అండర్–19 టెన్నికాయిట్ బాలుర విజేత ‘పశ్చిమ’
ABN , Publish Date - Nov 11 , 2024 | 12:00 AM
చింతలపూడిలో ఈనెల 9, 10 తేదీల్లో ప్రభుత్వ హైస్కూలులో జరిగిన రాష్ట్ర 68వ అంతర్ జిల్లాల స్కూల్ గేమ్స్ టెన్నికాయిట్ పోటీలు ఆదివారం రాత్రితో ముగిశాయి. 13 జిల్లాల నుంచి బాలురు, బాలికలు 390 మంది పాల్గొ న్నారు.
ముగిసిన 68వ అంతర్ జిల్లాల స్కూల్ గేమ్స్ పోటీలు
చింతలపూడి, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి) : చింతలపూడిలో ఈనెల 9, 10 తేదీల్లో ప్రభుత్వ హైస్కూలులో జరిగిన రాష్ట్ర 68వ అంతర్ జిల్లాల స్కూల్ గేమ్స్ టెన్నికాయిట్ పోటీలు ఆదివారం రాత్రితో ముగిశాయి. 13 జిల్లాల నుంచి బాలురు, బాలికలు 390 మంది పాల్గొ న్నారు. 78 జట్లు లీగ్ నాకౌట్ పద్ధతిలో పోటీ పడ్డాయి. దీనిలో అండర్–19 బాలికల విభాగంలో అనంతపురం ప్రథమ, తూర్పు గోదావరి ద్వితీ య, చిత్తూరు తృతీయ స్థానాలు పొందాయి. అండర్–17 బాలికల విభాగంలో అనంతపురం ప్రథమ, తూర్పుగోదావరి ద్వితీయ, పశ్చిమ తృతీ య స్థానాలు పొందాయి. అండర్–14 బాలికల విభాగంలో పశ్చిమ ప్రథమం, విజయనగరం ద్వితీయ, అనంతపురం తృతీయ స్థానాలు పొందాయి.
బాలుర విభాగంలో.. అండర్–19లో పశ్చిమ జిల్లా జట్టు ప్రథమ, విజయనగరం ద్వితీయ, శ్రీకాకుళం తృతీయ, అండర్–17 బాలుర విభ ాగంలో ప్రథమ తూర్పుగోదావరి, ద్వితీయ విశాఖ పట్టణం, తృతీయ అనంతపురం సాధించాయి. అండర్–14 బాలుర విభాగంలో అనంతపురం ప్రథమ, పశ్చిమ ద్వితీయ, తూర్పుగోదావరి తృతీయ స్థానాలు సాధించాయి. ముగింపు సభలో పలువురు మాట్లాడుతూ ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటే క్రీడాకారులు మరింత స్థాయికి ఎదుగుతారని, క్రీడారంగం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. విజేతలకు మాజీ స్పోర్ట్స్ రాష్ట్ర కో–ఆర్డినేటర్ పేరం రవీంద్రనాఽథ్, పోటీల పరిశీలకులు ఎన్.టి. ప్రసాద్, స్కూల్ గేమ్స్ జిల్లా కార్యదర్శి కె.అలివేలుమంగ, కె.రమేష్, కె.సురేష్‌కు మార్, హెచ్‌ఎం పి.సుధాక రరావు, పిట్టా వేణు, మాటూరి చక్రధరరావు, అల్లూరి గిరిరాజు తదితరుల చేతుల మీదుగా మెమెంటోలు, బహుమతులు అందజేశారు. మండలంలోని పీడీలు, పీటీలు, విద్యార్థులు పాల్గొన్నారు.