Eluru: యోగా క్లాస్‌కు రాలేదని ఓ విద్యార్థిని పట్ల టీచర్ ప్రవర్తన చూస్తే..
ABN , Publish Date - Dec 05 , 2024 | 01:33 PM
Andhrapradesh: ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం ఇప్పలపాడు ఏకలవ్య మోడల్ స్కూల్‌లో యోగా క్లాస్‌కు రాలేదన్న కారణంతో విద్యార్థిని పట్ల ఉపాధ్యాయులు ప్రవర్తించిన తీరు చర్చనీయాంశంగా మారింది. జ్వరంతో బాధుపుడుతున్న విద్యార్థిపై కనీసం కనికరం చూపకుండా గుంజిళ్లు తీయించారు ఉపాధ్యాయులు. దీంతో సదరు విద్యార్థి తీవ్ర అస్వస్థతకు గురైంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఏలూరు జిల్లా, డిసెంబర్ 5: ఈ మధ్య కాలంలో చదువుతో పాటు విద్యార్థులకు అన్నింటిలో ప్రతిభ కనబర్చాలని తల్లిదండ్రులుతో పాటు ఉపాధ్యాయుల కోరిక. అయితే విద్యార్థులకు క్రమశిక్షణ పేరుతో కొందరు టీచర్లు వారి పట్ల దురుసుగా ప్రవర్తిస్తుంటారు. విద్య చెప్పే గురువుకు ఓపిక ఉండటం ఎంతో ముఖ్యం. కానీ కొందరు టీచర్ల ప్రవర్తన అందుకు భిన్నంగా ఉంటోంది. హోంవర్క్ రాయలేదని, పరీక్ష సరిగా రాయలేదని, క్లాస్‌లో అల్లరి చేస్తున్నారని, క్లాస్‌కు హాజరుకావడం లేదని, తదితర కారణాలతో విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఒక్కోసారి విచక్షణమరిచి ప్రవర్తిస్తుంటారు కూడా. విద్యార్థులను చావబాదుతారు. మరికొందరు టీచర్లు విద్యార్థులకు కఠిన శిక్షలు వేస్తుంటారు. గుంజీలు తీయడం, ఎండలో నిలబెట్టడం వంటివి చేస్తుంటారు. ఈ క్రమంలో పలువురు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైన సందర్భాలు ఎన్నో చూశాం. తాజాగా ఏలూరు జిల్లాలో అలాంటి ఘటనే చోటు చేసుకుంది. టీచర్ విధించిన శిక్షకు ఓ విద్యార్థిని ఆస్పత్రి పాలైంది.
మున్సిపాలిటీల్లో పేరుకుపోతోన్న పన్నులు
ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం ఇప్పలపాడు ఏకలవ్య మోడల్ స్కూల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. యోగా క్లాస్‌కు రాలేదన్న కారణంతో విద్యార్థిని పట్ల ఉపాధ్యాయులు ప్రవర్తించిన తీరు చర్చనీయాంశంగా మారింది. జ్వరంతో బాధుపుడుతున్న విద్యార్థిపై కనీసం కనికరం చూపకుండా గుంజిళ్లు తీయించారు ఉపాధ్యాయులు. దీంతో సదరు విద్యార్థి తీవ్ర అస్వస్థతకు గురైంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుంజిళ్ల కారణంగా తీవ్ర అస్వస్థతకు గురైన బాలికను చికిత్స నిమిత్తం బుట్టాయిగూడెం ఆసుపత్రికి తరలించారు. వైద్యుల పర్యవేక్షణలో బాలిక చికిత్స పొందుతోంది.
బొట్టు పెట్టుకోవడం వల్ల ఇన్ని ప్రయోజనాలున్నాయా..
ఈ క్రమంలో స్కూల్‌లో పరిస్థితిపై విద్యార్థిని చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారింది. స్కూల్‌లో పరిస్థితి బాగోలేదని విద్యార్థులతో మరుగుదొడ్లు , అన్నం గిన్నెలు కడిగిస్తున్నారని ఆరోపించింది. అంతేకాకుండా మధ్యాహ్నం వండిన భోజనం రాత్రికి.. రాత్రి వండిన భోజనాన్ని రేపు పెడుతున్నారని బాలిక తెలిపింది. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెబితే కొడుతున్నారని బాలిక ఆరోపించింది. స్కూల్‌లో పరిస్థితి, ఉఫాధ్యాయుల తీరుపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్కూల్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను పేరెంట్స్ కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి...
పాకిస్తాన్ పేరు మార్చండి మహాప్రభో..!
AirHelp Survey: ప్రపంచ ఎయిర్‌లైన్స్ సర్వేలో షాకింగ్ విషయాలు
Read Latest AP News And Telugu News