Share News

భూ సమస్యలు చెప్పండి

ABN , Publish Date - Dec 21 , 2024 | 12:21 AM

గ్రామీణ ప్రాంతాల్లో రైతుల రెవెన్యూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తుందని తహసీల్దార్‌ గెడ్డం ఎలీషా అన్నారు.

భూ సమస్యలు చెప్పండి
పెదపాడు రెవెన్యూ సదస్సులో అధికారులకు అర్జీ ఇస్తున్న రైతులు

రెవెన్యూ సదస్సులలో అర్జీలు స్వీకరించిన అధికారులు

కామవరపుకోట, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లో రైతుల రెవెన్యూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తుందని తహసీల్దార్‌ గెడ్డం ఎలీషా అన్నారు. మండలంలోని గుంటుపల్లి పంచాయతీ జీలకర్రగూడెం సచివాలయం వద్ద శుక్రవారం సదస్సు నిర్వహించారు. రైతుల నుంచి అర్జీలను స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్‌ఐ పి.రామకృష్ణ, వీఆర్వో ప్రభాకరరావు, గ్రామ కార్యదర్శి బి.రత్నకుమారి, స్థానికులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

పెదపాడు: భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించడానికి రెవెన్యూ సదస్సులు నిర్వహి స్తున్నట్లు టీడీపీ నేత గుత్తా అనిల్‌ తెలిపారు. పెదపాడు సదస్సులో పలు సమస్యలపై దరఖా స్తులను స్వీకరించారు. అర్జీలను ఆన్‌లైన్‌ చేసి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తహ సీల్దారు కృష్ణజ్యోతి తెలిపారు. బొప్పన బాబ్జి, గారపాటి మోహనరావు, ఖండవల్లి జరహో, దావాల రమేష్‌, వీఆర్వోలు నరసింహా, ప్రసాద్‌, ఇవో వినోద్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

బుట్టాయగూడెం: రవ్వారిగూడెం, మెరక గూడెంలో రెవెన్యూ సదస్సులను తహసీల్దార్‌ పీవీ.చలపతిరావు నిర్వహించారు. పట్టాదారు పాస్‌ పుస్తకాలను మంజూరు చేయాలని, సాగు లో ఉన్నవారి పేర్లను ఆన్‌లైన్‌లో నమోదు చేయా లని గిరిజనులు అధికారుల దృష్టికి తెచ్చారు. రెవెన్యూ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

పెదవేగి: భూసమస్యల పరిష్కారమే గ్రామసభ లక్ష్యమని మండల ప్రత్యేకాధికారి ఎ.రామ్‌కుమార్‌ అన్నారు. భోగాపురంలో పలువురు రైతులు భూసమస్యలపై వినతులు అందించారు. ఆర్‌ఐ కేఐవీ.సారధి, సర్వేయర్‌ సత్యనారాయణ మూర్తి, బీహెచ్‌ ఎన్వీ.కృష్ణంరాజు పాల్గొన్నారు.

లింగపాలెం: దీర్ఘకాలిక అపరిష్కృత భూ సమస్యలు రెవెన్యూ సదస్సుల్లో పరిష్కరిస్తామని తహసీల్దార్‌ నజీముల్లా షా అన్నారు. పాచ్చ్యానగరంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. రైతుల నుంచి భూసమస్యలపై అర్జీలను స్వీకరించారు. 45రోజులలో సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. 12 అర్జీలు రాగా 7 అర్జీలను పరిష్కరించామన్నారు. డీటీ నాగబాబు, సర్పంచ్‌లు యలమంచి శ్రీనివాసరావు, తొమ్మండ్రు మోహనరావు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Dec 21 , 2024 | 12:21 AM