Share News

జగనన్న కాలనీలపై విజిలెన్స్‌

ABN , Publish Date - Dec 11 , 2024 | 12:38 AM

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జగనన్న కాలనీలపై విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు తనిఖీ చేపట్టారు.

జగనన్న కాలనీలపై విజిలెన్స్‌
నూజివీడులో జగనన్న కాలనీలను తనిఖీ చేస్తున్న విజిలెన్స్‌ బృందం

ఇళ్ల నిర్మాణాలపై ఆరా

కాలనీల్లో సౌకర్యాల పరిశీలన

ముసునూరు/నూజివీడు టౌన్‌, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జగనన్న కాలనీలపై విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు తనిఖీ చేపట్టారు. లేఅవుట్లు నివాసయోగ్యంగా ఉన్నా యా, సౌకర్యాలు, కట్టిన ఇళ్లు, ఇళ్ల నిర్మాణాలు జరగకపోవడానికి గల కారణాలపై సమగ్ర సమాచారం సేకరిస్తున్నారు. ముసునూరు మం డలంలోని రమణక్కపేట, చింతలవల్లి, లోపూడి, గుళ్ళపూడి జగనన్నకాలనీ లేఅవుట్లును విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీఈ శ్రీనివాస్‌ క్షేత్రస్ధాయి మం గళవారం తనిఖీ చేశారు. 222 మందికి ఇళ్ల స్థలాలు కేటాయించగా, 8మంది మాత్రమే ఇళ్లు కట్టుకున్నారని, విద్యుత్‌, రోడ్లు సౌకర్యాలు మాత్రమే ఉన్నాయని, నీటి సౌకర్యానికి బోరు లేదని హౌసింగ్‌ వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ నాగేంద్రరావు తెలిపారు. లోపూడి లేఅవుట్‌లో 111మందికి పట్టాలు ఇవ్వగా, 10 ఇళ్ల నిర్మాణం జరిగిందని, ఇక్కడ నీటి సౌకర్యం లేదన్నారు. చింతలవల్లిలో రెండు లేఅవుట్‌ల్లో 322 పట్టాలు, గుళ్ళపూడిలో ఒక లేఅవుట్‌లో 184 పట్టాలు ఇవ్వగా ఈ లేఅవుట్‌ల్లో ఎటువంటి సౌకర్యాలు లేకపోవడంతో ఒక్క ఇంటి నిర్మాణం కూడా జరుగలేదని తెలిపారు. తహసీల్దార్‌ కె.రాజ్‌కుమార్‌, ఆర్‌ఐ దీపిక, వీఆర్వో రవికాంత్‌, పంచాయితీ కార్యాదర్శి నాగబాబు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

నూజివీడు పట్టణంలో ఎమ్మార్‌ అప్పారావు కాలనీ, అన్నవరం పరిధిలోని జగనన్న కాలనీ లను డీఈ శ్రీనివాసన్‌, ఏఈఈ రూపేష్‌ వర్మ, అనిల్‌ ఆధ్వర్యంలో అధికారులు పరిశీలించారు. తహసీల్దార్‌ సుబ్బారావును వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Updated Date - Dec 11 , 2024 | 12:38 AM