Share News

ఏకసభ్య కమిషన్‌కు వినతుల వెల్లువ

ABN , Publish Date - Dec 28 , 2024 | 12:34 AM

ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్‌ చైర్మన్‌, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి రాజీవ్‌ రం జన్‌ మిశ్రా కలెక్టరేట్‌లో వినతులు స్వీకరించారు.

ఏకసభ్య కమిషన్‌కు వినతుల వెల్లువ

ఏలూరు టూటౌన్‌, డిసెంబరు 27 (ఆంధ్ర జ్యోతి): ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్‌ చైర్మన్‌, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి రాజీవ్‌ రం జన్‌ మిశ్రా కలెక్టరేట్‌లో వినతులు స్వీకరించారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి షెడ్యూల్డ్‌ ఉప కులాల వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం రం జన్‌ మిశ్రాను నియమించింది. ఏసభ్య కమిషన్‌ జిల్లాల పర్యటనలో భాగంగా శుక్రవారం ఏలూ రు జిల్లా కలెక్టరేట్‌లో ఎస్సీ ఉపకులాల ప్రతిని ధులు, ఉద్యోగులు, న్యాయవాదులు, ప్రజల నుం చి వినతులు స్వీకరించారు. వినతుల స్వీకరణతో పాటు వారి అభిప్రాయాలను కూడా రాజీవ్‌ రంజన్‌ మిశ్రా విన్నారు. వినతులన్నిటిని పూర్తి గా పరిశీలించి నివేదిక ప్రభుత్వానికి అందిస్తా మని మిశ్రా స్పష్టం చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరిజిల్లా ఎస్సీ కులాలకు చెందిన వారు వినతులు సమర్పించారు. ఇంకా ఎవరైన విన తులు ఇవ్వనివారుంటే విజయవాడ గిరిజన సంక్షేమ శాఖ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్‌ కార్యాలయంలో అంది ంచాలన్నారు. మెయిల్‌ ద్వారా వచ్చే ఏడాది జనవరి 9వ తేదీ లోపు పంపాలన్నారు. కార్యక్ర మంలో సుమారు ఎస్సీ ఉపకులాలకు చెందిన 600మంది హాజరయ్యి 132 విజ్ఞాపనలు అంద జేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ కె.వెట్రి సెల్వి, జిల్లా ఎస్పీ శివకిశోర్‌, డీఆర్వో విశ్వే శ్వరరావు, సోషల్‌ వెల్ఫేర్‌ జేడీ జయప్రకాశ్‌, డీఎస్పీ శ్రావణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

ఉపకులాల సమాచారం ఇవ్వండి

షెడ్యూల్డ్‌ ఉప కులాల సమాచారాన్ని అందిం చాలని ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్‌ చైర్మన్‌ రాజీవ్‌రంజన్‌ మిశ్రా అన్నారు. జిల్లా కలెక్టరేట్‌లో శుక్రవారం అధికారులతో సమావేశం అయ్యారు. అధికారులకు కమిషన్‌ ఉద్దేశాన్ని దిశానిర్ధేశం చేశారు.

పోటాపోటీగా వినతి పత్రాలు

రాజీవ్‌ రంజన్‌ మిశ్రాకు కలెక్టరేట్‌లో ఎస్సీ ఉపకులాలకు చెందిన ప్రతినిఽధులు, సంఘాలు, వ్యక్తులు వినతిపత్రాలు సమర్పించారు. వినతిపత్రాలు సమర్పించిన వారిలో ఎంఆర్‌ పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు కందుల రమేష్‌, అంబే డ్కర్‌, ఫూలే వేదిక చైర్మన్‌ నేతల రమేష్‌బాబు, దళితహక్కుల పోరాట అధ్యక్షుడు జుజ్జవరపు ప్రతాప్‌కుమార్‌, రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాబి, షెడ్యూల్‌ కులాల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ మెండెం సంతోష్‌కుమార్‌, ఏపీ మాల ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు బేతాళ సుదర్శన్‌, పీవీ.సుబ్బారావు, సాయిరాజు, సుబ్బా రావు, ఎస్సీ, ఎస్టీ బహుజన్‌ రైట్స్‌ సొసైటీ ప్రొటెక్షన్‌ అధ్యక్షులు మేతర అశోక్‌, వినుకొండ రామయ్య, మాలమహానాడు జాతీ య అధ్యక్షు లు అలగా రవికుమార్‌, బహుజ నసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మత్తే కుమార్‌, ఎంఆర్‌పీఎస్‌ జాతీయ అధ్యక్షుడు ఎం.నాగరాజు, ఎంఎస్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు కాశీవిశ్వనాధ్‌, రాష్ట్ర ఎంఆర్‌పీ ఎస్‌ అధ్యక్షులు ఆర్‌.సురేష్‌, బయ్యార పు రాజేశ్వ రరావు తదితరులు వినతిపత్రాలు అందించారు. అనంతరం ఇండోర్‌ స్టేడియం వద్ద ఎస్సీలోని ఉపకులాల నాయకులు, కార్యకర్తలు పోటాపోటీగా నినా దాలు చేశారు. ఒకవర్గం ఎస్సీ వర్గీకరణ వద్దని, మరో వర్గం వర్గీకరణ కావాలని నినా దాలు చేశారు. పోలీసు లు కలుగజేసుకుని ఎటువంటి అవాంచ నీయ సంఘటనలు జరగకుండా కుల సంఘాల నాయకులను పంపించి వేశారు. చింతల పూడి, ప్రగడవరం గ్రామాలకు చెందిన ఎంఆర్‌పీఎస్‌, మాలల జేఏసీ ఆధ్వ ర్యంలో విడివిడిగా తమ అభిప్రాయాలను విజ్ఞా పన పత్రాల రూపంలో చైర్మన్‌కు అందజేశారు.

పటిష్ట పోలీసు బందోబస్తు

ఏలూరు క్రైం, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి) : ఏలూరు విచ్చేసిన ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్‌ చైర్మన్‌ రాజీవ్‌రంజన్‌ మిశ్రాకు శుక్రవారం జిల్లా ఎస్పీ కేపీఎస్‌ కిషోర్‌ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలం, వ్యతిరేక వాదనలు వినతిపత్రాల రూపంలో కలెక్టరేట్‌లో ఆయన స్వీకరించిన నేపథ్యంలో కలెక్టరేట్‌కు 500 మీటర్ల దూరం నుంచి అన్ని రోడ్లను పోలీసులు దిగ్బంధం చేశారు. ముగ్గురు కంటే ఎక్కువగా గుమ్మిగూడి ఉండకుండా ముందస్తుగా జిల్లా ఎస్పీ కిశోర్‌ ఆదేశాల మేరకు ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్‌ కుమార్‌ పర్యవేక్షణలో త్రి టౌన్‌ సీఐ ఎస్‌.కోటేశ్వరరావు ఆధ్వర్యంలో అడుగడుగునా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వినతిపత్రాలు స్వీకరించారు. అప్పటి వరకు పోలీసులు అప్రమత్తంగానే ఉన్నారు. ఎక్కడా ఎలాంటి అల్లర్లు జరుగకుండా ముందస్తుగా ఒక డీఎస్పీ, 9 మంది సీఐలు, 20 మంది ఎస్‌ఐలు ఇతర పోలీస్‌ సిబ్బంది మొత్తం 300 మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు.

Updated Date - Dec 28 , 2024 | 12:34 AM