అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు
ABN , Publish Date - Nov 24 , 2024 | 12:06 AM
విధుల్లో అలసత్వం ప్రదర్శి స్తే చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి హెచ్చ రించారు. భీమవరంలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా పోలీస్ అధికారులతో నెలవారీ నేర సమీక్ష సమావేశంలో మాట్లాడారు.
భీమవరం క్రైం, నవంబరు 23(ఆంధ్రజ్యోతి):విధుల్లో అలసత్వం ప్రదర్శి స్తే చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి హెచ్చ రించారు. భీమవరంలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా పోలీస్ అధికారులతో నెలవారీ నేర సమీక్ష సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న గ్రేవ్ అండ్ నాన్ గ్రేవ్ కేసులు, హతలు, పీవోఎస్‌ఎస్‌వో అండ్ రేప్‌లు, డెకాయిట్, రాబరీ, ప్రాపర్టీ, వాహనాల దొంగతనం, మిస్సింగ్, చీటింగ్, ప్రాపర్టీ, రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలు, 174 సీఆర్ పీసీ కేసుల దర్యాప్తు, రికవరీలపై పోలీసు అధికారులతో సమీక్షించారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించాలని, ఇతర ప్రభుత్వ విభాగాలతో కలసి బ్లాక్‌స్పాట్స్‌ను సందర్శించి చర్యలు తీసుకోవాలన్నారు. మహిళల భద్రతపై దృష్టి సారించాలన్నారు. ఏఎస్పీ వి.భీమారావు, డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు.