‘పది’ పరీక్షలు తెలుగులోనూ రాయొచ్చోచ్!
ABN , Publish Date - Nov 12 , 2024 | 12:38 AM
పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులను వేదిస్తోన్న మాథ్యమం (మీడియం) భయాందోళనలకు ఎట్టకేలకు తెరపడింది. టెన్త్ పరీక్షలకు ఖచ్చితంగా ఆంగ్ల మాథ్యమంలోనే రాయాల్సి ఉంటుందని వైసీపీ ప్రభుత్వం తీసు కున్న నిర్ణయం నేపథ్యంలో ఈ దఫా పరీక్షల్లో ఉత్తీర్ణత తగ్గటం ఖాయమని ఉపాధ్యాయ వర్గా లు, అంతగా పట్టులేని ఇంగ్లీషు మాథ్యమంలో పరీక్ష ఎలా రాయగలమని ఇటు విద్యార్థులు తీవ్ర ఆందోళనలోవున్న విషయం విదితమే.
ఇంగ్లీషు మీడియంలో పరీక్ష ఇక విద్యార్థి అభీష్టానికే
జగన్ ప్రభుత్వ బలవంతపు రుద్దుడు నుంచి ఉపశమనం
ఇప్పటికే పరీక్ష ఫీజు కట్టిన వారికి ఎడిట్ ఆప్షన్
ఏలూరు అర్బన్, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులను వేదిస్తోన్న మాథ్యమం (మీడియం) భయాందోళనలకు ఎట్టకేలకు తెరపడింది. టెన్త్ పరీక్షలకు ఖచ్చితంగా ఆంగ్ల మాథ్యమంలోనే రాయాల్సి ఉంటుందని వైసీపీ ప్రభుత్వం తీసు కున్న నిర్ణయం నేపథ్యంలో ఈ దఫా పరీక్షల్లో ఉత్తీర్ణత తగ్గటం ఖాయమని ఉపాధ్యాయ వర్గా లు, అంతగా పట్టులేని ఇంగ్లీషు మాథ్యమంలో పరీక్ష ఎలా రాయగలమని ఇటు విద్యార్థులు తీవ్ర ఆందోళనలోవున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో అందరికీ ఊరట కలిగించేలా విద్యా శాఖ నిర్ణయం తీసుకుంది. ఇక ఈ నిర్ణయంపై ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడటమే మిగిలిఉంది. ఆ ప్రకారం ఇప్పటికే వచ్చే ఏడాది మార్చిలో జరుగనున్న టెన్త్ పరీక్షలకు ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించేటపుడే విద్యార్థి అభీష్టాన్నిబట్టి ఇంగ్లీషు లేదా తెలుగు మీడియం ఎంచుకునే వెసులు బాటును తాజాగా కల్పించారు. ఈ విషయాన్ని జిల్లా విద్యాశాఖ వర్గాలు ధ్రువీకరించాయి. తాజా వెసులుబాటును బట్టి తెలుగు మీడియంలోనే పరీక్ష రాయదలుచుకున్న విద్యార్థులు ఇక ఎటువంటి ఆందోళనకు గురికా కుండా పరీక్షకు ప్రిపేర్ కావచ్చు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు ఈ దఫా సుమారు 49,500 మంది విద్యార్థులుంటారని అంచనా. ప్రస్తుతం జరుగుతున్న పరీక్ష ఫీజు చెల్లింపుల ప్రక్రియ ముగిస్తే పరీక్షార్దుల సంఖ్య పై స్పష్టత వస్తుంది. ఏలూరు జిల్లాలో సుమారు 23,500 మంది ఉండవచ్చునని తెలిసింది.
