Share News

గుంతలు.. గుడ్‌బై !

ABN , Publish Date - Nov 03 , 2024 | 12:56 AM

ఐదేళ్ల పాటు జిల్లాలో ఏ మూలకెళ్ళినా గుంతలో పడాల్సిందే. కొందరేమో తీవ్ర ప్రమాదాలకు గురై మరణం అంచు వరకు వెళ్లొచ్చినవారే. దాదాపు డజన్ల సంఖ్యలో క్షతగాత్రులు. గుంత పూడ్చండి సామీ అంటే అప్పటి పాలకులంతా అదేదో నేరమ న్నట్టుగా ఎగాదిగా చూసేవారు.

గుంతలు.. గుడ్‌బై !
గోపన్నపాలెంలో రోడ్డుపై గుంతలను పూడుస్తున్న మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌

ఇక గుంతల రహిత రహదారులే లక్ష్యం

జిల్లాలోని రోడ్లపై గుంతలు పూడ్చేందుకు రూ.76 కోట్లు

శాశ్వత మరమ్మతులకు మరో రూ.46 కోట్లు

అనువైన రోడ్ల కోసం అంతా కలిపి రూ.122 కోట్లు మంజూరు

రంగంలోకి అధికారులు, ప్రజాప్రతినిధులు

సంక్రాంతికి ముందే పూర్తయ్యేలా కార్యాచరణ

రాబోయే తొమ్మిది నెలల్లోనే శాశ్వత ప్రాతిపదికన పనులు

ఐదేళ్ల పాటు జిల్లాలో ఏ మూలకెళ్ళినా గుంతలో పడాల్సిందే. కొందరేమో తీవ్ర ప్రమాదాలకు గురై మరణం అంచు వరకు వెళ్లొచ్చినవారే. దాదాపు డజన్ల సంఖ్యలో క్షతగాత్రులు. గుంత పూడ్చండి సామీ అంటే అప్పటి పాలకులంతా అదేదో నేరమ న్నట్టుగా ఎగాదిగా చూసేవారు. ఇప్పుడు ఆ దిశ నుంచి ప్రజ లంతా రోడ్ల మీద హాయిగా వెళ్లేలా కూటమి ప్రభుత్వం సంక్రాంతి లోపే గుంతల రహిత రహదారులు ఉండేలా కార్యా చరణకు దిగింది. రాబోయే తొమ్మిది నెలల వ్యవధిలోనే శాశ్వత ప్రాతిపదికన రోడ్ల మరమ్మతుకు మరోప్లాను సమాంతరంగా అమలు చేస్తోంది.

(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి) :

గడిచిన ఐదేళ్లుగా పల్లె, పట్నం తేడా లేకండా రోడ్లన్నీ దెబ్బతిన్నాయి. రాష్ట్రీయ రహదారుల్లో అనేకచోట్ల స్విమ్మింగ్‌ పూల్‌ను తలపించేలా భారీ గుంతలు. ఏలూరు నుంచి జంగా రెడ్డిగూడెం వెళ్లాలన్నా, కొయ్యలగూడెం నుంచి తాడేపల్లి గూడెం వెళ్లాలన్నా, కైకలూరు నుంచి ఏలూరు రావాలన్నా అడుగడు గునా అవాంతరాలే. ఈ రోడ్లలో వాహనాలన్నీ పడీలేస్తూ ముందుకు సాగేవి. గంటల తరబడి ప్రయాణంలో జాప్యం. వర్షాకాలంలో జరిగిన ప్రమాదాల సంఖ్య ఇంతకుముందెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో నమోదు. ప్రభుత్వా సుపత్రు లకు వచ్చే రోడ్డు ప్రమాద క్షతగాత్రుల సంఖ్య మూడింతలు పెరిగిందంటే అప్పటి పరిస్థితి ఇట్టే అర్థమవుతుంది. కనీసం ఆర్‌అండ్‌బీ, పంచాయతీ రాజ్‌ పరిధిలో ఉన్న మార్గాలన్నింటిలో మరమ్మతులు చేస్తామంటూ పైకి గొప్పలు చెప్పడం, ఆచరణలో ఆ ప్రయత్నం చేయకపోవడం విచిత్రం. జగన్‌ పాలనలో ఎక్క డా గుంత పూడ్చేందుకు తట్టెడు మట్టి పోయలేదు. బడ్జెట్‌లో రహదారుల మరమ్మతులకు ఇంత మొత్తం కేటాయించామని ప్రకటించారే తప్ప నయాపైసా ఎక్కడా మరమ్మతులకు విడు దల చేయలేదు. ప్రధాన మార్గాలన్నింటిలోనూ ప్రయాణించే ఆర్టీసీ బస్సుల్లో అత్యధికం దెబ్బతిన్నాయి. గుంతలు పడిన రోడ్లలో ప్రయాణించలేక ప్రజలు పడిన పాట్లు అన్నీఇన్నీ కావు. తాము అధికారంలోకి వస్తే రోడ్ల మరమ్మతులు చేపడతామని ఎన్నికల తరుణంలో కూటమి పక్ష నేతలందరూ ప్రకటించారు.

గుంతల రహిత రహదారులు

గడిచిన ఐదేళ్లల్లో జనం పడిన పాట్లను దృష్టిలో పెట్టుకుని గుంతలు పడిన మార్గాలన్నింటిలోనూ మరమ్మతులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. శనివారం నుంచే ఈ ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమాల్లో భారీ సంఖ్య లోనే పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా దాదాపు 1,836 కిలోమీటర్ల మేర ఆర్‌అండ్‌బీ రహదారులు ఉండగా వీటిలో 932 కిలోమీటర్లు మేర మార్గమంతా గుంతలమయమైంది. తిరగడా నికి అవకాశమే లేకుండా పోయింది. ఆ పరిస్థితుల్లో కేవలం గుంతలు పూడ్చేందుకే ప్రభుత్వం రూ.76 కోట్లు కేటాయించింది. ముందస్తుగా గుర్తించిన గుంతలను పూడ్చి ఆమార్గంలోని ఆటం కాలను కొంతలో కొంత అధిగమించేలా చేయడం ప్రభుత్వం ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. తొలుత ఈ గుంతలు పూడ్చే కార్యక్రమం సంక్రాంతిలోపే పూర్తి కావాలని నిబంధన విధించిం ది. పనులు వేగవంతంగా ముందుకు సాగేలా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు దగ్గరుండి పర్యవేక్షించాలని ప్రభుత్వం సూచించింది. ఇంకోవైపు శాశ్వత ప్రాతిపదికన మార్గాలన్నింటికీ పనులు నిర్వహించేందుకు మరో రూ.46 కోట్లు కేటా యించారు. ఈ పనులన్నింటినీ కాంట్రాక్టర్లకు అప్పగించి రాబోయే తొమ్మిది నెలల కాలంలోనే పూర్తి చేసేందుకు వీలుగా నిధులు, కార్యా చరణ రూపొందించారు. జంగారెడ్డిగూడెం–ఏలూరు ప్రధాన మార్గంలో ఇప్పుడున్న అస్తవ్యస్త పరిస్థితులను తొలగించేందుకు వీలుగా తాత్కాలిక మరమ్మ తులకు దాదాపు రూ.కోటి 13 లక్షలు కేటాయించింది. తాజాగా గోపన్నపాలెం వద్ద మంత్రి కొలుసు పార్థసారఽథి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఉమ్మడిగా రోడ్లకు గుంతలు పూడ్చే కార్యక్రమానికి శనివారం శ్రీకారం చుట్టారు.

Updated Date - Nov 03 , 2024 | 12:56 AM