Share News

31 వరకు అభ్యంతరాల స్వీకరణ

ABN , Publish Date - Dec 28 , 2024 | 12:55 AM

షెడ్యూల్డ్‌ కులాల గణన జాబితాలో అభ్యంతరాలుంటే అర్జీలు సమర్పించాలని జిల్లా కలెక్టర్‌ చదలవాడ నాగరాణి తెలిపారు.

31 వరకు అభ్యంతరాల స్వీకరణ
ఈవీఎంలను పరిశీలిస్తున్న కలెక్టర్‌ నాగరాణి

షెడ్యూల్డ్‌ కులాల గణన జాబితా విడుదల : కలెక్టర్‌

భీమవరం టౌన్‌, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): షెడ్యూల్డ్‌ కులాల గణన జాబితాలో అభ్యంతరాలుంటే అర్జీలు సమర్పించాలని జిల్లా కలెక్టర్‌ చదలవాడ నాగరాణి తెలిపారు. శుక్రవారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం నుంచి మండలస్థాయి అధికారులతో గూగుల్‌ మీట్‌ ద్వారా సమీక్షించారు. అన్ని మండలాలు, మునిసిపాలిటీ, గ్రామ, వార్డు సచివాలయాల్లోని నోటీసు బోర్డుల్లో ఈ నెల 26న జాబితాను ప్రకటించాం. మార్పులు, చేర్పులకు ఈ నెల 31 వరకు దరఖాస్తులను స్వీకరిస్తాం. ఈ లిస్టులో షెడ్యూల్డ్‌ కులం, ఉప కులం, విద్య, వృత్తి, గ్యాస్‌, గృహ వివరాల్లో అభ్యంతరాలపై దరఖాస్తు చేయాలి. వీటి ఆధా రంగా ఆన్‌లైన్‌లో వెరిఫికేషన్‌ చేయుటకు వచ్చే నెల పదో తేదీ గడువు. అనంతరం కులాల వారిగా జాబితాలను గ్రామ వార్డు సచివాలయాల్లో వచ్చే నెల 10న ప్రకటిస్తాం’ అని తెలిపారు. అలాగే ప్రాథమిక వ్యవ సాయ పరపతి సంఘాల సభ్యులు 1,43,123 మందికి ఈకేవైసీ పూర్తి చేయాల్సి ఉండగా శుక్రవారం వరకు 40 వేలు పూర్తి చేశారని 28వ తేదీ సాయంత్రంలోగా నూరు శాతం ఈ కేవైసీ పూర్తి చేసి నివేదికను సమర్పించాలని ఆదేశించారు. ప్రభుత్వ వైద్య సిబ్బంది మనసు పెట్టి పనిచేస్తే, పేదలు ఆర్థిక ఇబ్బందులకు గురికాకుండా కృషి చేయవచ్చని కలెక్టర్‌ నాగరాణి సూచించారు. శుక్రవారం త్యాగరాజ భవన్‌లో కలెక్టర్‌, వైద్య, ఆరోగ్య, స్త్రీ శిశు, సంక్షేమ శాఖల అధికారులు, సిబ్బందితో సమీక్షించారు. పేదలు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించి అప్పులపాలు కాకుండా చూసే బాధ్యత మీపై ఉందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలన్నారు. సాధారణ తనిఖీల్లో భాగంగా శుక్రవారం ఉదయం అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఈవీఎంలు భద్రపరచిన స్ట్రాంగ్‌ రూమ్‌ గోడౌన్‌లను కలెక్టర్‌ నాగరాణి, డీఆర్వో మొగిలి వెంక టేశ్వర్లు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి సందర్శించారు.

Updated Date - Dec 28 , 2024 | 12:55 AM