పదవుల్లో పశ్చిమకు ప్రాధాన్యం
ABN , Publish Date - Nov 23 , 2024 | 12:39 AM
తెలుగుదేశం కూటమి ప్రభుత్వ పదవుల్లో పశ్చిమకు ప్రాధాన్యం కొనసాగుతోంది. తాజాగా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్‌గా భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు, సభ్యుడిగా తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఎన్ని కయ్యారు.
పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్‌గా భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు.. సభ్యుడిగా తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి
భీమవరం/టౌన్/తణుకు, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం కూటమి ప్రభుత్వ పదవుల్లో పశ్చిమకు ప్రాధాన్యం కొనసాగుతోంది. తాజాగా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్‌గా భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు, సభ్యుడిగా తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఎన్ని కయ్యారు. వివాదరహితులుగా పేరున్న వీరిద్దరిని ఈ పదవులకు ఎంపికచేశారు. రాష్ట్ర అసెంబ్లీల్లో శుక్రవారం జరిగిన ఎన్నికల్లో వీరు విజయం సాధించారు. భీమవరం నుంచి అంజిబాబు మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్ని కయ్యారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్‌గా పశ్చిమకు పదవి రావడం ఇదే తొలిసారి. కూటమి ప్రభుత్వంలో కీలక పదవులు పశ్చిమకు వరిస్తున్నాయి. మంత్రి పదవి, డిప్యూటీ స్పీకర్, రెండు ప్రభుత్వ విప్‌లు, నాలుగు కార్పొ రేషన్ పదవులు జిల్లాకు దక్కాయి. ఇక పశ్చిమ గోదావరి జిల్లా లోవున్న ముగ్గురు జనసేన ఎమ్మెల్యేలకు పదవులు దక్కాయి. తాడేపల్లిగూడెం, నర్సాపురం ఎమ్మెల్యేలు బొలి శెట్టి శ్రీనివాస్, బొమ్మిడి నాయకర్ ప్రభుత్వ విప్‌లుగా నియ మితులయ్యారు. తాజాగా అంజిబాబుకు మరో కీలక పద వి అయిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవి వరిం చింది. ఇలా కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీలో కీలక పదవులు జిల్లాకు దక్కాయి. అత్యధిక పదవులు వరించిన జిల్లాగా పశ్చిమ గుర్తింపుపొందింది. రాష్ట్ర ప్రభుత్వంలో అత్యంత కీలకమైన ఆదాయ వ్యయా లను సరిచేసే కమిటీలో సభ్యులు కావడానికి అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్, ఐటీ మంత్రి లోకేష్‌కు రాధాకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా
రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. ఐదేళ్లపాటు ఆర్థిక క్రమశిక్షణ కొరవడింది. విపరీతంగా అప్పులు చేసి, అభివృద్ధిని మర్చిపోయారు. ప్రతీ ప్రభుత్వ శాఖలోను దుబారును నివారిస్తాం. ప్రతీపైసా పొదుపుచేసి సద్వినియోగం చేస్తాం. దీనికి అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సహక రించాలి. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ల
నాయకత్వంపై ప్రజలు నమ్మకం ఉంచారు. కూటమి ప్రభుత్వానికి మద్దతు పలికారు. వారి నమ్మకాన్ని నిలుబెట్టుకుంటాం. నాకు ప్రభుత్వం అప్పగించిన బాధ్యతలను
చిత్తశుద్ధితో నిర్వర్తిస్తా. ప్రభుత్వ ప్రతిష్టను పెంచేందుకు కృషి చేస్తా.
– పులపర్తి రామాంజనేయులు(అంజిబాబు)