Share News

జాబితాలు సిద్ధం

ABN , Publish Date - Dec 26 , 2024 | 12:15 AM

జిల్లాలోని 122 సహకార సంఘాల్లో త్రిసభ్య కమిటీలకు జాబితాలు సిద్ధమవుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో జాబితాలు కొలిక్కిరాగా, జనసేన ఎమ్మెల్యేలు వున్నచోట ఎంపికపై తర్జన భర్జన పడుతున్నారు.

జాబితాలు సిద్ధం

సహకార సంఘాలకు త్రిసభ్య కమిటీలు

టీడీపీ, జనసేన, బీజేపీలకు పంపకాలు పూర్తి

అభ్యర్థుల ఎంపికకు నేతల కసరత్తు

వారి చుట్టూ క్యూ కడుతున్న ఆశావహులు

త్వరలోనే నియామకం.. అప్పటి వరకు పర్సన్‌ ఇన్‌చార్జ్‌ల పాలన

జిల్లాలోని 122 సహకార సంఘాల్లో త్రిసభ్య కమిటీలకు జాబితాలు సిద్ధమవుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో జాబితాలు కొలిక్కిరాగా, జనసేన ఎమ్మెల్యేలు వున్నచోట ఎంపికపై తర్జన భర్జన పడుతున్నారు. తమకు అవకాశం కల్పించాలని ఆశావహులు నేతల చుట్టూ క్యూకడుతున్నారు. కొన్ని రోజుల్లోనే దీనిపై పూర్తి స్పష్టత రానుంది.

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

త్రిసభ్య కమిటీల ఏర్పాటుపై పది రోజుల క్రితమే ఎమ్మెల్యేలకు, పార్టీ ఇన్‌ఛార్జ్‌లకు వర్తమానం అందిం ది. ప్రతి సంఘానికి అధ్యక్షుడి తోపాటు, ఇద్దరు సభ్యులను నియమించుకోవాలని కూటమి అధిష్ఠానం నిర్ణయించింది. ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావించినా ఎమ్మెల్యేలు, ఇన్‌ ఛార్జ్‌లు ఏడాదిపాటు త్రిసభ్య క మిటీలు వేయాలని కోరారు. ఆరు నెలల తర్వాత ప్రభుత్వం కమిటీల వైపే మొగ్గు చూపింది. పర్సన్‌ ఇన్‌ఛార్జ్‌ల కాల పరిమితిని ఆరు నెలలపాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. కమిటీలు ఏర్పాటైన వెంటనే పర్సన్‌ ఇన్‌ఛార్జ్‌లు వైదొలగుతారు. ఆరు నెలలు ఈ కమిటీ లతో పాలన నిర్వహిస్తారు. ఆ తర్వాత ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ కమిటీల నియామకం తర్వాత డీసీసీబీ, డీసీఎంఎస్‌లకు కమిటీలపై ప్రభుత్వం దృష్టి పెడుతుంది.

పోటీకీ సిద్ధమే అంటున్న కేడర్‌

త్రిసభ్య కమిటీల్లో అధ్యక్ష పదవి కోసం టీడీపీ కేడర్‌ పట్టుబడుతున్నారు. తమకు అవకాశం ఇవ్వాలని కూటమి నేతల ముందు అభిప్రాయాలు పంచుకుంటున్నారు. సొసైటీ పరిధిలోని గ్రామాల నాయకులను కూడదీసుకుని కూటమి నేతల ను కలుసుకునే ప్రయత్నం

చేస్తున్నారు. ఇప్పుడు అవకాశం ఇవ్వండి. తర్వాత వచ్చే ఎన్నికల్లోనూ వ్యయ ప్ర యాసలకు కట్టుబడి పోటీ చేస్తా మంటూ స్పష్టం చేస్తు న్నారు. పోటీ అధికంగా ఉండడంతో జనసేన నియోజకవర్గాల్లో ఒత్తిడి పెరుగుతోంది.

టీడీపీ సిద్ధం

పాలకొల్లు, ఉండి, ఆచంట, తణుకు నియో జకవర్గాల్లో ప్రజా ప్రతి నిధులు త్రిసభ్య కమిటీ జాబితాలు సిద్ధం చేశారు. జనసేన ప్రాతినిధ్యం వహిస్తున్న భీమవరం, తాడేపల్లిగూడెం, నర్సాపురం నియోజకవర్గాల్లో ఇంకా కొలిక్కి రాలేదు. టీడీపీకి 50 శాతం సొసైటీలు ఇవ్వాలి. మిగిలిన 50 శాతంలో జనసేన, బీజేపీ సర్దుబాటు చేసుకోవాలి. జనసేన నియోజకవర్గాల్లో బీజేపీకి ఒక్కో సొసైటీ ఇవ్వాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది. తాడేపల్లిగూడెం లో 12 సొసైటీలుంటే ఆరు తెలుగుదేశానికి, ఐదు జనసే నకు, ఒకటి బీజేపీకి ఇవ్వాలి. భీమవరం, నర్సాపురం నియోజకవర్గ పరిధిలోనూ సర్దుబాటు దిశగా కసరత్తు చేస్తున్నారు. టీడీపీకి కేటాయించిన సొసైటీల్లో జనసేన నుంచి ఒకరికి, జనసేనకు కేటాయించిన వాటిలో టీడీపీ నుంచి ఒకరికి సభ్యునిగా అవకాశం కల్పిస్తారు. ఆ దిశగా సర్దుబాటు చేస్తున్నారు.

Updated Date - Dec 26 , 2024 | 12:15 AM