అన్నదాతా సుఖీభవ
ABN , Publish Date - Dec 28 , 2024 | 01:25 AM
వ్యవసాయానికి జవసత్వాలు వచ్చాయి. కూటమి ప్రభుత్వం రాకతో రైతుల్లో ఆనందం వెల్లి విరుస్తోంది. గత ఐదేళ్ల నుంచి పడ్డ కష్టాలకు కూటమి ప్రభుత్వం రాకతో విముక్తి లభించింది.
రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కంకణం
ఈ ఏడాది మొదటి ఆరునెలలు కష్టాల కడలిలో రైతులు
రైతుల సంక్షేమం పట్టని వైసీపీ ప్రభుత్వం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ధాన్యం బకాయిలు చెల్లింపు
రైతులను ఇబ్బంది పెట్టిన వర్షాలు.. వరదలు
జ్ఞాపకాలు 2024
వ్యవసాయానికి జవసత్వాలు వచ్చాయి. కూటమి ప్రభుత్వం రాకతో రైతుల్లో ఆనందం వెల్లి విరుస్తోంది. గత ఐదేళ్ల నుంచి పడ్డ కష్టాలకు కూటమి ప్రభుత్వం రాకతో విముక్తి లభించింది. ఆరుగాలం శ్రమించినా గత ప్రభుత్వ హయాంలో ఎటువంటి ఫలితం లభించలేదు. కొందరు రైతులయితే వ్యవ సాయం గిట్టుబాటు కాక వేరే రంగాలకు వలస వెళ్లిపోయారు. ఈ ఏడాది ప్రకృతి కూడా రైతన్నతో దోబూచులాడింది. రైతన్నలు ఎదుర్కొన్న ఒడిదుడుకులను ఓసారి మననం చేసుకుందాం.
ఏలూరు సిటీ, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి) : వ్యవ సాయానికి వైసీపీ ప్రభుత్వం అంతంత మాత్రమే ప్రాధా న్యత ఇవ్వడం, వ్యవసాయంలో కొత్త విధానాలు తీసు కొచ్చినా రైతు లాభపడేలా వ్యవహరించక పోవడంతో రైతులు ఆర్థిక నష్టాల ఊబిలో కూరుకుపోయారు. ఆర్ బీకేల వ్యవస్థను ఏర్పాటు చేసినా అనుకున్న లక్ష్యాలను సాధించలేదు. ఎరువులు ఇంటి చెంతకే వస్తాయని చెప్పి నా అదీ చేయలేకపోయారు. ధాన్యం కొనుగోలు విష యంలో గతేడాది రైతులు పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ధాన్యం కొనుగోలులో తేమ శాతం నిబంధన పేరిట రైతులకు చెల్లించే సొమ్ముల్లో కోత విధించడంతో రైతులు పూర్తిగా నష్టపోయారు. దగ్గరలో ఉన్న రైస్ మిల్లులకు ధాన్యాన్ని తరలించకుండా సుదూర ప్రాంతా లకు ధాన్యాన్ని తరలించడంతో రైతులకు రవాణా ఖర్చు లు అధికమయ్యి ఇబ్బందులు పడ్డారు. ఽధాన్యం అమ్మిన 48 గంటల్లో సొమ్ములు రైతులు బ్యాంకు ఖాతాల్లో జమ చేయాల్సి ఉండగా అది అమలు కాలేదు. ధాన్యం కొను గోలులో గోనెసంచులు సకాలంలో అందించకపోవడం, అదీగాక చినిగిన సంచులు ఇవ్వడంతో తీవ్రంగా నష్టపో వాల్సి వచ్చింది. ఈ లోగా ఎన్నికలు రావడంతో రైతులు బకాయిలు కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. కూటమి ప్రభుత్వం అఽధికారంలోకి రాగానే ధాన్యం బకాయిలను రైతులకు చెల్లించారు.
