Share News

పశ్చిమకు పదవుల పండుగ

ABN , Publish Date - Nov 15 , 2024 | 12:21 AM

కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వాల రాకతో పశ్చిమ గోదావరి జిల్లాకు రెండు చోట్లా కీలక పదవులు దక్కాయి. నరసా పురం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న భూపతిరాజు శ్రీనివాసవర్మను కేంద్ర మంత్రిగా నియమిస్తే.. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రిగా పాలకొల్లు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నిమ్మల రామానాయుడు బాధ్యతలు నిర్వహిస్తు న్నారు.

పశ్చిమకు పదవుల పండుగ
డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించిన రఘురామ, చిత్రంలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్‌, స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు తదితరులు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కీలక స్థానాల్లో ప్రాధాన్యం

జిల్లా నుంచి తొలిసారి డిప్యూటీ స్పీకర్‌ నియామకం

ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు ఏకగ్రీవ ఎన్నిక

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వాల రాకతో పశ్చిమ గోదావరి జిల్లాకు రెండు చోట్లా కీలక పదవులు దక్కాయి. నరసా పురం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న భూపతిరాజు శ్రీనివాసవర్మను కేంద్ర మంత్రిగా నియమిస్తే.. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రిగా పాలకొల్లు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నిమ్మల రామానాయుడు బాధ్యతలు నిర్వహిస్తు న్నారు. ఏపీఐఐసీ చైర్మన్‌గా టీడీపీ జిల్లా అధ్య క్షుడు మంతెన రామరాజు, రాష్ట్ర వినియోగదారు ల రక్షణ కౌన్సిల్‌ చైర్మన్‌గా పీతల సుజాత, ప్రభుత్వ విప్‌లుగా తాడేపల్లిగూడెం, నరసాపు రం ఎమ్మెల్యేలు బొలిశెట్టి శ్రీనివాస్‌, బొమ్మిడి నాయకర్‌, మైనారిటీ సంక్షేమ శాఖ సలహాదారు గా మండలి మాజీ చైర్మన్‌ షరీఫ్‌, కాపు కార్పొరే షన్‌ చైర్మన్‌గా కొత్తపల్లి సుబ్బారాయుడు, క్షత్రియ కార్పొరేషన్‌ చైర్మన్‌గా కనకరాజు సూరి పదవులు దక్కించుకున్నారు. కళింగ కార్పొరేషన్‌ డైరెక్టర్‌గా ఆకివీడు మండలం పెదకాపవరానికి చెందిన లంబాడి సీతారామాంజనేయులు, శెట్టిబలిజ కార్పొరేషన్‌ డైరెక్టర్లుగా జుత్తిగ నాగరాజు, కాళ్ల మండలం ఎల్‌ఎన్‌ పురానికి చెందిన వీరవల్లి శ్రీనివాస్‌, అగ్నికుల క్షత్రియ డైరెక్టర్‌గా వాతాడి ఉమా, గవర కార్పొరేషన్‌ డైరెక్టర్‌గా పి.నాగేశ్వరరావు, రజక కార్పొరేషన్‌ డైరెక్టర్‌గా ఉప్పులూరి చంద్రశేఖర్‌, తణుకు పల్లాపర్‌, తాటపూడి గణేష్‌, క్షత్రియ కార్పొరేషన్‌ డైరెక్టర్లుగా భూపతిరాజు శ్రీకృష్ణవర్మ, పేరిచర్ల శ్రీనివాసరాజు, గొట్టుముక్కల సూర్యనారాయణ రాజు, తిమ్మరాజు భూపతిరాజు, యరకరాజు సత్యహరిహరరాజులను నియమించారు.

పశ్చిమకు తొలిసారిగా డిప్యూటీ స్పీకర్‌

తాజాగా పశ్చిమ గోదావరికి తొలిసారిగా డిప్యూటీ స్పీకర్‌ పదవి వరించింది. ఉండి ఎమ్మె ల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు ఏకగ్రీవంగా ఎన్నికవడంతో అసెంబ్లీ సాక్షిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన వైసీపీలో నరసాపురం ఎంపీగా ఉంటూ ఎన్నో అవమానాలు ఎదుర్కొ న్నారు. ప్రజల గొంతు వినిపించడంతో అప్పటి జగన్‌ ప్రభుత్వం ఆయనపై కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించింది. ప్రభుత్వపరంగా చిత్రహింసలు అనుభవించారు. తన నియోజకవర్గంలో ఎంపీ నిధులు మంజూరు చేయించినా వినియోగించలేని పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల ముందు ఆయన టీడీపీలో చేశారు. ఉండి బరిలో నిలిచి భారీ మెజారిటీతో గెలుపొందారు. ప్రభుత్వంలో ఆయనకు కీలక బాధ్యతలు అప్పగిస్తారన్న అంతా భావించారు. చివరకు డిప్యూటీ స్పీకర్‌గా అవకాశం కల్పిస్తూ.. గురువారం అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నా రు. పశ్చిమకు గతంలోనూ ఎన్నో మంత్రి పద వులు లభించాయి. ఉండి నుంచి అబ్బాయిరాజు, దండు శివరామరాజు, కొత్తపల్లి సుబ్బారాయుడు, ప్రత్తి మణెమ్మ, ఈలి ఆంజనేయులు, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్య నారాయణ టీడీపీ హ యాంలో మంత్రులుగా పనిచేశారు. కాని తొలి సారి జిల్లా నుంచి డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటికే కీలక నాయకుల కు నామినేటెడ్‌ పదవులు వచ్చాయి.

Updated Date - Nov 15 , 2024 | 12:21 AM