ప్రతి ఇంటికి సూపర్ సిక్స్ పథకాలు
ABN , Publish Date - Apr 25 , 2024 | 12:27 AM
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్హులైన ప్రతి ఇంటికి సూపర్ సిక్స్ పథకాలను అందిస్తామని జనసేన అభ్యర్థి పత్సమట్ల ధర్మరాజు పిలుపునిచ్చారు.
ఉంగుటూరు కూటమి అభ్యర్థి పత్సమట్ల ధర్మరాజు
ఉంగుటూరు/గణపవరం, ఏప్రిల్ 24 : కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్హులైన ప్రతి ఇంటికి సూపర్ సిక్స్ పథకాలను అందిస్తామని జనసేన అభ్యర్థి పత్సమట్ల ధర్మరాజు పిలుపునిచ్చారు. బుధవారం ఉంగుటూరు మండలం కైకరం గ్రామంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాబోయే కూటమి ప్రభుత్వం అందించే పథకాలలో భాగంగా సూపర్‌సిక్స్ పథకాలను ఇంటింటికి తిరిగి వివరించారు. మాజీ జడ్పీటీసీ చింతల శ్రీనివాస్, సర్పంచి సలగాల గోపి, మాజీ సర్పంచి యాళ్ళ సుజీవరావు, ఉంగుటూరు మండల జనసేన అధ్యక్షుడు పంది రాంబాబు, ఎంపీటీసీ చెన్ను సత్యవాణి, యెగ్గిన శ్యామల, లింగంపల్లి మణికంఠ తదితరులు పాల్గొన్నారు. గణపవరం మండలం గణపవరంలోని చినరామ చంద్రపు రంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చి రాష్ర్టాన్ని సర్వనాశనం చేసిన జగన్‌కు మరో అవకాశం ఇస్తే రాష్ర్టాన్ని పూర్తిస్థాయిలో దివాళా తీయిస్తాడన్నారు. 25 మం దికి జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీ మండల అధ్యక్షుడు ఇందుకూరి రామకృష్ణం రాజు, గణపవరం టీడీపీ పట్టణ అధ్యక్షుడు కూసంపూడి సురేంద్రకుమార్‌రాజు, టీడీపీ నాయకుడు పొత్తూరి నరసింహరాజు, పట్టణ టీడీపీ యువత అధ్యక్షుడు కాపారం చిన్న, సప్పా రాంబాబు, షేక్ బషీర్, జనసేన మండల నాయకుడు తోట శ్రీనివాసరావు, వంగా రఘు, తదితరులు పాల్గొన్నారు.