బాల్య వివాహాలను అరికడదాం
ABN , Publish Date - Jan 26 , 2024 | 12:16 AM
సమాజంలో బాలికలు ఎదుర్కొంటున్న అసమా నతలు, వివక్షపై ప్రజల్లో అవగాహన కల్పించాలని జాయింట్ కలెక్టర్ బి.లావణ్య వేణి అన్నారు.
బేటీ బచావో – బేటీ పడావో అవగాహన కార్యక్రమం
ఏలూరు కలెక్టరేట్, జనవరి 25: సమాజంలో బాలికలు ఎదుర్కొంటున్న అసమా నతలు, వివక్షపై ప్రజల్లో అవగాహన కల్పించాలని జాయింట్ కలెక్టర్ బి.లావణ్య వేణి అన్నారు. గిరిజన భవన్‌లో బేటీ బచావో – బేటీ పడావో ఆడపిల్లలను బతికి ద్దాం, ఆడపిల్లలను చదివిద్దాం వర్క్‌షాపును ఐసీడీఎస్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. జేసీ లావణ్యవేణి మాట్లాడుతూ సామాజిక భద్రత, బాల్య వివాహాలు తదితర అంశాలపై అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. బాల్య వివాహాలు అరికట్టేందుకు ఏర్పాటుచేసిన బోర్డులను ఆవిష్కరిం చారు. అనంతరం ప్రతిజ్ఞ చేశారు. ఐసీడీఎస్ పీడీ పద్మావతి, డీఆర్‌డీఏ పీడీ ఆర్.విజయరాజు, డీఈవో శ్యామ్‌సుందర్, బాలల సంరక్షణ అధికారి సీహెచ్.సూర్యచక్రవేణి తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు వ్యాసరచన పోటీలు
జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా బాలికలను బతకని ద్దాం – బాలికలను చదివిద్దాం నినాదంతో కలెక్టరేట్‌లో, నూజివీ డు డివిజన్ విద్యార్థులకు వ్యాస రచన, వక్తృత్వ, పెయింటింగ్ పోటీలను నిర్వహించారు. ప్రతి కేటగిరికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు రూ.5వేలు, రూ.3వేలు, రూ.2వేలు చొప్పున చెక్కులను కలెక్టర్ ప్రసన్నవెంకటేష్ అందజేశారు. చిత్రలేఖనం విజేతలకు చెక్కులను అందజేశారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ శర్మిష్ట, డీసీపీవో సూర్యచక్రవేణి, పీఈఎంవో డి.నాగరత్నం, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.