Share News

సూత్రధారి ఇతనేనని.. ఆచూకీ కోసం..

ABN , Publish Date - Dec 22 , 2024 | 12:45 AM

యండగండిలో సంచలనం సృష్టించిన ‘పార్శిల్‌లో మృతదేహం డోర్‌ డెలివరీ’ కేసులో ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్నలు డెడ్‌ బాడీ ఎవరిది ? ఎందుకు పార్శిల్‌ రూపంలో సాగి తులసికి పంపించారు ?

సూత్రధారి ఇతనేనని.. ఆచూకీ కోసం..
Mystery Parcel Courier

  • యండగండిలో టెన్షన్‌ టెన్షన్‌

  • తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన మృతదేహం డోర్‌ డెలివరీ కేసు

  • ఆస్తుల కోసం కుటుంబంలో తగాదా.. వదినను భయపెట్టేందుకే మరిది యత్నం !

  • సూత్రధారి ఇతనేనని.. ఆచూకీ కోసం గాలిస్తున్న పోలీసు ప్రత్యేక బృందాలు

ఉండి/భీమవరం క్రైం, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): యండగండిలో సంచలనం సృష్టించిన ‘పార్శిల్‌లో మృతదేహం డోర్‌ డెలివరీ’ కేసులో ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్నలు డెడ్‌ బాడీ ఎవరిది ? ఎందుకు పార్శిల్‌ రూపంలో సాగి తులసికి పంపించారు ? ఈ కేసులో కీలక సూత్రధారి ఎవరు ? అని. వీటిని ఛేదించేందుకు పోలీసులు సీరియస్‌గా దృష్టి పెట్టారు. రెండు రోజుల్లో కేసులోని నిజాలను వెలికితీసి వెల్లడిస్తామని ఎస్పీ నయీం అస్మి చెప్పారు. ఈ క్రమంలోనే విస్తుపోయే నిజాలు వున్నట్టు చెబుతున్నారు. ఒంటరిగా వుంటున్న ముదు నూరి రంగరాజు పెద్ద కుమార్తె సాగి తులసికి పంపించిన మృతదేహం ఎవరిది ? ఒక అనామకుడిది కావాలనే పార్శిల్‌ చేసి పంపించినట్లు ప్రచారం జరుగుతోంది. ఆమెను బెదిరించి ఆస్తి మొత్తం ఎలాగైనా కాజేయాలనే పన్నాగం పన్నాడా ? అలా అయితే మృతదేహం వస్తే పోలీసులకు దొరికిపోయే అవకాశం ఉందని తెలిసినా ఎందుకిలా చేశాడు ? ఆటోలో మృతదేహం పార్శిల్‌కు అప్పగించిన ఆ మహిళ ఎవరనేది తెలిస్తే వివరాలు వెల్లడవుతాయి. ఆమె సాగిపాడు వద్ద స్ర్కాప్‌ కట్టు కుని ఆటో డ్రెవర్‌కు ఫోన్‌ చేసి రప్పించి యండగండి పంపిం చింది. ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆటో డ్రైవర్‌ పిప్పరకు చెందిన వ్యక్తిగా చెబుతున్నారు.


ఆస్తి వివాదం

రంగరాజుకు చెందిన మూడు ఎకరాల పొలం విషయం లోనే ఇద్దరు అక్కాచెల్లెళ్ళు తగాదా పడుతున్నట్లు సమాచారం. మృతదేహం డెలివరీ చేసిన తర్వాత చిన్నకుమార్తె రేవతి, ఆమె భర్త సిద్ధార్ధవర్మ (సుధీర్‌) కనిపించడం లేదు. పార్శిల్‌ బుధవారమే వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. బాక్సులో నుంచి దుర్వాసన వస్తోందని, త్వరగా రావాలని గరగపర్రులో వుంటున్న తులసికి చెప్పినట్లు తెలిపారు. అయితే ఈ పార్సిల్‌ బాడీ వచ్చిన తరువాత విప్పింది అతనేని అంటున్నారు. దీనిని చూసిన తులసి భయభ్రాంతులకు గురైనట్లు సమాచారం. ఆ తర్వాతే అక్కడ నుంచి సిద్ధార్థ వర్మ పరారైనట్లు చెబుతు న్నారు. అతనిని హైదరాబాద్‌లో అరెస్ట్‌ చేసినట్లు సమాచారం. ఇతను మొత్తం మూడు పెళ్లిళ్లు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. రేవతి రెండో భార్య అని చెబుతున్నారు.


నాలుగు బృందాలు గాలింపు

తులసి తల్లిదండ్రులు రంగరాజు, హైమావతి, చిన్నకుమార్తె రేవతిలను ఉండి స్టేషన్‌ నుంచి ఆకివీడు తరలించారు. ఒక్కొ క్కరిని విచారిస్తున్నారు. హైమావతి ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఆర్‌ నెం.252–24 యు–ఎస్‌ 194 బిఎన్‌ఎస్‌ఎస్‌ సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు.నిందితుల కోసం 4 బృందాలు గాలిస్తున్నాయి.

Updated Date - Dec 23 , 2024 | 12:01 PM