సబ్సిడీల ఊసేలేదు
వ్యవసాయానికి గత ప్రభుత్వం అంతంత మాత్రం గానే ప్రాధాన్యం ఇచ్చింది. డ్రిప్ ఇరిగేషన్ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది. వ్యవసాయ సబ్సిడీలను పూర్తిగా ఎత్తివేసింది. పండ్ల తోటలకు రాయితీలు లేక ప్రోత్సాహం కరువైంది. ఎరువుల ధరలు విపరీతంగా పెరిగాయి. గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక కౌలు రైతులకు అంతంత మాత్రం గానే గత ప్రభుత్వం ప్రోత్సాహాన్ని ఇచ్చింది. జిల్లాలో 3.50 లక్షల మంది రైతులు ఉన్నారు. ఇందులో అధిక శాతం కౌలు రైతులో వాస్తవ సాగు దారులుగా ఉన్నారు. సకాలంలో రుణాలు అందక కౌలు రైతు లకు సీసీఆర్‌సీ కార్డులు రాక ఎన్నో ఇబ్బందులు ప డుతూ వ్యవసాయం చేశారు. రబీలో ఏ పంటకు ప్రోత్సాహం లేక అన్ని పంటల పరి స్థితి ఒకే రకంగా తయారైంది. దీనికి తోడు ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు పంటల ను నష్టపోవాల్సి వచ్చింది. ఉద్యాన పంట లదీ అదే పరిస్థితి. రైతు భరోసా విష యంలో, ఇన్‌పుట్ సబ్సిడీ విషయంలో, పంట నష్టపరిహారం విషయాల్లోను రైతులకు పూర్తి స్థాయిలో నిఽధులు కేటాయించపోవడంతో రైతులు పడిన ఇబ్బందులు వర్ణనాతీతం.
కూటమి ప్రభుత్వం రాకతో జోష్
జూన్ వరకు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా జూలై మాసం నుంచి కూటమి ప్రభు త్వం అధికారంలోకి వచ్చింది. అధికారం లోకి వచ్చీ రాగానే రైతులకు ఎంతో ప్రా ధాన్యత ఇచ్చి పలు సంక్షేమ కార్య క్రమాలను అమలు చేస్తోంది. వరి తో పాటు అన్ని పంటలకు, ఉద్యాన పంటలకు చేయూత ఇచ్చేలా ప్రభుత్వం చర్య లు తీసుకుంటోంది. గత ప్రభుత్వ హయాంలో పేరుకు పోయిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధిం చిన రూ. 472 కోట్ల ధాన్యం బకాయిలను చెల్లించింది. ఇందులో ఏలూరు జిల్లాకు సంబంధించి రూ. 48 కోట్లు బకాయిలు రైతులకు చెల్లించింది. పీఎం కిసాన్ నిధులు జిల్లాకు సంబంధించి 98,945 మంది రైతులకు గత అక్టోబరు మొదటి వారంలో రూ.19.78 కోట్లు నిధులు విడుదల చేశారు. ఈ ఏడాది ఖరీఫ్ ధాన్యం కొనుగోలు లో రైతులు తమ ధాన్యాన్ని తాము ఎంపిక చేసుకున్న దగ్గరలోని రైస్ మిల్లుకు తరలించే ఏర్పాట్లు చేసింది. ప్రకృతి వైపరీత్యాలు వచ్చిన సమయంలో రైతులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం విస్తృత చర్యలు చేపట్టిం ది. ఇందులో భాగంగానే 2024, సెప్టెంబరులో కురిసిన అధిక వర్షాలకు దెబ్బతిన్న వరి, మొక్కజొన్న, మినుము, పత్తి, వేరుశనగ పంటలకు పంట నష్టం నమోదు చేసి వారం రోజుల్లోనే 1259 మంది రైతులకు రూ.2.04 కోట్లు నష్టపరిహారాన్ని రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేసింది.