Share News

భూ సమస్యలు పరిష్కరిస్తాం

ABN , Publish Date - Dec 13 , 2024 | 12:38 AM

రెవెన్యూ సదస్సుల్లో భాగంగా వచ్చిన వినతులపై తక్షణ చర్యలు తీసుకుంటామని, బాధితులకు న్యాయం చేస్తామని తహసీల్దార్‌ గెడ్డం ఎలీషా అన్నారు.

భూ సమస్యలు పరిష్కరిస్తాం
జగన్నాథపురంలో వినతులు స్వీకరిస్తున్న ఎమ్మెల్యే చిర్రి బాలరాజు

రెవెన్యూ సదస్సులలో వినతులు స్వీకరించిన అధికారులు

కామవరపుకోట, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): రెవెన్యూ సదస్సుల్లో భాగంగా వచ్చిన వినతులపై తక్షణ చర్యలు తీసుకుంటామని, బాధితులకు న్యాయం చేస్తామని తహసీల్దార్‌ గెడ్డం ఎలీషా అన్నారు. మండలంలోని రామన్నపాలెంలో గురు వారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ప్రజలు, రైతుల నుంచి వినతులు స్వీకరించి వాటిపై విచా రణకు ఆదేశించారు. మాజీ ఎంపీపీ మద్దిపోటి నాగేశ్వర రాంబాబు, సుబ్బలక్ష్మి, ఆర్‌ఐ రామకృష్ణ, వీఆర్వోలు నాగరాణి, రాటాలు, కంకిపాటి నాగేశ్వర రావు, స్థానికులు పాల్గొన్నారు.

పెదవేగి: భూసమస్యల పరిష్కారమే లక్ష్యంగా రెవెన్యూ సదస్సు లక్ష్యమని తహసీల్దారు ఎస్డీ.భ్రమరాంబ అన్నారు. వంగూరులో పలువురు రైతులు రెవెన్యూ సంబంధ అంశాలపై వినతులు అందించారు. ప్రధానంగా రైతుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా గ్రామసభల నిర్వహణ జరుగుతోందన్నారు. సర్పంచ్‌ చీలి రూతు జోసఫ్‌, ఆర్‌ఐ కేఐవీ.సారధి, సర్వేయర్‌ సత్యనారాయణ మూర్తి, సుంకర భాస్కరరావు, గోపిశెట్టి లక్ష్మీనారా యణ తదితరులు పాల్గొన్నారు.

బుట్టాయగూడెం: అలివేరు పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో భూములున్న రైతులకు పట్టాదారు పాస్‌ పుస్తకాలు మంజూరు చేయా లని, పేర్లను ఆన్‌లైన్‌ చేయాలని కొండరెడ్లు, గిరిజనులు తహసీల్దార్‌ పీవీ.చలపతిరావుకు విన తిపత్రం అందజేశారు. పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో కొండరెడ్లు, కోయ గిరిజనుల భూము లు తమ పూర్వీకుల పేరిట ఉన్నాయని, వారంతా చనిపోయి 40 ఏళ్లు కావస్తుందని తహసీల్దార్‌ దృష్టికి తెచ్చారు. ఎవరికీ పట్టాదారు పాస్‌ పుస్తకా లు మంజూరు కాలేదన్నారు. బ్యాంకు రుణాలు, రైతు భరోసా, సబ్సిడీలు కోల్పోతున్నామని అధికా రులకు తెలిపారు. రైతులందరికీ పాస్‌ పుస్తకాలు, ఆన్‌లైన్‌ అడంగల్‌, 1బి నమోదు చేయాలని కోరారు. సర్పంచ్‌ కారం లక్ష్మీ, ఎంపిటిసి కొవ్వాసు గోవిందరాజు, కారం రాఘవ, కారం వాసు రెవిన్యూ, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.

జంగారెడ్డిగూడెం: మండలంలోని లక్కవ రంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. తహసీ ల్దారు కె.స్లీవజోజి అధ్యక్షతన సదస్సులో 40 అర్జీలను స్వీకరించారు. వాటిలో 35 సమస్యలను పరిష్కరించినట్లు తహసీల్దారు తెలిపారు. డీటీ రమేష్‌, నాయకులు పాల్గొన్నారు.

జీలుగుమిల్లి: భూముల రక్షణకు ప్రభుత్వం రెవెన్యు సదస్సులు నిర్వహిస్తుందని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అన్నారు. జగన్నాథపురంలో జరిగిన రెవెన్యు సదస్సులో ఆయన పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రెండో సంతకం ల్యాండ్‌ టైటిల్‌ యాక్ట్‌ రద్దు చేసేందుకు సీఎం చేశారన్నారు. భూ సమస్యలపై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. గ్రామంలో పేద లకు ఇళ్ల పట్టాలు మంజూరు అవకతవకలపై విచారణ జరపాలని అధికారులకు ఎమ్మెల్యే సూ చించారు. తాగునీటి సమస్య పరిష్కరించేందుకు బోరు మోటరు ఏర్పాటు చేస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. గడ్డమణుగు రవికుమార్‌, పసుపులేటి రాము, సరిపల్లి సత్యనారాయణరాజు, కొర్రి అశోక్‌, మడివి నారాయణ, చిర్రి శ్రీను, జమ్మి గోపి ఉన్నారు.

Updated Date - Dec 13 , 2024 | 12:38 AM