Share News

విద్యార్థులు క్రీడల్లో రాణించాలి

ABN , Publish Date - Nov 15 , 2024 | 12:25 AM

విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించా లని ఏపీ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ కమిషనర్‌ సెక్రటరీ సునీల్‌ రాజ్‌కుమార్‌ అన్నారు.

విద్యార్థులు క్రీడల్లో రాణించాలి
కబడ్డీ పోటీల్లో తలపడుతున్న క్రీడాకారులు

గురుకుల కళాశాల విద్యార్థుల జోన్‌ స్పోర్ట్స్‌

భీమడోలు, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించా లని ఏపీ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ కమిషనర్‌ సెక్రటరీ సునీల్‌ రాజ్‌కుమార్‌ అన్నారు. పోలసానపల్లి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ బాలికల గురుకుల కళాశాలలో జోనల్‌ –2 స్పోర్ట్స్‌మీట్‌ గురువారం ప్రారంభమైంది. క్రీడా పతాకావిష్కరణ, గౌరవవందనం అనంతరం క్రీడా జ్యోతి వెలిగించి అధికారులు పోటీలను ప్రారంభించారు. విద్యార్థినుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. క్రీడాపోటీలను సునీల్‌రాజ్‌కుమార్‌ ప్రారంభించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణా, తూర్పు గోదావరి ఉమ్మడి జిల్లాల పరిధిలోని 29 కళాశాలలకు చెందిన 1050 క్రీడాకారిణిలు, 60 మంది పీడీలు, పీఈటీలు పాల్గొన్నారు. కార్యక్రమంలో పశ్చిమ గోదావరి డీసీవో ఎం.భారతి, సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్‌ అధికారులు, ప్రిన్సిపాల్‌ వెంకట రమణ, పీడీలు పాల్గొన్నారు.

Updated Date - Nov 15 , 2024 | 12:25 AM