Share News

పల్లెలకు స్వచ్ఛ నీరు

ABN , Publish Date - Nov 16 , 2024 | 12:48 AM

చుట్టూ గోదావరి జలాలు వున్నా జిల్లా వాసులకు సురక్షిత నీరు కరువు. కాల్వలన్నీ కలుషితం. దాహార్తి తీర్చుకోవడానికి సురక్షితమైన నీటి కోసం ఏటా కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. దీనిని అధిగమించేందు కు గత తెలుగుదేశం ప్రభుత్వంలో వాటర్‌గ్రిడ్‌ ప్రాజె క్ట్‌కు శ్రీకారం చుట్టింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికి నిధులు కేటాయించలేదు.

పల్లెలకు స్వచ్ఛ నీరు

పట్టాలపైకి వాటర్‌ గ్రిడ్‌ పథకం

గోదావరి నుంచి మళ్లింపు

పైప్‌లైన్‌ ద్వారా శుద్ధి జలాలు

గత ప్రభుత్వ అంచనాలకు సవరణ

కొత్త ధరలతో ప్రతిపాదనలు

(భీమవరం–ఆంఽధ్రజ్యోతి)

చుట్టూ గోదావరి జలాలు వున్నా జిల్లా వాసులకు సురక్షిత నీరు కరువు. కాల్వలన్నీ కలుషితం. దాహార్తి తీర్చుకోవడానికి సురక్షితమైన నీటి కోసం ఏటా కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. దీనిని అధిగమించేందు కు గత తెలుగుదేశం ప్రభుత్వంలో వాటర్‌గ్రిడ్‌ ప్రాజె క్ట్‌కు శ్రీకారం చుట్టింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికి నిధులు కేటాయించలేదు. కాని, ప్రాజెక్ట్‌ పనులు ప్రారంభించినట్టు జగన్‌ హడావుడి చేశారు. ప్రాజెక్ట్‌ను పల్లెలకు మాత్రమే పరిమితం చేశారు. ఇందుకు రూ.1420 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి ఏజన్సీని ఖరారు చేసింది. సర్వే కూడా పూర్తి చేయ లేదు. పనులు ప్రారంభించలేదు. టీడీపీ కూటమి ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడంతో వాటర్‌గ్రిడ్‌ ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టారు.

పెరిగిన ధరలకు అనుగుణంగా అంచనాలను సవ రించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. గతంలో మినహాయించిన గ్రామాలను అవసరమైతే ప్రాజెక్ట్‌లో కలపాలని దిశానిర్దేశం చేసింది. ఆ పనిలో గ్రామీణ నీటిపారుదల శాఖ అఽధికారులు తలమునకలవుతు న్నారు. ఫలితంగా ప్రాజెక్ట్‌ వ్యయం పెరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం వాటా నిధులు భరిస్తాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రాజెక్ట్‌లను చేపట్టాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. తొలుత పశ్చిమలో ప్రాజెక్ట్‌ను పూర్తి చేయను న్నారు. జిల్లాలోని 409 పంచాయతీలకు మంచినీటి సమస్య తీరనుంది. వేసవిలోనూ సమృద్ధిగా స్వచ్ఛ మైన గోదావరి జలాలు సరఫరా చేయనున్నారు.

మూడు పైపు లైన్ల ద్వారా సరఫరా

గోదావరి జలాలను శుద్ధి చేసి నేరుగా పల్లెలకు తరలిస్తారు. అక్కడ ఓహెచ్‌ఆర్‌ల నుంచి కుళాయిల కు సరఫరా చేస్తారు. ఇందుకు మూడు సరఫరా లైన్‌లను వేస్తారు. విజ్జేశ్వరం నుంచి నర్సాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం వైపు ఈ పైప్‌లైన్‌లు ఉంటాయి. వాటి నుంచి సబ్‌ పైపులైన్‌ల ద్వారా ప్రతి గ్రామానికి శుద్ధి చేసిన మంచినీటిని అందిస్తారు. విజ్జేశ్వరం వద్ద గోదావరి జలాలను తోడి శుద్ధి చేసేందుకు జిల్లాలోని ఎగువ భాగంలో ప్లాంట్‌ను నిర్మించనున్నారు. అక్కడే శుద్ధి జరుగుతుంది. అక్కడ నుంచి మంచినీరు గ్రామాలకు సరఫరా అవుతుంది. దీనివల్ల కలుషిత జలాలకు చెక్‌ పడుతుంది. జిల్లా ప్రజలకు గోదావరి జలాలు గొంతు తడపనున్నాయి. దీనిపై జిల్లా ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

నీటి ఎద్దడి రాకూడదు

ఏప్రిల్‌ 15న కాల్వల కట్టివేత..

జూన్‌ 1న విడుదల : నీటి పారుదల

సలహా సమావేశంలో కలెక్టర్‌ నాగరాణి

భీమవరం రూరల్‌, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): ‘ఈ ఏడాది మూడుసార్లు వరదలు, మరో మూడుసార్లు తుఫాన్లు వచ్చాయి. దీనితో రైతులు ఇబ్బందులు పడ్డారు. కావున కాల్వలు, డ్రెయిన్లు మరమ్మతు పనులపై దృష్టి సారించాలి. ఎక్కడ ఏ పనులు చేయాలో వారం రోజు ల్లోగా పూర్తిస్థాయి నివేదిక ఇవ్వండి’ అంటూ జిల్లా కలెక్టర్‌ చదలవాడ నాగరాణి అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నీటిపారుదల సలహా మండలి సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘రబీలో సాగు నీటి కొరత లేకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించుకుని పక్కాగా అమలుచేయాలి. డిసెంబరు 31వ తేదీలోగా అన్ని చెరువులు, ఓహెచ్‌ఎస్‌ఆర్‌ ట్యాంక్‌లను నింపుకోవాలి. ఏప్రిల్‌ 15వ తేదీన కాలువలు మూసివేసి జూన్‌ 1న తిరిగి నీటిని వదులుతారు. పూర్తిస్థాయిలో కాలువలోకి నీరు రావడానికి మరో పదిరోజులు పడుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని తాగు, సాగునీటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలి. రబీకి నీటి లభ్యత తక్కువగా ఉన్నందున పొదుపు పాటించాలి. డ్రెయిన్లకు అడ్డు కట్టలు వేయడం, ఆయిల్‌ ఇంజన్ల ఏర్పా టు, వంతుల వారీ విధానం ద్వారా ప్రతి ఎకరాకు నీటి నందించాలి. కాలువలు, డ్రెయిన్లలో ఎప్పటికప్పుడు చెత్తా చెదారాన్ని తొలగించాలి’ అని కలెక్టర్‌ ఆదేశించారు. జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి, డీఆర్వో ఎం.వెంకటేశ్వర్లు, ఆర్డీవో లు కె.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, దాసి రాజు, ఖతీబ్‌ కౌసర్‌ భానో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Nov 16 , 2024 | 12:48 AM