శశి కళాశాలకు ‘నాక్ ఏ ప్లస్’ గుర్తింపు
ABN , Publish Date - Dec 09 , 2024 | 12:34 AM
తాడేపల్లిగూ డెం శశి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ విద్యా సంస్థకు నేషనల్ అసెస్‌మెంట్ అక్రిడేషన్ కౌన్సిల్ (నాక్) నుంచి ఏ ప్లస్ గ్రేడ్ అందుకుంది.
తాడేపల్లిగూడెం రూరల్, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): తాడేపల్లిగూ డెం శశి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ విద్యా సంస్థకు నేషనల్ అసెస్‌మెంట్ అక్రిడేషన్ కౌన్సిల్ (నాక్) నుంచి ఏ ప్లస్ గ్రేడ్ అందుకుంది. గతనెల 22,23 తేదీల్లో నాక్ బృంద సభ్యులు కళాశాలలో విద్యానాణ్యత, అధ్యాపకులు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తదితర అంశాలు పరిశీలిం చిన అనంతరం సంస్థ అవార్డుకు ఎంపికచేసినట్టు ప్రిన్సిపాల్ మహ్మద్ ఇస్మాయిల్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థల్లో మెరుగైన ర్యాంకుల్లో ఒకటిగా నిలవడం వెనుక విద్యార్థుల సమగ్రాభివృద్ధి కోసం సంస్థ విశేషమైన చర్యలు కారణమని సంస్థ చైర్మన్ బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ, వైస్ చైర్మన్ మేకా నరేంద్రకృష్ణ ఆనందం వ్యక్తం చేశారు. శశి సంస్థకు నాక్ గుర్తింపు రావడం పట్ల ఉపాధ్యాయ సిబ్బందిని అభినందించారు.