రైల్లోంచి తోసేశారు !
ABN , Publish Date - Dec 04 , 2024 | 12:32 AM
నరసాపురం మండలం సీతారాం పురం మాజీ సర్పంచ్ అడబాల అయ్యప్ప నాయుడుపై రైలులో దొంగలు దాడిచేశారు. వెళుతున్న రైల్లోంచి తోసివేశారు.
నరసాపురం రూరల్, డిసెంబరు 3 (ఆంధ్ర జ్యోతి): నరసాపురం మండలం సీతారాం పురం మాజీ సర్పంచ్ అడబాల అయ్యప్ప నాయుడుపై రైలులో దొంగలు దాడిచేశారు. వెళుతున్న రైల్లోంచి తోసివేశారు. తీవ్రంగా గాయపడిన ఆయన రైల్వే పోలీసుల సాయం తో ప్రాణాలతో బయటపడ్డారు. నాయుడు తెలిపిన వివరాలివి.. శుక్రవారం హైదరా బాద్ నుంచి నరసా పురానికి నాగర్‌సోల్ ఎక్స్‌ప్రెస్‌లో బయ లుదేరారు. టాయి లెట్‌కు వెళ్లేందుకు బోగీలోంచి బయటకు రాగా.. ఆ సమయంలో రైలు స్లో అయింది. ఇద్దరు వ్యక్తులు లోపలికి రావడాన్ని గుర్తించి బోగీలోకి ఎందుకు వెళు తున్నారని ప్రశ్నించా. వారు సమాధానం చెప్ప కుండా తలుపు తీసి కదులుతున్న రైల్లోంచి నన్ను బయటకు నెట్టేశారు. తీవ్రంగా గాయ పడి పట్టాల పక్కన పడ్డా. మరో రైలు వస్తుండటంతో ప్రమాదాన్ని గుర్తించి పక్కకు జరిగా.. రైల్వే పోలీసులు వచ్చి ఖమ్మం అస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. అక్కడ కోలుకుని మంగళవారం గాయాలతో స్వగ్రా మం చేరుకున్నా. ఆ ఘటన తలుచుకుంటే ఇంకా భయంగా ఉంది. ప్రాణాలతో బయట పడతానని అనుకోలేద’ని తనను పలకరిం చేందుకు వస్తున్న స్నేహితుల వద్ద కన్నీటి పర్యంతమయ్యారు.