దొంగలు బాబోయ్.. దొంగలు
ABN , Publish Date - Dec 06 , 2024 | 12:42 AM
కృష్ణయ్యపాలెంకు చెందిన మోహన్‌రావు అనే వ్యక్తి పని నిమిత్తం గురువారం అలంపురం వచ్చాడు. ఒక షాపు వద్ద తనకు కావాల్సిన సామగ్రి కొనుక్కుంటున్న సమయంలో వెనుక నుంచి బైక్‌పై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు. వీరిలో వెనక కూర్చున్న వ్యక్తి బైక్ నుంచి కిందకు దిగగా బైక్ నడిపే వ్యక్తి బైక్ పడిపోతున్నట్లు నటించాడు. మోహన్‌రావు తన చేతిలో ఉన్న సెల్‌ఫోన్‌ను పక్కనపెట్టి బైక్ లేపేందుకు ప్రయత్నించగా వెనుక కూర్చున వ్యక్తి మోహన్ రావు పెట్టిన సెల్‌ఫోన్ దొంగిలించి మెరుపు వేగంతో ఇద్దరూ బైక్‌పై ఉడాయించారు. ఇదే తరహాలో అనేక మంది సెల్‌ఫోన్లు, సొమ్ములు పోగొట్టుకున్నట్లు స్థానికులు తెలిపారు. వీటిపై పెంటపాడు పోలీస్‌స్టేషన్‌లో పలు కేసులు నమోదయ్యాయి.

పెంటపాడులో చోరుల భయం
భయాందోళనలో గ్రామాల ప్రజలు..
గస్తీ పెంచాలని పోలీసులకు విజ్ఞప్తి
పెంటపాడు, డిసెంబరు 4(ఆంద్రజ్యోతి):పెంటపాడు మండలంలో దొంగతనాల జోరు పెరిగింది. సెల్‌ఫోన్‌లు, బైక్‌లు, తాళాలు వేసిన షాపులే లక్ష్యంగా దొంగలు విజృంభిస్తున్నారు. పెంటపాడు కాలేజ్ సెంటర్, ఎస్సీ కాలనీ, అలంపురం, కే.పెం టపాడు తదితర గ్రామాలలో దొంగతనాలు మితిమీరాయి. ఇంటిముందు పెట్టిన బైక్‌లు రాత్రి వేళల్లో దొంగలు ఎత్తు కుపోతున్నారు. కే.పెంటపాడు సమీపంలో తాళాలు వేసి వున్న సిమెంట్, ఐరన్ షాపుల్లో పైన రేకు కప్పు నుంచి షాపులోకి దిగి నగదు దొంగిలించారు. పెంటపాడు కాలేజ్ సెంటర్ వద్ద గుర్తు తెలియని వ్యక్తుల హడావుడి ఎక్కువైంది. అర్థరాత్రి దాటే వరకు కొందరు సెంటర్ సమీపంలోనే సంచరించడంతో స్థానికులు భయందోళనలకు గురవుతున్నారు. కొన్ని నెలల క్రితం కాలేజ్ సెంటర్ వద్ద పీహెచ్‌సీ సబ్ సెంటర్‌లో అర్ధ రాత్రి వచ్చిన వ్యక్తులు లోపల ఉన్న ప్రిజ్‌ను దొంగిలించారు. దీనిపై పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదయ్యింది.
పెంటపాడు ప్రధాన పీహెచ్‌సీ సెంటర్‌లోను వెనుక నుంచి తాళాలు పగులగొట్టి లోపలకు చొరబడి పీహెచ్‌సీలో దొంగి లించేందుకు ఏమీ లేకపోవడంతో అక్కడ ఉన్న రికార్డులు, కాటన్ తదితర వస్తువులకు నిప్పంటించి ఉడాయించారు. పక్కనే ఆక్సిజన్ సిలెండర్ ఉన్నప్పటికి అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీనిపైన కేసు నమోదైంది. ఇటువంటి దొంగతనాలతో ప్రజలు భయాందోళనలు గురవువుతున్నారు. పోలీసులు రాత్రి వేళలో గస్తీ పెంచి దొంగతనాలను అరికట్టా లని ప్రజలు కోరుతున్నారు.