Share News

అర్ధాకలితో అలమటిస్తున్నాం.. జీతాలివ్వండి

ABN , Publish Date - Oct 23 , 2024 | 12:33 AM

పారిశుధ్య కార్మికుల వేతన బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఇఫ్టూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్‌.రామ్మోహన్‌, సీపీఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య డిమాండ్‌ చేశారు. సమస్యలు పరిష్కారించాలంటూ ఇఫ్టూ, ఏఐటీయూసీ ఆధ్వ ర్యంలో మంగళవారం బుట్టాయగూడెం సామా జిక ఆరోగ్య కేంద్రం ఎదుట పారిశుధ్య కార్మికులు ఆందోళన చేశారు.

అర్ధాకలితో అలమటిస్తున్నాం.. జీతాలివ్వండి
బుట్టాయగూడెం సీహెచ్‌సీ ఎదుట ఆందోళన చేస్తున్న పారిశుధ్య కార్మికులు

వేతన బకాయిలు విడుదల చేయండి

పారిశుధ్య కార్మికుల డిమాండ్‌

బుట్టాయగూడెం, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి) : పారిశుధ్య కార్మికుల వేతన బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఇఫ్టూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్‌.రామ్మోహన్‌, సీపీఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య డిమాండ్‌ చేశారు. సమస్యలు పరిష్కారించాలంటూ ఇఫ్టూ, ఏఐటీయూసీ ఆధ్వ ర్యంలో మంగళవారం బుట్టాయగూడెం సామా జిక ఆరోగ్య కేంద్రం ఎదుట పారిశుధ్య కార్మికులు ఆందోళన చేశారు. రామ్మోహన్‌ మాట్లాడుతూ ఆరు నెలలుగా వేతనాలు అందక కార్మికులు ఆర్థి క ఇబ్బందులు పడుతున్నారని, పెండింగ్‌ బకా యిలను విడుదల చేయాలన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పీఎఫ్‌, ఈఎస్‌ఐ బోనస్‌లు కార్మికులకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కారించకపోతే నిరవధి క సమ్మెకు వెళతామన్నారు. కె.దారయ్య, ఎం.కృష్ణ, ఎస్‌.ధర్మరాజు, ఎం.సత్యవతి పాల్గొన్నారు.

చింతలపూడి : స్థానిక ఏరియా ఆస్పత్రి పారిశుధ్య కార్మికుల దీక్షలు మూడో రోజుకు చేరు కున్నాయి. ఐదు నెలలుగా జీతాలు రావడంలేదని, పీఎఫ్‌, ఈఎస్‌ఐ సొమ్ములు కాంట్రాక్టర్‌ జమ చేయడంలేదని, నిధులు విడుదల చేయాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఈ దీక్షలు కొనసాగు తున్నాయి. దీక్షలో టి.బాబు, నాగరాజు, మరియమ్మ, సుజాత తదితరులు పాల్గొన్నారు.

జంగారెడ్డిగూడెం : చాలీ చాలని జీతాలతో అర్ధాకలితో ఏరియా ఆస్పత్రి పారిశుధ్య కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీపీఐ మండల కార్యదర్శి జేవీ రమణరాజు డిమాండ్‌ చేశారు. పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్క రించాలని కోరుతూ చేపట్టిన నిరసన దీక్షలు మూడో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఏరియా ఆస్పత్రి వద్ద ధర్నా నిర్వహించారు. ఏఐటీయూసీ మండల కార్యదర్శి కుంచే వసంత రావు, సీపీఐ, నాయకులు జి.బాలయేసు,బొక్కా శ్రీను, వేముల రాజు,బూరుగు సంజయ్‌,తోట దయామణి, జ్యోత్స్న, మేరీ, శ్రీను పాల్గొన్నారు.

Updated Date - Oct 23 , 2024 | 12:33 AM