Share News

నీటి సంఘాల ఓటరు జాబితాపై కసరత్తు

ABN , Publish Date - Oct 10 , 2024 | 12:32 AM

సాగునీటి సం ఘాలకు ఎన్నికలు నిర్వ హించేందుకు ప్రభు త్వం వడివడిగా అడుగులు వేస్తుంది.

నీటి సంఘాల ఓటరు జాబితాపై కసరత్తు

ప్రతి రైతు ఓటరే.. కౌలు రైతుకూ ఓటు హక్కు

నరసాపురం, అక్టోబరు 9: సాగునీటి సం ఘాలకు ఎన్నికలు నిర్వ హించేందుకు ప్రభు త్వం వడివడిగా అడుగులు వేస్తుంది. జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సంబంధిత అధికారులకు దిశా నిర్దేశం చేశారు. కాల్వలు వారీగా రైతుల వివరాలను సేకరించి ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించారు. అధికారులు పాత ఓటర్ల జాబితాను బయటకు తీస్తున్నారు. కొత్తగా అర్హులైన రైతుల్ని ఓటర్లగా చేర్చి జాబితాను త్వరలో ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నారు. దీంతో గ్రామాల్లో తొమ్మిదేళ్ళ తరువాత సాగునీటి ఎన్నికల సందడి కనిపిస్తుంది. సొంత పొలం ఉండి వ్యవసాయం చేసే ప్రతి రైతుకు ఓటు హక్కు ఉంటుంది. నీటి పన్ను, ఈకెవైసీ ద్వారా రైతుల వివరాలు తెలుసుకుని ఓటర్ల జాబితాలో చేర్చుతారు. ఛానల్స్‌ పరిధిలోని రైతుల వివరాలను ముందుగా ప్రకటించి ఆభ్యంతరాలు ఉంటే సవరిస్తారు. తాజాగా కౌలు రైతులకు ఓటు కల్పించాలని ప్రభుత్వ నిర్ణయించించడంతో జిల్లాలో ఓటర్ల సంఖ్య పెరగనుంది. ఈ ప్రక్రియ 40 రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జాబితా ప్రక్రియ పూర్తికాగానే నీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. రాష్ట్ర విభజన తరువాత సాగునీటి సంఘాలకు 2015లో ఎన్నికలు జరిగాయి. గత వైసీపీ హయాంలో మళ్లీ ఎన్నికలను నిర్వహించలేదు. తొమ్మిదేళ్ల తరువాత ఎన్నికలు జరుగుతుండంతో కొత్తవారు పోటీ చేసేందుకు అసక్తి చూపుతున్నారు.

Updated Date - Oct 10 , 2024 | 12:32 AM