎయిర్‌ వెటరన్స్‌ అసోసియేషన్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి తనుబుద్ధి భోగేశ్వ రావు బాధిత కుటుంబానికి సంఘీభావం తెలిపారు. గ్రామం లో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఏఎస్పీలు భీమారావు, భాషా, డీఎస్పీ మూర్తి పర్యవేక్షించారు.

60 మందిపై కేసులు

రావిపాడులో పోలీసులపై దాడికి పాల్పడిన 60 మందిపై కేసులు నమోదు చేసినట్టు తాడేపల్లిగూడెం డీఎస్పీ మూర్తి తెలిపారు. సీఐ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ ఇరు వర్గాలను శాంతింపజేసి వివాదాన్ని సర్దుబాటు చేసే క్రమంలో దళిత యువకులు, పెద్దలు పోలీసులపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. దాడిలో పట్టణ ఎస్‌ఐ సుధాకరరెడ్డితో పాటు, నలుగురు కానిస్టేబుళ్లకు గాయాలు కావడంతో 60 మందిపై నాన్‌ బెయిలబుల్‌ కేసులు నమోదు చేసినట్టు డీఎస్పీ వివరించారు. సుబేదారు భార్యపై దాడి చేశారనే ఫిర్యాదు, ఎస్సీ వర్గీయులను కులం పేరుతో దూషించారనే ఫిర్యాదుతో పలు కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. రూరల్‌ సీఐ ఎ.రమేష్‌, ఎస్‌ఐ శీలం శంకర్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - May 30 , 2024 | 12:10 AM