రోడ్డా.. చెరువా..
ABN , Publish Date - Nov 08 , 2024 | 12:34 AM
ఇటీ వల కురిసిన భారీ వర్షాలకు మండలంలో పలు రహదారులు దెబ్బతినడంతో ప్రయాణికులు, వా హనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుర్వాయిపాలెం నుంచి పెదలంక వరకు 10 కిలోమీటర్ల మేర పెద్ద పెద్ద గోతులు పడడంతో వర్షపు నీరు గోతుల్లో నిల్వ ఉండి చెరువులను తలపిస్తున్నాయి.
వర్షాలకు ధ్వంసమైన గ్రామీణ రహదారులు
కలిదిండి, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి) : ఇటీ వల కురిసిన భారీ వర్షాలకు మండలంలో పలు రహదారులు దెబ్బతినడంతో ప్రయాణికులు, వా హనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుర్వాయిపాలెం నుంచి పెదలంక వరకు 10 కిలోమీటర్ల మేర పెద్ద పెద్ద గోతులు పడడంతో వర్షపు నీరు గోతుల్లో నిల్వ ఉండి చెరువులను తలపిస్తున్నాయి. ఈ రహదారిపై ఆర్టీసీ బస్సుల రాకపోకలు నడపడానికి అధికారులు అభ్యంతరం తెలుపుతున్నారు. యడవల్లి– మట్ట గుంట ప్రధాన రహదారిపై పెద్ద గోతులు పడడంతో వాహనాలు గోతుల్లో దిగబడుతున్నాయి. గంటల తరబడి వాహనాల రాపోకలకు అంతరాయం కలుగు తోంది. వాహనదారులు ఈ మార్గాల్లో ప్రయాణం చేయాలంటేనే హడలిపోతున్నారు. వర్షానికి గోతు ల్లో నీరు ఉండటంతో అవి ఎంత లోతు ఉన్నా యో అంచనా వేయలేక ద్విచక్ర వాహనదారులు గోతుల్లో పడి క్షతగాత్రులవుతున్నారు. కాళ్లపాలెం – తాడినాడ ప్రధాన రహదారి గోతులమయంగా మారింది. చినతాడినాడ వయా పోతుమర్రు, కలి దిండి రహదారి గోతులు పడి కంకర పైకి లేచిపో వడంతో వర్షానికి బురదకయ్యగా మారింది. ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం రహదా రుల మరమ్మ తులు పట్టించుకోకపోవడం వల్లే రహదారులు గుంతలు పడి అధ్వానంగా మారాయని కొద్దిపాటి వర్షానికే చెరువులను తలపిస్తున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబం ధిత ఉన్నతాధికారులు స్పందించి రహదారుల మరమ్మతులకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.