Share News

పొగాకు కిలో రూ.400

ABN , Publish Date - Jul 21 , 2024 | 12:26 AM

వర్జీనియా పొగాకు ధర శనివారం రూ.400కి చేరుకోవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో వర్జీనియా పొగాకుకు మంచి మార్కెట్‌ ఉండడంతో పొగాకు ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి.

పొగాకు కిలో రూ.400
జంగారెడ్డిగూడెంలో వేలం జరుగుతున్న దృశ్యం

రికార్డు ధర పలికిన వర్జీనియా పొగాకు

జంగారెడ్డిగూడెం, జూలై 20 : వర్జీనియా పొగాకు ధర శనివారం రూ.400కి చేరుకోవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో వర్జీనియా పొగాకుకు మంచి మార్కెట్‌ ఉండడంతో పొగాకు ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. పొగాకు రైతులు, వేలం కేంద్ర అఽధికారులు ఎన్నడూ చూడనివిధంగా పొగాకు ధరలు పైపైకి వెళ్తున్నాయి. శనివారం స్థానిక రెండు వేలం కేంద్రాల్లో కిలో పొగాకు ధర రూ.399 ఉండగా గోపాలపురంలో రికార్డు ధర రూ.400 పలికింది. వేలం ప్రారంభమై శనివారానికి 105 రోజులు పూర్తయింది. ఇప్పటివరకు జంగారెడ్డిగూడెం వేలం కేంద్రం–1లో 8.90 మిలియన్ల పొగాకు కొనుగోలు జరిగి టాప్‌లో నిలిచింది. వేలం కేంద్రం–2లో 8.75 మిలియన్లు, కొయ్యలగూడెంలో 8.35 మిలియన్లు, గోపాలపురంలో 7.47 మిలియన్లు, దేవరపల్లిలో 6.82 మిలియన్ల పొగాకు కొనుగోలు జరిగింది.

Updated Date - Jul 21 , 2024 | 12:26 AM