భూముల సంరక్షణకు చర్యలు చేపట్టాలి
ABN , Publish Date - Dec 06 , 2024 | 12:13 AM
భూములను సంరక్ష ణపై అందరూ అవగాహన కలిగి ఉండాలని మండల వ్యవసాయాధికారి డి.ముత్యాలరావు అన్నారు.
ప్రపంచ నేలల దినోత్సవ అవగాహన సదస్సు
బుట్టాయగూడెం, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): భూములను సంరక్ష ణపై అందరూ అవగాహన కలిగి ఉండాలని మండల వ్యవసాయాధికారి డి.ముత్యాలరావు అన్నారు. విప్పలపాడు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో గురువారం ప్రపంచ నేల దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. డిసెంబరు 5న ప్రపంచంలోని అన్ని దేశాలు నేల దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆహార భద్ర త, ఆరోగ్యకరమైన పర్యావరణ వ్యవస్థలు, మాన వ శ్రేయస్సుకు నేల నాణ్యత, ప్రాముఖ్యతలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థుల కు వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించి బహు మతులు అందజేశారు. ఉపాధ్యాయులు భార్గవి, దీపక్ విద్యార్ధులు పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం ప్రపంచ నేలల దినోత్స వ కార్యక్రమం ప్రిన్సిపాల్ ఎన్.ప్రసాద్ బాబు అధ్యక్షతన జరిగింది. వివిధ రకాల నేలల గురించి వాటి ప్రాధాన్యతను గూర్చి విద్యార్థు లకు వివరించారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.