Share News

ఫలితాలు దారుణం

ABN , Publish Date - Dec 02 , 2024 | 12:12 AM

ఎంపికచేసిన జడ్పీ హైస్కూళ్ల ప్రాంగణంలో హైస్కూల్‌ ప్లస్‌ పేరిట రెండేళ్ల ఇంటర్మీడియట్‌ విద్యనందిస్తున్నారు. మూడేళ్ల క్రితం వైసీపీ ప్రభు త్వం హడావుడిగా ప్రారంభించిన ప్లస్‌ టూ విద్య క్షేత్రస్థాయిలో దారుణంగా విఫలమైంది.

 ఫలితాలు దారుణం

ఇంటర్‌ ఉత్తీర్ణత మైనస్‌

త్రైమాసిక పరీక్షల్లో అదే తీరు

ప్రత్యేక కార్యాచరణకు సమాయత్తమైన విద్యాశాఖ

ఏలూరు అర్బన్‌, డిసెంబరు 1 (ఆంద్రజ్యోతి): ఎంపికచేసిన జడ్పీ హైస్కూళ్ల ప్రాంగణంలో హైస్కూల్‌ ప్లస్‌ పేరిట రెండేళ్ల ఇంటర్మీడియట్‌ విద్యనందిస్తున్నారు. మూడేళ్ల క్రితం వైసీపీ ప్రభు త్వం హడావుడిగా ప్రారంభించిన ప్లస్‌ టూ విద్య క్షేత్రస్థాయిలో దారుణంగా విఫలమైంది. హెచ్‌ ఈసీ, సీఈసీ, బైపీసీ, ఎంపీసీ గ్రూపుల్లో జిల్లాలో మొత్తం 30 హైస్కూల్‌ ప్లస్‌లను ఏర్పాటుచేయ గా నాలుగింటిలో ఒక్క విద్యార్థి కూడా చేరలేదు. ఒకటి రెండు మినహా మిగతా వాటిలో 20 నుంచి 35 మందిలోపే ఉండడం గమనార్హం. తొలిబ్యాచ్‌ ఉత్తీర్ణత అత్యంత స్వల్పంగా నమోదైంది. మండ లానికో జడ్పీ జూనియర్‌ కళాశాలను ఏర్పాటు చేస్తున్నట్టు బిల్డప్‌ ఇచ్చినా మొదటి రెండేళ్ల ఫలి తాలు అతి స్వల్పం. 2022లో ప్రారంభమైన హై స్కూల్‌ ప్లస్‌ నుంచి తొలి బ్యాచ్‌ 2023 పరీక్షల్లో జిల్లాలో 181మంది విద్యార్థులు హాజరుకాగా కేవ లం 17మంది (9.39శాతం) మాత్రమే ఉత్తీర్ణుల య్యారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 323 మంది విద్యార్థులు హాజరుకాగా, కేవలం 103 మంది (31.89శాతం) ఉత్తీర్ణత నమోదైంది. ఈ విద్యాసంవత్సరంలో జిల్లాలో 30 హైస్కూల్‌ ప్లస్‌లలో మొత్తం 708 మంది విద్యార్థులు చదువుతుండగా 503మంది ప్రథమ సంవత్సరం విద్యార్థులు ఇటీవల త్రైమాసి క పరీక్షలకు హాజరుకాగా 123 మంది ఫెయుల్‌ అయ్యారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 205 మంది హాజరుకాగా 30మంది ఫెయిల్‌కావడంతో కొద్దిరోజులక్రితం ఈ పరీక్షల ఫలితాలపై సమీక్ష జరిగింది. సబ్జెక్టు బోదించే పీజీ టీలను (స్కూల్‌ అసిస్టెంట్లు) నియమించినా ఆశించిన ఫలితాలు రాకపోవడం పై కలెక్టర్‌ జిల్లా విద్యాశాఖాధికారులను ప్రశ్నిం చారు. హైస్కూల్‌ ప్లస్‌లను ప్రారంభించడానికి చేసిన హడావుడి సైన్స్‌ విద్యార్థులకు అవసరమైన ల్యాబ్‌లు, లైబ్రరీల ఏర్పాటు చేయలేదు. విద్యార్థు లు సమీపంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల ప్రయోగశాలలను వినియోగించుకుంటున్నట్టు సమాచారం. పాఠ్య పుస్తకాలు సకాలంలో ఇవ్వకపోవడం కూడా ఫలితాల వెనుకబాటుకు మరో కారణంగా చెబుతున్నారు.

ప్రత్యేక కార్యాచరణ

త్రైమాసిక పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను జిల్లావిద్యాశాఖ సిద్ధం చేసింది. ఉదయం 8 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 5గంటల వరకు ప్రత్యేక తరగతులు తీసుకోవాలని పీజీటీలను ఆదేశించింది. చదువులో వెనుకబడిన, స్లో లెర్నర్ల కోసం గ్రూపులుగా విభజించి ప్రత్యేక బోధన చేయాలని సూచించింది. ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రులను తరచూ కలుసుకుంటూ ఇంటి వద్ద హోంవర్క్‌, రోజువారీగా కళాశాలలో ఇచ్చే పాఠ్యాంశాలను మరోసారి అభ్యసించేలా చర్యలు తీసుకోవాలని కోరింది. సంబంధిత విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ ఇవ్వడం, ప్రాక్టీస్‌ టెస్ట్‌లు చేయించడం వంటి చర్యలు తీసుకోవాలని అధికా రులు ఆదేశించారు. త్రైమాసిక పరీక్షల్లో 70శాతం కంటే తక్కువ ఉత్తీర్ణత వచ్చిన హైస్కూల్‌ ప్లస్‌లలో మంచి ఉత్తీర్ణత సాధించేదిశగా కార్యాచ రణ అమలుచేయనున్నారు.

మూసివేత ప్రయత్నాలు వద్దు : శ్రీను, డీపీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు

కనీస అడ్మిషన్లువున్న హైస్కూల్‌ ప్లస్‌ (జడ్పీ జూనియర్‌ కళాశాల)ను కొనసాగించాలని ఆదివారం ఏలూరులో జరిగిన డెమొక్రటిక్‌ పీఆర్టీయూ జిల్లాశాఖ సమావేశంలో రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి.శ్రీను, పి.వెం కటేశ్వరరావు డిమాండ్‌ చేశారు. అర్హతలగల స్కూల్‌ అసిస్టెంట్లకు పీజీటీలుగా పదోన్నతి పొందే ఏకైక అవకాశాలను మూసివేయవద్దని, రానున్న రోజుల్లో హైస్కూల్‌ ప్లస్‌లలో అడ్మిషన్లు పెరిగేలా వాటిని అప్‌గ్రేడ్‌ చేయాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో పేద, బలహీనవర్గాల విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలకు హైస్కూల్‌ ప్లస్‌లు ఉపయోగపడుతు న్నాయన్నారు. గ్రంథాల యం, ప్రయోగశాలలు వంటి సదుపాయాలను కల్పించాలని, ఉద్యోగ నియామకాలను చేపట్టాలని అభ్యర్థించారు. సంఘ నాయకులు ఎం.అచ్యుతరావు, టి.శ్రీను, ఎన్‌.అజాద్‌. కె.శ్రీను, ఆర్‌.వెంకట్‌, ఎన్‌.వీరబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 02 , 2024 | 12:12 AM