త్వరలో ఎడిట్ ఆప్షన్
ఇంగ్లీషు మీడియంలో టెన్త్ పరీక్షలు నిర్వహి స్తే ఉత్తీర్ణత అమాంతం పడిపోవడం ఖాయమని ఉపాధ్యాయ వర్గాలు ఎప్పటి నుంచో మొత్తుకుం టున్నా జగన్ ప్రభుత్వం మొండిగా వ్యవహరి ంచింది. వాస్తవానికి ఇంగ్లీషు మీడియంతో ప్రత్యే కంగా ఏర్పాటు చేసిన ‘సక్సెస్’ ఉన్నత పాఠశా లల్లో మాత్రమే ఇంగ్లీషు మీడియంలో బోధన జరుగుతోంది. ఇటువంటి ‘సక్సెస్’ హైస్కూళ్ళు ఏలూరు జిల్లాలో 25 మాత్ర మే ఉన్నాయని విద్యాశాఖవర్గాలు పేర్కొంటున్నాయి. మిగతా వన్నీ తెలుగు మాథ్యమ ఉన్నత పాఠశాలలే. ఈ విషయాలను పట్టించుకో కుండానే జగన్ ప్రభుత్వం 8, 9, 10 తరగతులకు ఆంగ్ల మాథ్య మాన్ని తప్పని సరిచేస్తూ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా పాఠ్యపుస్తకాలను తెలుగు, ఆంగ్ల మాథ్యమాల్లో పేజీకి ఇరువైపులా ముద్రి ంచి పంపిణీ చేసినందున పరీక్షలు రాయడానికి విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు ఉండబో వని వైసీపీ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలను రుద్దింది. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం విద్యార్థుల సామర్థ్యాలను పరిగణనలోకి తీసుకోవడంతోపాటు, బలవంతం గా విద్యార్థులపై మోపిన ఇంగ్లీషు మీడియం వల్ల జరుగనున్న అనర్దాలను గమనించింది. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది మార్చిలో జరుగనున్న టెన్త్ పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఆంగ్ల మాథ్యమంలోనే ఖచ్చితంగా రాయాలన్న నిబంధనను సడలించి తెలుగు మాథ్యమంలో కూడా పరీక్షలు రాసేందుకు వెసులుబాటు కల్పించింది.
కాగా ఇప్పటికే పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల నుంచి ఫీజును ఆన్‌లైన్ విధానంలో స్వీకరించే ప్రక్రియ జరుగుతున్నందున ఏ మాథ్యమంలో పరీక్ష రాస్తారో విద్యార్థే ఎంచుకునే అవకాశం కల్పించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఆన్‌లైన్ విధానంలో పరీక్ష ఫీజు చెల్లించి, ఇంగ్లీషు మీడియంలో పరీక్ష రాసేందుకు అంగీకారం తెలిపిన విద్యార్థులు సైతం తాము తెలుగు మాథ్యమంలో పరీక్ష రాయదలుచుకుంటే ఆ మార్పును తెలియజే సేందుకు ఎడిట్ ఆప్షన్‌ను కొద్ది రోజుల్లో ఇవ్వను న్నారు. మరోవైపు ఫీజు చెల్లించిన విద్యార్థుల డేటాను నామినల్ రోల్స్ (ఎన్‌ఆర్) రూపంలో సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు జిల్లా విద్యా శాఖ ద్వారా ప్రభుత్వానికి అందజేసే గడువు ఇంకా ముగియనందున, ఆ లోగా ఇంగ్లీషు మీడియంను ఎంచుకుని ఇపుడు తెలు గు మాథ్యమానికి ఆప్షన్ ఇచ్చుకునేందుకు విద్యా ర్థులకు వెసులు బాటుతోపాటు, ఎన్‌ఆర్ లలో నమోదుకు అవకాశం ఉందని డీఈవో కార్యాల య వర్గాలు వెల్లడించాయి. ఇదే విషయాన్ని ఉపాధ్యాయులకు సూచిస్తున్నట్టు అధికార వర్గాలు వివరించాయి. కాగా ఇంగ్లీషు స్థానే తెలుగు మాథ్యమంలో పరీక్షరాసేందుకు వెసులు బాటు కల్పిస్తూ సంబందింత అధికారిక ఉత్తర్వులు ఇంతవరకు లేవు.