AP News: బియ్యం మాఫియాకు జగన్ సపోర్ట్ చట్టవిరుద్ధం
ABN , Publish Date - Dec 12 , 2024 | 07:51 PM
వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన మాఫియాపై తెలుగుదేశం సీనియర్ నేత విమర్శలు గుప్పించారు. జగన్ కు ఈ అక్రమాల్లో వాటా ఉంది కాబట్టే ఆయన ఈ మాఫియాకు సపోర్ట్ గా తన గళం విప్పుతున్నారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన ఒక్కో హామీని నెరవేర్చడంపై దృష్టిపెట్టిందన్నారు.
అమరావతి: బియ్యం మాఫియాపై ఏపీ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన చట్టవిరుద్ధమంటూ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. బియ్యం మాఫియా వెనుక జగన్ హస్తం ఉన్నందువల్లే ఈ అక్రమాలను ఆయన సమర్థిస్తున్నారన్నారు.
‘‘బియ్యం మాఫీయా వెనుక జగన్ హస్తం ఉన్నందునే అక్రమాలను సమర్ధిస్తున్నాడు. బియ్యం స్మగ్లింగ్ ను సమర్ధిస్తున్నట్లుగా జగన్ చేసిన ప్రకటన చట్ట విరుద్ధం. బియ్యం మాఫియా స్మగ్లింగ్ చేసే వారిపై పిడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయటంతో పాటు, ఆ మాఫియా వెనుక ఉందెవ్వరో ప్రజలకు తెలియాలి. కూటమి ప్రభుత్వం ఫిరాయింపు రాజకీయాలకు పాల్పడుతోందని జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రకటన నిరాధారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మేనిఫెస్టో లక్ష్యాలను అమలు చేయడం ద్వారా ఫలితాలను చూపడం ప్రారంభించింది. పేదరికం లేని రాష్ట్రంగా అభివృద్ధి చేసేందుకు సాఫీ రహదారిని రూపొందించింది’’ అని యనమల అన్నారు.