Share News

బరకం దొరక్క.. నరకం

ABN , Publish Date - Dec 07 , 2024 | 12:25 AM

వైసీపీ పాలనలో రైతు సంక్షేమ ప్రభుత్వమంటూ మభ్యపెట్టి ఐదేళ్లు గడిపేశారు. సాగు విషయంలో గ్రాఫిక్స్‌ చూపిస్తూ.. నేలపై ఫలసాయం కాపాడుకునే రాయితీ టార్పా లిన్లను ఎత్తేశారు. గత ప్రభుత్వం వైఫల్యం వల్ల పంటలపై పెట్టిన పెట్టుబడి చేతికొచ్చే సమయంలో ప్రకృతి ప్రకోపానికి గురవుతోంది. ఎలా కాపాడుకోవాలో అర్థం కాక అన్నదాతలు ఆందోళన చెందుతు న్నారు.

బరకం దొరక్క.. నరకం

వైసీపీ ఐదేళ్ల పాలనలో సబ్సిడీలకు మంగళం

వర్షం వస్తే రైతుకు వణుకే.. పునరుద్ధరణకు వినతి

అత్తిలి, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి):వైసీపీ పాలనలో రైతు సంక్షేమ ప్రభుత్వమంటూ మభ్యపెట్టి ఐదేళ్లు గడిపేశారు. సాగు విషయంలో గ్రాఫిక్స్‌ చూపిస్తూ.. నేలపై ఫలసాయం కాపాడుకునే రాయితీ టార్పా లిన్లను ఎత్తేశారు. గత ప్రభుత్వం వైఫల్యం వల్ల పంటలపై పెట్టిన పెట్టుబడి చేతికొచ్చే సమయంలో ప్రకృతి ప్రకోపానికి గురవుతోంది. ఎలా కాపాడుకోవాలో అర్థం కాక అన్నదాతలు ఆందోళన చెందుతు న్నారు. రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని వ్యాపారులు టార్పా లిన్ల ధరలు పెంచడంతో అదనపు భారంగా మారింది. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌లో రెండు లక్షల ఐదు వేల ఎకరాల్లో వరి సాగు చేశా రు. నాలుగు లక్షల 10 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని రైతులు నుం చి 265 కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించే లక్ష్యం నిర్ధేశించారు. ఇప్పటి వరకూ రెండు లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని రైతుల నుం చి కొనుగోలు చేశారు. మిగతా పంట అంతా కోతకు వచ్చింది. సాగు లో పెరిగిన ఖర్చులను తగ్గించుకునేందుకు అన్నదాతలు వరి కోత యంత్రాలలో నూర్పిళ్ళు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం నిబంధనల ప్ర కారం 17 శాతంలోపు తేమ ఉండాలి. ప్రస్తు తంలో సాగు ప్రభావంతో చిరుజల్లులు పడ డంతోపాటు ఆకాశం మేఘావృతమై ఉండడం చాలికాలంలో మంచు పడడంతో తేమ శాతం 26 నుంచి 28 శాతం వరకూ ఉంటున్నది. యంత్రాలతో కోత పూర్తి చేసి పచ్చి ధాన్యాన్ని చేలల్లోనే అమ్ముకోవాలంటే బాయిలర్‌ రైస్‌ మిల్లులు మాత్రమే కొనుగోలు చేస్తాయి. అవి పదుల సంఖ్యలో ఉంటే బ్యాంకు గ్యారెంటీలు లేని మిల్లులు ఎక్కువగా ఉన్నాయి.

రాయితీపై టార్పాలిన్లు ఇవ్వండి

ఆరుగాలం శ్రమించి పండించిన పంటను ఆరబెట్టి తేమ శాతం తగ్గించుకునేందుకు టార్పా లిన్ల అవసరం. ధాన్యాన్ని ఆరబెట్టేందుకు రాశు లపై కప్పేందుకు టార్పాలిన్లు అందుబాటులో లేకపోవడంతో రైతులు ఆందోళన చెందు తున్నారు. వర్షానికి ధాన్యం తడిస్తే రంగు మారి నాణ్యత కోల్పోవడం వల్ల ధరలు సగానికి సగం తగ్గింజేస్తారని చెబుతున్నారు. మంచుకు తడిస్తే తేమ శాతం ఎక్కువగా వస్తోంది. ఐదేళ్లలో వైసీపీ పాలనలో ఒక్క రైతుకు టార్పాలిన్లు అందించలేదు. రైతులు అధిక ధరల చెల్లించి ప్రైవేటు వ్యాపారుల వద్దనే వీటిని కొనుగోలు చేసుకున్నారు. 2014–19 సంవత్సరం మధ్యన టీడీపీ పాలనలో టార్పాలిన్లను 50 శాతం రాయితీపై అందించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలో రావడంతో రాయితీపై టార్పాలిన్లు అందించాలని కోరుత ున్నారు. ‘జిల్లాలో ఇప్పటి వరకు 50 శాతంపైగా పంట కోతలు రైతులు పూర్తిచేశారు. రైతులకు అవసరమైన టార్పాలిన్‌లు రాయితీపై అందిం చేలా ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చాం. అను మతులు రాగానే రైతులకు అందిస్తాం’ అని జిల్లా వ్యవసాయాధికారి వెంకటేశ్వరరావు తెలిపారు.

Updated Date - Dec 07 , 2024 | 12:25 AM