Share News

సొసైటీలకు త్రిసభ్య కమిటీలు

ABN , Publish Date - Dec 19 , 2024 | 12:28 AM

కూటమి నేతలవద్దకు క్యూ జనసేన ఉన్న చోట మిగిలిన వారికి చెరి సగం సహకార సంఘాల్లో కమిటీలపై ఊగిసలాట కు తెరపడింది. ఎన్నికలు నిర్వహించే వరకు త్రిసభ్య కమిటీలను నియమించనున్నారు. ఆ దిశగా కూటమి నేతలకు అధిష్ఠానం నుంచి సంకేతాలందాయి.

సొసైటీలకు త్రిసభ్య కమిటీలు

జిల్లాలో 122 సంఘాలు

ఆశావహుల ప్రయత్నాలు

కూటమి నేతలవద్దకు క్యూ జనసేన ఉన్న చోట మిగిలిన వారికి చెరి సగం సహకార సంఘాల్లో కమిటీలపై ఊగిసలాట కు తెరపడింది. ఎన్నికలు నిర్వహించే వరకు త్రిసభ్య కమిటీలను నియమించనున్నారు. ఆ దిశగా కూటమి నేతలకు అధిష్ఠానం నుంచి సంకేతాలందాయి. అధికారికంగా ఉత్తర్వులు రావాల్సి ఉంది. కూటమి నేతలు సిఫారసు చేసిన వారికే పదవులు వరించను న్నాయి. ప్రతి సహకార సంఘానికి ముగ్గురు సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తారు. అందులో ఒక అధ్యక్షుడు, ఇద్దరు సభ్యులకు అవకాశం ఉంటుంది.

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పటినప్పడి నుంచి ఆశా వహులు పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. ఒక దశలో ఎన్ని కలకు కూటమి ప్రభుత్వం మొగ్గు చూపుతుందని భావించారు. పార్టీ శ్రేణుల్లో ఇది కాస్త అసంతృప్తికి దారితీసింది. వైసీపీ హయాంలో ఐదేళ్లపాటు ఎంపిక చేసిన కమిటీలతోనే పాలన నిర్వ హించారు. ఎన్నికలు నిర్వహించలేదు. సహకార సంఘాలు, డీసీ ఎంఎస్‌, డీసీసీబీలకు చైర్మన్‌, సభ్యులను వైసీపీ ప్రజా ప్రతినిధు లు, నేతలే ఎంపికచేశారు. ఆ మేరకు పదవులు వరించాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీ హయాంలో ఏర్పా టైన కమిటీలను రద్దు చేసింది. కొత్త కమిటీలు వేస్తారని అంతా భావించారు. కూటమి నేతలు అధిష్ఠానానికి ఆ విధంగానే సూచ నలు చేశారు. కొన్నాళ్లపాటు నామినేటెడ్‌ ద్వారా కమిటీలను నియ మించాలని సూచించారు. కూటమి ప్రభుత్వం ఎట్టకేలకు నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు అధికారులే సొసైటీలకు పర్సన్‌ ఇన్‌ఛా ర్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. ఇకపై కమిటీలు ఏర్పాటు కానున్నా యి. ఎన్నికలయ్యే వరకు కమిటీలే ప్రాతినిధ్యం వహించనున్నాయి.

ఆ నియోజకవర్గాల్లో చెరి సగం

జిల్లాలో 122 సహకార సంఘాలున్నాయి. మూడు నియోజక వర్గాల్లో జనసేన, నాలుగుచోట్ల తెలుగుదేశం ప్రజా ప్రతినిఽధు లున్నారు. గణపవరం మండలం జనసేన ఎమ్మెల్యే ప్రాతినిధ్యంలో ఉంది. జనసేన అధికారంలో వున్న చోట 50 శాతం జనసేన, బీజేపీకి ఇవ్వనున్నారు. మరో 50 శాతం తెలుగుదేశం పార్టీకి కేటాయిస్తున్నారు. ఆ మేరకు అధిష్టానం నుంచి సంకేతాలు అందాయి. ఆ లెక్కన జిల్లాలో భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురం నియోజకవర్గాల్లో 50 శాతం సహకార సంఘాల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ప్రాతినిధ్యం లభిస్తుంది. మిగిలిన 50 శాతం సంఘాల్లో జనసేన, బీజేపీలకు అవకాశం లభిస్తుంది. ప్రతి నియోజకవర్గంలోనూ బీజేపీకి ఒక సహకార సంఘం

కేటాయించేలా చర్చలు సాగుతు న్నాయి. జనసేనకు కేటాయించిన 50 శాతంలోనే వాటిని కేటాయించనున్నారు. ఇక తెలుగుదేశం ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకొల్లు, ఉండి, ఆచంట, తణుకు నియో జకవర్గాల్లో 70 శాతం సహకార సంఘాల్లో ఆ పార్టీకి ప్రాతినిధ్యం ఉంటుంది. మిగిలిన 30 శాతం సంఘాలను జనసేన, బీజేపీలకు కేటాయిం చనున్నారు. జనసేన ప్రాతినిధ్యం వున్నచోట 60 శాతం అయినా కేటాయించాలంటూ తెలుగుదేశం నాయకులు అధిష్ఠానం దృష్టికి తీసుకువెళుతున్నారు. అయితే నీటి సంఘాలు మాదిరిగానే సర్దుకు వెళ్లాలని కూటమి పెద్దలు దిశా నిర్దేశం చేశారు. మొత్తంపైన నామినేటెడ్‌ పదవుల్లో ఇప్పుడిప్పుడే క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులకు ప్రాతినిధ్యం లభిస్తోంది.

ఆశావహుల్లో జోష్‌

సొసైటీలకు ప్రాతినిధ్యం వహించాలని ఆశిస్తున్న కూటమి శ్రేణుల్లో జోష్‌ నెలకొంది. ప్రభుత్వం నిర్ణయం తీసుకునేటప్పటికే కాలతీతమైందని శ్రేణులు ఇప్పటి వరకు ఒకింత అసంతృప్తితో ఉన్నాయి. ఎన్నికలు నిర్వహించినా ఫలితాలు ఏకపక్షంగా ఉంటా యని కూటమి నేతల్లో ధీమా ఉంది. ఇప్పటి వరకు నిర్వహించిన విద్యా కమిటీలు, నీటి సంఘాలన్నీ ఏకగ్రీవం అయ్యాయి. కూట మి నేతల సిఫారసుల ఆధారంగానే విద్యా కమిటీలు, నీటి సంఘాలు ఏర్పాటయ్యాయి. తాజాగా సహకా ర సంఘాలను నామినేటెడ్‌ పద్ధ తిలో నియమించనున్నారు. సొసై టీలకు ప్రాతినిధ్యం వహించా లన్న తపనతో ఉన్న కూటమి నాయకులు స్థానిక ఎమ్మెల్యేలు, నేతలను కలుసుకుంటున్నారు. ఆశీస్సులు తీసుకుంటున్నారు. ఎన్నికల్లోనూ పోటీ చేస్తామంటూ నేతల ముందు తమ ప్రతిపాదనలు ఉంచుతున్నారు. అంతవరకు నామినేటెడ్‌ పదవుల్లో అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.

మాసాంతంలో నియామకం

జిల్లాలో అత్యధిక సహకార సంఘాలకు ఈ నెల 28తో ప్రత్యేక అధికారుల పాలన ముగియనుంది. వారి గడువు పొడిగించక ముందే కమిటీలను ఏర్పాటు చేయాలి. లేదంటే కమిటీలు ఏర్పాటయ్యేంత వరకు ఇన్‌ఛార్జ్‌లు ఉంటారంటూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రావాలి. పార్టీ శ్రేణులు ప్రత్యేక అధికారులు పాలన ముగిసిన వెంటనే త్రిసభ్య కమిటీలను నియమించాలన్న ఆలోచనతో ఉన్నారు. నియోజకవర్గ నాయకత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఆశావహులంతా తమ పార్టీ నేతలతో మంతనాలు సాగిస్తున్నారు. ఆశీస్సులు తీసుకుంటున్నారు. మొత్తంగా సహకార సంఘాల్లో నామినేటెడ్‌ పదవులు లభిస్తాయన్న ఆశతో కూటమి శ్రేణులు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. డీసీసీబీలో డైరెక్టర్‌ పదవి ఆశిస్తున్న వారు సహకార సంఘాల అధ్యక్ష పదవిపై ఆశలు పెట్టుకున్నారు.

Updated Date - Dec 19 , 2024 | 12:28 AM