Share News

పంచారామాలకు ప్రత్యేక బస్సులు

ABN , Publish Date - Oct 23 , 2024 | 12:39 AM

కార్తీక మాసం సందర్భంగా నాలుగు ఆదివారాలు పంచారామ క్షేత్రదర్శిని టూర్‌ ప్యాకేజీ అందుబాటులోనికి తెచ్చినట్లు జిల్లా ప్రజా రవాణా శాఖాధికారి ఎన్‌వీఆర్‌.వర ప్రసాద్‌ తెలిపారు.

పంచారామాలకు ప్రత్యేక బస్సులు
పంచారామాల పోస్టర్‌ను అవిష్కరించిన ప్రజా రవాణా శాఖాధికారి వరప్రసాద్‌

కార్తీక మాసంలో ప్రత్యేక సర్వీసులు

ప్రజా రవాణా శాఖాధికారి వరప్రసాద్‌

భీమవరంటౌన్‌, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): కార్తీక మాసం సందర్భంగా నాలుగు ఆదివారాలు పంచారామ క్షేత్రదర్శిని టూర్‌ ప్యాకేజీ అందుబాటులోనికి తెచ్చినట్లు జిల్లా ప్రజా రవాణా శాఖాధికారి ఎన్‌వీఆర్‌.వర ప్రసాద్‌ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలోని ఆర్టీసీ డిపోల నుంచి బస్సు సర్వీసులు ఆదివారం బయలుదేరి సోమవా రం ఒక్కరోజులోనే అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట ఆల యాలను దర్శించుకుని వచ్చేవిధంగా ప్యాకే జీ అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. పల్లె వెలుగు రూ.720 ఎక్స్‌ప్రెస్‌ రూ.900 ఆలా్ట్ర డీలక్స్‌ రూ.1100 సూపర్‌ లగ్జరీ రూ.1200 టిక్కెట్‌ ధరలు నిర్ణయించినట్లు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని సర్వీసులను పెంచుతామన్నారు.ఆన్‌లైన్‌లో రిజర్వేషన్‌ సౌకర్యం కల్పించామన్నారు. పంచారామాలపై ప్రత్యేక దృష్టిపెట్టామని, భక్తులు సద్వినియోగంచేసుకోవాలన్నారు.

Updated Date - Oct 23 , 2024 | 12:39 AM