AP Politics: వైసీపీ ఎంపీ బాలిశౌరి జనసేనలో చేరుతున్న వేళ పేర్ని నాని చీప్ పాలిటిక్స్.. అర్ధరాత్రి వేళ..
ABN , Publish Date - Feb 04 , 2024 | 01:11 PM
మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలిశౌరి నేడు (ఆదివారం) జనసేనలో చేరనున్న వేళ వైసీపీ సీనియర్ లీడర్, మాజీ మంత్రి పేర్ని నాని ‘చీప్ పాలిటిక్స్’ ప్రదర్శించారు. అధికారులపై ఒత్తిడి చేసి మచిలీపట్నం భాస్కరపురంలో అర్ధరాత్రి వేళ జనసేన జెండా దిమ్మను కూల్చివేయించారు. శనివారం అర్ధరాత్రి సమయంలో టౌన్ ప్లానింగ్ అధికారులు దిమ్మెను కూల్చివేయడంపై జనసేన శ్రేణులు భగ్గుమంటున్నాయి.
మచిలీపట్నం: మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలిశౌరి నేడు (ఆదివారం) జనసేనలో చేరనున్న వేళ వైసీపీ సీనియర్ లీడర్, మాజీ మంత్రి పేర్ని నాని ‘చీప్ పాలిటిక్స్’ ప్రదర్శించారు. అధికారులపై ఒత్తిడి చేసి మచిలీపట్నం భాస్కరపురంలో అర్ధరాత్రి వేళ జనసేన జెండా దిమ్మను కూల్చివేయించారు. శనివారం అర్ధరాత్రి సమయంలో టౌన్ ప్లానింగ్ అధికారులు దిమ్మెను కూల్చివేయడంపై జనసేన శ్రేణులు భగ్గుమంటున్నాయి. రాజకీయ విరోధిగా బాలశౌరి జనసేనలో చేరుతుండడంతో పేర్ని నాని ఈ విధంగా వ్యవహరించామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా బాలశౌరి జనసేనలో చేరిక సందర్భంగా నేతలు, జనసైనికులు మచిలీపట్నంలో భారీ ర్యాలీకి సన్నాహాలు చేస్తున్నారు. మచిలీపట్నం నుంచి మంగళగిరి వరకు వందల కార్లు, బైక్‌లతో భారీ ర్యాలీకి సిద్ధమయ్యారు.
అయితే జెండా దిమ్మను కూల్చివేత ద్వారా జనసైనికుల దృష్టిని మరల్చే ప్రయత్నం చేశారంటూ పేర్ని నాని యత్నించారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా జెండా దిమ్మ కూల్చివేత ఘటనపై జనసేన నాయకులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పేర్ని నాని ‘చీప్ పాలిటిక్స్’పై జనసేన నేతలు, జనసైనికులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా కూల్చివేసిన చోట జెండా దిమ్మను కడతామని జనసేన మచిలీపట్నం నియోజకవర్గ ఇంచార్జ్ బండి రామకృష్ణ అన్నారు. 50 డివిజన్లలోనూ సొంత డబ్బులతో జెండా దిమ్మలను కడతానని అన్నారు. పార్టీలో బాలశౌరి చేరిక కార్యక్రమానికి వేలాదిగా తరలి వెళ్లి పేర్ని నాని కుట్రలను తిప్పికొట్టాలని బండి రామకృష్ణ పిలుపునిచ్చారు.