Vangalapudi Anitha: రంగంలోకి వంగలపూడి రెష్మిత..!
ABN , Publish Date - Apr 02 , 2024 | 01:55 PM
ఎన్నికల వేళ అభ్యర్థులు.. తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అయితే అభ్యర్థుల కుటుంబ సభ్యులు సైతం ప్రజల మధ్యకు వెళ్లి ప్రచారం చేస్తున్నారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా వంగలపూడి అనిత ఎన్నికల బరిలో నిలిచారు.
విశాఖపట్నం, ఏప్రిల్ 2: ఎన్నికల వేళ అభ్యర్థులు.. తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అయితే అభ్యర్థుల కుటుంబ సభ్యులు సైతం ప్రజల మధ్యకు వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట అసెంబ్లీ స్థానం (Payakaraopeta assembly constituency) నుంచి టీడీపీ అభ్యర్థిగా వంగలపూడి అనిత (Vangalapudi Anitha)ఎన్నికల బరిలో నిలిచారు. దీంతో ఆమె ఎన్నికల ప్రచారం చేపట్టారు. మరోవైపు వంగలపూడి అనితకు మద్దతుగా.. ఆమె కుమార్తె వంగలపూడి రెష్మిత (Vangalapudi Reshmitha) సైతం రంగం దిగారు. తల్లి కోసం నియోజకవర్గంలో అన్ని మండలాల్లో రెష్మిత ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో తన తల్లి వంగలపూడి అనితను గెలిపించాలని ఈ సందర్భంగా ఆమె ప్రజలకు విజ్జప్తి చేస్తున్నారు.
గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి.. ప్రజలకు అందిన సంక్షేమ పథకాలు.. అలాగే ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో చోటు చేసుకున్న అభివృద్ధి.. అందిన సంక్షేమ పధకాల గురించి ఆలోచించాలని ఈ సందర్భంగా ప్రజలు వంగలపూడి రెష్మిత సూచిస్తున్నారు. అయితే తల్లికి మద్దతుగా రెష్మిత ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న తీరు పట్ల స్థానిక టీడీపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ప్రజలను ఆమె పలకరించడంతోపాటు వారితో రెష్మిత మమేకమవుతున్న తీరు పట్ల.. స్థానిక టీడీపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో కలిసి టీడీపీ కూటమిగా వెళ్లుతోంది. అందులోభాగంగా పాయకరావు పేట అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా వంగలపూడి అనిత బరిలో నిలిచారు.
ఇక 2014లో పాయకరావుపేట ఎమ్మెల్యేగా వంగలపూడి అనిత గెలుపొందారు. అయితే 2019 ఎన్నికల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా బరి నిలిచి.. తన సమీప ప్రత్యర్థి, వైసీపీ నాయకురాలు తానేటి వనిత చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే ముఖ్యమంత్రి వైయస్ జగన్ వ్యవహారశైలి పట్లే కాదు.. ఈ ప్రభుత్వంలో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలపై వంగలపూడి అనిత ప్రెస్‌మీట్ పెట్టి అధికార పార్టీని ప్రశ్నించడంలో ముందుటారన్నది సుస్పష్టం.
మరిన్నీ ఏపీ వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి
YS Sunitha: షర్మిలపై ఇంట్రెస్టింగ్.. జగన్‌పై షాకింగ్ కామెంట్స్
AP Schools: స్కూళ్లకు సెలవులు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం