వనరులను సద్వినియోగం చేసుకోవాలి
ABN , Publish Date - Dec 13 , 2024 | 12:41 AM
వనరులను ప్రణాళికాబద్ధంగా వినియోగించు కుని పంచాయతీలు బలోపేతం కావాలని ఏపీ గ్రామీణాభివృద్ధి సంస్థ జేడీ రమణ అన్నారు.
సర్పంచ్‌లు, సచివాలయ సిబ్బందికి శిక్షణ
పెదవేగి, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): వనరులను ప్రణాళికాబద్ధంగా వినియోగించు కుని పంచాయతీలు బలోపేతం కావాలని ఏపీ గ్రామీణాభివృద్ధి సంస్థ జేడీ రమణ అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచ్‌లు, సచివాలయ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం గురు వారం ప్రారంభమైంది. రమణ మాట్లాడుతూ పంచాయతీల అభివృద్ధి స్థానిక వనరుల విని యోగంపై ఆధారపడి ఉందన్నారు. వనరులను సక్రమంగా వినియోగిస్తూ భవిష్యత్ ప్రణాళి కలను సిద్ధం చేసుకోవాలని ఆయన సూచించా రు. ఎంపీడీవో పి.శ్రీనివాస్, ఏపీఎం ఏసురత్నం, అంగన్‌వాడీ పెదవేగి సెక్టార్ సూపర్‌వైజర్ సీహెచ్.పార్వతి, పది గ్రామాల సర్పంచ్‌లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
ఏలూరు రూరల్: గ్రామాల సుస్థిర అభివృద్ధి అధికారుల సమిష్టి కృషితో సాధ్యమని ఎంపీడీవో వెన్నా శ్రీలత అన్నారు. సుస్థిర అభి వృద్ధి లక్ష్యాల సాధనకు తీసుకోవాల్సిన చర్యలపై సర్పంచ్‌లకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. మాస్టర్ ట్రైనీ మెప్మా ఏడీ నాగేశ్వరరావు, స్వయం సమృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, సామాజిక భద్రత అంశాలు వివరించారు. సర్పంచ్‌లు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
చింతలపూడి: గ్రామాల అభివృద్ధికి అధికా రులు, ప్రజా ప్రతినిధులు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలని ఎంపీపీ రాంబాబు అన్నారు. గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. పంచాయతీల పరిధిలో బడ్జెట్ ప్రణాళిక అమలుతో సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. శిక్షణ కార్యక్రమంలో ఎంపీడీవో మురళీకృష్ణ, పీఆర్ ఏఈ జగన్నాధం, పలువురు అధికారులు పాల్గొన్నారు.
ఉంగుటూరు: గ్రామ పంచాయతీల అభివృద్ధికి ప్రణాళికపై ఎంపీడీవో జి.రాజ్ మనో జ్, ఈవోపీఆర్‌డి చంద్రశేఖరన్ శిక్షణ ఇచ్చారు. గ్రామాల అభివృద్ధికి ప్రతి ప్రజాప్రతినిధి చిత్త శుద్ధితో పనిచేయాలని వారు కోరారు. ఎంపీపీ గంటా శ్రీలక్ష్మి, కార్యదర్శులు సచివాలయ సిబ్బంది, సర్పంచ్‌లు పాల్గొన్నారు.
లింగపాలెం: గ్రామాలలో అభివృద్ధి పను లు చేపట్టేందుకు, సుస్థిర పరిపాలనకు అధికారు లు, పజాప్రతినిధులు భాగస్వాములవ్వాలని ఈవోపీఆర్డీ జేఎం రత్నకుమార్ అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో పంచాయితీ సర్పంచ్‌లు, ఐసీడీఎస్, సచివాలయ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జేఎం రత్నకు మార్ వారికి అవగాహన కల్పించారు. గ్రామాల్లో పారిశుధ్యంతో పాటు బాలికల రక్షణ చట్టంపై అవగాహన కలిగించాలన్నారు. సర్పంచ్‌లు, ఐసీడీఎస్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
నిడమర్రు: గ్రామ పంచాయితీలు నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలని ఎంపీడీవో విజయకుమారి సూచించారు. మండల పరిషత్ కార్యాల యంలో సర్పంచ్‌లు, కార్యదర్శులు,, మండల స్ధాయి అధికారులకు రెండు రోజులు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈవోపీఆర్డీ, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.