చదువుకు సాంకేతికత జోడిస్తే అద్భుతాలు
ABN , Publish Date - Oct 28 , 2024 | 12:00 AM
మన చదువుకు సాంకేతికత జోడిస్తే అద్భుతాలు సృష్టించవచ్చని త్రిపుర గవర్నర్ ఎన్.ఇంద్రసేనారెడ్డి అన్నారు. తాడేపల్లి గూడెం ఏపీ నిట్ ఆడిటోరియంలో విద్యార్థులకు స్పందనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన అకడమిక్ ఎచీవ్‌మెంట్ బూస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెమినార్‌లో ఆయన మాట్లాడారు.
త్రిపుర గవర్నర్ ఇంద్రసేనా రెడ్డి
తాడేపల్లిగూడెం రూరల్/భీమవరం టౌన్, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): మన చదువుకు సాంకేతికత జోడిస్తే అద్భుతాలు సృష్టించవచ్చని త్రిపుర గవర్నర్ ఎన్.ఇంద్రసేనారెడ్డి అన్నారు. తాడేపల్లి గూడెం ఏపీ నిట్ ఆడిటోరియంలో విద్యార్థులకు స్పందనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన అకడమిక్ ఎచీవ్‌మెంట్ బూస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెమినార్‌లో ఆయన మాట్లాడారు. ఆంధ్రాలో నీటి వనరులు పుష్క లంగా ఉన్నా వాటిని సద్వినియోగం చేసుకోవ డంలో వెనుకబడ్డామన్నారు. వాటిని అధిగమించి మంచినీటిని వినియోగంలో ముందుకు రావాల్సి న అవసరం ఉందన్నారు. దేశంలోనే త్రిపుర మూడో చిన్న రాష్ట్రం అయినా విద్యలో ముందుం దన్నారు. స్పందనా ఫౌండేషన్ నిర్వాహకురాలు భోగిరెడ్డి ఆదిలక్ష్మి, ఏపీ నిట్ రిజిస్ట్రార్ దినేష్ శంకర్‌రెడ్డి, వెంకటరమణ సేవా చారిటబుల్ ట్రస్టు చైర్మన్ కొలనువాడ పెద కృష్ణంరాజు, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి వలవల బాబ్జి, శశి విద్యా సంస్థల వైస్ చైర్మన్ మేకా నరేంద్ర, పైడికొండల సింధు పాల్గొన్నారు.
భీమవరం విచ్చేసిన త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డిని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనే యులు మర్యాద పూర్వకంగా కలిసి సత్కరిం చారు. ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరా జు, జనసేన జిల్లా అధ్యక్షుడు కొటికలపూ డి గోవిందరావు ఉన్నారు. గవర్నర్ మాట్లాడుతూ 40 ఏళ్లుగా భీమవరం పరిసర ప్రాంతాల్లో సమా జ సేవలందిస్తున్న సంఘ సేవకులు చెరుకువా డ రంగసాయిని సీతారామరాజు కాంస్య విగ్రహం వద్ద అభినందించి సత్కరించారు.
విద్యతోనే అభివృద్ధి సాధించవచ్చు
భీమవరం రూరల్ : దొంగపిండి గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడారు. విద్యతోనే అభివృద్ధి సాధించవచ్చని తీర ప్రాంతం నుంచి వచ్చిన శ్రీపూజ ఐఏఎస్ ర్యాంక్ సాధించిందని, జిల్లా కలెక్టర్ అవ్వడం ఈ ప్రాంత విద్యార్థులకు స్ఫూర్తిదాయకమన్నారు. ఈ గ్రామానికి తీసుకువచ్చిన ఆనంద గ్రూప్ చైౖర్మన్ భూపతిరాజు కాశీవిశ్వనాథరాజుకు కృతజ్ఞతలు తెలిపారు. అనంత రం తుందుర్రులోని ఆక్వా పుడ్ పార్కును పరిశీలించారు. త్రిపుర ఫైనాన్స్ అండ్ ఐటీ మినిస్టర్ ప్రణదిత్ సింగరాయ్, తదితరులు పాల్గొన్నారు.