Share News

బాలిక అత్యాచారం కేసులో వార్డెన్‌, అతని భార్య, మేనకోడలు అరెస్టు

ABN , Publish Date - Sep 21 , 2024 | 12:12 AM

బాలికపై అత్యాచారానికి పాల్పడిన వార్డెన్‌తో పాటు అతనికి సహకరించిన అతని భార్య, మరో యువతిని అరెస్టు చేసినట్టు ఏలూరు జిల్లా ఎస్పీ కిషోర్‌ చెప్పారు.శుక్రవారం విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు.

బాలిక అత్యాచారం కేసులో వార్డెన్‌, అతని భార్య, మేనకోడలు అరెస్టు
వివరాలు తెలుపుతున్న ఏలూరు జిల్లా ఎస్పీ కిషోర్‌

ఏలూరు క్రైం, సెప్టెంబరు 20 : బాలికపై అత్యాచారానికి పాల్పడిన వార్డెన్‌తో పాటు అతనికి సహకరించిన అతని భార్య, మరో యువతిని అరెస్టు చేసినట్టు ఏలూరు జిల్లా ఎస్పీ కిషోర్‌ చెప్పారు.శుక్రవారం విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. ఏలూరులో ఉన్న సేవాశ్రమం బాలికల వసతి గృహాన్ని గతంలో శ్రీస్వామి దయానంద సరస్వతికి సం బంధించిన ఎయిమ్‌ ఫర్‌ సేవా ఆలిండియా మూమెంట్‌ ఫర్‌ సేవా అనే ట్రస్టును నిర్వహిస్తున్నది. అమెరికాకు చెందిన గురుకృత అనే సంస్థ భవన నిర్మాణానికి నిధులను సమకూర్చింది. 2018లో ఈ ట్రస్టు రిజిస్ట్రేషన్‌ చేయిం చుకున్నారు. అయితే బాలికల వసతి గృహం నిర్వహించడానికి ఎలాంటి అనుమతులు పొందలేదన్నారు. తొలుత శేషం రాజు అనే వృద్దుడు మేనేజర్‌గా వ్యవహరించేవాడు. అతని వద్దకు ఏలూరు గ్రీన్‌ సిటీలో నివాసం ఉంటున్న బొమ్మిరెడ్డిపల్లి శశికుమార్‌ (56) తరచుగా వెళ్ళేవారు. తాను చింతలపూడి మండలం లోని వసతి గృహంలో వార్డెన్‌గా పనిచేస్తున్నానని తనకు ఎంతో అను భవం ఉందని పార్టు టైమ్‌గా అక్కడ ఉద్యోగం చేస్తానని చెప్పుకొచ్చాడు. పురుషులకు అవకాశం లేదని చెప్పడంతో అతని భార్యకు అవకాశం ఇవ్వ మని కోరడంతో అతని భార్య ఫణిశ్రీకి(52) వార్డెన్‌గా అవకాశం కల్పించారు. తన మేనకోడలు బయ్యారపు లావణ్య (20)ను పరిచయం చేసి కేర్‌ టేకర్‌గా ఉద్యోగం ఇప్పించారు.యాజమాన్యానికి శేషంరాజుపై చెడుగా చెప్పి అతనిని అక్కడ నుంచి తొలగించారు. అక్కడ పరిస్థితి అంతా తన చేతిలోకి వచ్చేలా చూసుకున్నారు. శశికుమార్‌కు ఏలూరులో మణి డిజిటల్స్‌ అనే ఫోటో స్టూడియో కూడా ఉంది. ఆ వసతి గృహంలో చదివే విద్యార్థినులకు ఫోటో గ్రఫీపై మక్కువ కల్పించి వారికి నేర్పిస్తానని నమ్మబలికి వేరే ప్రాంతా లకు తీసుకువెళ్తూ ఉండేవాడు. అదే క్రమంలో ఈనెల 15న ఆ వసతి గృహంలో చదువుతున్న 8వ తరగతి విద్యార్థినిని లావణ్య, ఫణిశ్రీలు బలవంతంగా తీసుకువెళ్ళి శశికుమార్‌ కారులో ఎక్కించారు. అతను కారులో బాపట్ల తీసుకువెళ్ళి అక్కడ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక జరిగిన సంఘటనను తల్లి దండ్రులకు, తోటి విద్యా ర్థులకు చెప్పడంతో ఏలూరు టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన శశికుమార్‌, అతని భార్య ఫణిశ్రీ, కేర్‌ టేకర్‌ లావణ్యలను శుక్రవారం శుక్రవారం మధ్యాహ్నం అరెస్టు చేశామని ఎస్పీ చెప్పారు. ఏలూరు డీఎస్పీ శ్రావణ్‌ కుమార్‌, టూటౌన్‌ సీఐ రమణ, స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆది ప్రసాద్‌, నిడమర్రు ఇన్‌స్పెక్టర్‌ సుభాష్‌, మహిళా ఎస్‌ఐ నాగ కల్యాణిలను ఎస్పీ అభినందించారు.

Updated Date - Sep 21 , 2024 | 12:12 AM