ఆయుధ డిపో ఏమైంది
ABN , Publish Date - Oct 26 , 2024 | 01:02 AM
ఏడాది క్రితం ఏజెన్సీలో నేవీ ఆర్భా టం అంతా ఇంతా కాదు. అవు నన్నా.. కాదన్నా ఈ ప్రాంతంలోనే ఆయుధ డిపో ఏర్పాటుకు వీలుగా భూసేకరణకు యత్నాలు సాగాయి.
రోడ్డెక్కిన గిరిజనం..
అప్పటి నుంచి అంతా సైలెంట్..
ఎంపీ పుట్టా వ్యాఖ్యలతో మళ్లీ జీవం
ఏడాది క్రితం ఏజెన్సీలో నేవీ ఆర్భా టం అంతా ఇంతా కాదు. అవు నన్నా.. కాదన్నా ఈ ప్రాంతంలోనే ఆయుధ డిపో ఏర్పాటుకు వీలుగా భూసేకరణకు యత్నాలు సాగాయి. దీంతో ఆ ప్రాంత గిరిజనం బావుర మంటూ రోడ్డెక్కారు. ఆపై ఏడా దిగా అంతా సైలెంట్. కాని కొద్ది రోజుల్లోనే డిపో ఏర్పాటుకు వీలుగా చురుకైన చర్యలు ఆరంభిస్తారని తెలుస్తోంది.
(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి):
జీలుగుమిల్లి మండలం వంకవారిగూడెం పరి సర ప్రాంతాల్లోనే ఈ ఆయుధ డిపో ఏర్పాటుకు అనువుగా సుమారు 1166 ఎకరాల్లో అనువైన పరిస్థితులు ఉన్నాయా, లేవా అని తెలుసుకునేం దుకు గుట్టుగా అధికారులు రంగంలోకి దిగారు. నేవీకి సంబంధించి సర్వే అధికారులు తమ వంతుగా భూమి అంచనాకు సిద్ధపడ్డారు. స్థానిక అధికారులిది కేవలం ప్రేక్షకపాత్ర వహించారు. గతేడాది నవంబరు, డిసెంబరు మాసాల్లో ఈ హడావుడి అంతా సాగింది. వాస్తవానికి వంక వారిగూడెంలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కాలనీ నిర్మాణానికి భూమికి భూమి కింద కేటా యించేందుకు ఇప్పటికే ప్రభుత్వం నిర్దేశించింది. అయినప్పటికి జీలుగుమిల్లిలోని ఈ ప్రాంతం ఒక వైపు రోడ్డు రవాణాకు, భవిష్యత్తులో నిర్మించే రైల్వే మార్గానికి అత్యంత అనువుగా ఉండడమే కాకుండా ఇంకోవైపు తెలంగాణ వైపు ముందుకు సాగేందుకు అనుకూల పరిస్థితులు ఉండడం నేవీ పరిగణనలోకి తీసుకుంది. ఈ కారణంగానే వంకవారిగూడెంలో అయితే తగినంత భూమి ఉన్నట్టుగా నిర్ధారించుకుని మరీ గుట్టుగా రంగం లోకి దూకింది. స్థానికులు అప్పట్లోనే ఆయుధ డిపో వ్యవహారాన్ని వ్యతిరేకించారు. అప్పట్లో అధి కారంలో ఉన్న స్థానిక ఎంపీ కోటగిరి శ్రీధర్‌తోను నేవీ అధికారులు జీలుగుమిల్లి ప్రాంతమే ఆయు ధ డిపోకు అనువైన ప్రాంతంగా వివరించారు. అయితే ఈ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తున్న గిరి జన, గిరిజనేతర వర్గాలన్నీ అప్పట్లో ఎంపీకి మొరపెట్టుకున్నాయి. తమ ప్రాంతంలో ఆయుధ డిపో పెట్టవద్దని, స్థానికుల రాకపోకలపై ఆంక్షలు అమలవుతాయని మొరపెట్టుకున్నారు. పోలవరం ప్రాజెక్టుకు తమ భూములను ఇచ్చి ఒకప్పుడు నష్టపోయా మని, మళ్ళీ తిరిగి తమకు ఈ ప్రాం తంలో భూమికి భూమి కింద తగినంత భూమి ఇచ్చేందుకు నిర్మించిన కాలనీల్లో మెరుగైన వస తులు కల్పించేందుకు ప్రభుత్వం ప్రయత్ని స్తున్న తరుణంలోనే ఈ ప్రాంతంపై నేవీ కన్ను పడడం పై ఆందోళన వ్యక్తం చేశారు. ఎందుకంటే వంక వారిగూడెం పంచాయతీ పరిధిలో మడకవారి గూడెం, దాట్లవారిగూడెం, వంకవారిగూడెం, కొత్త సీమలివారిగూడెం, రమణక్కపేట అనే ఐదు గ్రా మాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో నివసిస్తున్నది గిరిజన కుటుంబాలే.
నిర్మాణం ఆరంభిస్తే..
వాస్తవానికి అత్యంత భద్రతతో కూడిన నేవీ ఆయుధ డిపోను నిర్మించదలిస్తే కేవలం మూడేళ్ల వ్యవధిలోనే అంతా పూర్తవుతుందని అప్పట్లోనే అధికారిక సమాచారం వెలువడింది. కాని స్థల సేకరణలోనే అప్పట్లో జంగారెడ్డిగూడెం ఆర్డీవో, స్థానిక తహసీల్దార్‌కు మాత్రమే క్లుప్తంగా సమా చారం అందించారు. ఆ తర్వాత నేవీకి సంబంధిం చిన సర్వేయర్లు తమకు అవసరమైన 1100 ఎక రాల భూభాగాన్ని అత్యంత ఆధునాతన సాంకే తిక పద్ధతుల్లో సర్వే చేశారు. అయితే నేవీ తన ప్రతిపాదనలను ఎందుకు అమలులోకి తేలేక పోయిందనేదే ఇప్పుడు అందరి ప్రశ్న. జీలుగు మిల్లి మండలంలోని గిరిజన కుటుంబాలు కేవ లం తమ ఆందోళనను దృష్టిలో పెట్టుకుని నేవీ వెనక్కి మళ్ళిందని కొంత సంతృప్తిపడగా, తాజా గా ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్ నేవీ ఆయుధ డిపో పోలవరం నియోజకవర్గంలోనే రాబోతుం దని, కేంద్రం సైతం సానుకూలంగానే ఉన్నట్టు ప్రకటించారు. దీంతో మరో మారు ఆయుధ డిపో వ్యవహారం తెరముందుకు వచ్చింది. గతంలో చేసిన ఏపీలోని ప్రతిపాదనల్లో కొన్నింటిని ఆమో దించేందుకు కేంద్రం సంసిద్ధంగా ఉన్నట్టు ఇప్ప టికే ప్రచారం జోరందుకుంది. దీనిలో భాగంగానే జీలుగుమిల్లి మండలంలో నేవీ ఆయుధ డిపో ఏర్పాటుకు అధికారికంగా సంకేతాలు ఇచ్చే అవ కాశం లేకపోలేదని భావిస్తున్నారు. అయితే స్థాని క అధికారులు గతంలో ఏమి జరిగిందో తమకు నామమాత్రంగా కూడా నేవీ నుంచి సమాచారం లేదంటున్నారు. తాజాగా గ్రీన్‌ఫీల్డ్ హైవే పొరు గునే సత్తుపల్లి– కొవ్వూరు రైల్వేలైను నిర్మాణానికి అనువైన పరి స్థితులు ఉండడంతో నేవీడిపో ప్రతిపాదనకు పూర్తిగా జీవం వచ్చినట్టేనని ఇం కొందరు భావిస్తున్నారు. కాని స్థానికంగా ఉన్న గిరిజనులు ఈ తరహా డిపో ఏర్పాటుతో ప్రశాం తంగా ఉండే ఈ ప్రాంతం కకావికలం అవుతుం దని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.