Share News

YS Bharathi: జగన్ కోసం భారతీ..!

ABN , Publish Date - Apr 13 , 2024 | 03:35 PM

కడప జిల్లా అంటే వైయస్ ఫ్యామిలీ.. వైయస్ ఫ్యామిలీ అంటే కడప జిల్లా. అలాంటి జిల్లాలో రాజకీయం ప్రస్తుతం కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పటికే పీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల.. కడప ఎంపీగా బరిలో దిగారు. దీంతో ప్రచారంలో ఆమె బాణంలా దూసుకు పోతున్నారు.

YS Bharathi: జగన్ కోసం భారతీ..!
YS Bharathi

కడప జిల్లా (cuddapah district) అంటే వైయస్ ఫ్యామిలీ (YS Family).. వైయస్ ఫ్యామిలీ అంటే కడప జిల్లా. అలాంటి జిల్లాలో రాజకీయం ప్రస్తుతం కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పటికే పీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల ( YS Sharmila).. కడప ఎంపీగా బరిలో దిగారు. దీంతో ప్రచారంలో ఆమె బాణంలా దూసుకు పోతున్నారు.

Bournvita: బోర్న్‌విటా ‘హెల్త్ డ్రింక్ కాదు’.. కేంద్రం సంచలన ఆదేశాలు

మరోవైపు ఏప్రిల్ 22వ తేదీన వైసీపీ అధినేత వైయస్ జగన్ (YS Jagan).. పులివెందుల (pulivendula) అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆ క్రమంలో ఆయన భార్య వైయస్ భారతీ (YS Bharathi) సైతం భర్తకు మద్దతుగా ఇంటి ఇంటికి ప్రచారం నిర్వహించనున్నారని సమాచారం. అయితే గత ఎన్నికల వేళ జరిగిన ప్రచారానికి.. ప్రస్తుతం జరుగనున్న ఎన్నికల ప్రచారంతో కడప రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారిపోయినట్లు అవుతోంది.

Arvind Kejriwal: కేజ్రీవాల్ పిటిషన్‌పై 15న సుప్రీంకోర్టులో విచారణ

అంటే గత ఎన్నికల వేళ వైయస్ ఫ్యామిలీలోని వారంతా ఒక తాటిపైకి వచ్చారు. వైయస్ జగన్ గెలుపు కోసం వారంత ప్రచారం చేశారు. కానీ నేడు కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో దిగిన వైయస్ షర్మిల.. తన గెలుపు కోసం ఆమె స్వయంగా ప్రచారం చేసుకొంటున్నారు.

ఇక వైయస్ జగన్.. తన గెలుపు కోసం ఆయనే ప్రచారం చేసుకొనే పరిస్థితి. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే వైయస్ జగన్ కోసం ఆయన భార్య వైయస్ భారతీ ప్రచారం నిర్వహించనున్నారనే ఓ ప్రచారం అయితే జిల్లాలో జోరందుకొంది.

ఓ వేళ వైయస్ భారతీ.. తన భర్త గెలుపు కోసం ప్రజల మధ్యకు వెళ్లి ప్రచారం చేస్తే.. ఆమె ప్రచారాన్ని ప్రజలు ఎలా తీసుకుంటారనే ఓ చర్చ సైతం జిల్లాలో నడుస్తోంది. ఎందుకంటే వైయస్ వివేకా మరణించారనే వార్తా.. తన భర్త వైయస్ జగన్‌కు తొలుత ఆమే స్వయంగా ఫోన్ చేసి సమాచారం ఇచ్చారంటూ ఇప్పటికే పలు కథనాలు అయితే వైరల్ అయినాయి.

అలాంటి పరిస్థితుల్లో తన భర్త గెలుపు కోసం వైయస్ భారతీ ప్రచారం చేస్తే.. దానిని ప్రజలు ఎలా స్వీకరిస్తారోననే ఓ సందేహం సైతం జిల్లాలో వ్యక్తమవుతోంది.


మరోవైపు తన సొంత చిన్నాన్న వైయస్ వివేకా హత్యతో కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి హస్తం ఉంది. అతడికి ఓటు వేయవద్దంటూ ఎన్నికల ప్రచారంలో నేరుగా ప్రజలకు వైయస్ షర్మిల వివరిస్తోంది. ఇదే ప్రచారంలో వైయస్ వివేకా కుమార్తె సునీత నర్రెడ్డి సైతం పాల్గొని తన తండ్రిని హత్య చేసిన వారికి ఓట్లు వేయ్య వద్దంటూ.. స్పష్టం చేస్తోంది. దీంతో ప్రజలు ఓ విధమైన కన్ఫ్యూజన్‌లోకి వెళ్లిపోతున్నారని సమాచారం.

Bhuvaneswari: ముగిసిన భువనేశ్వరి ‘‘నిజం గెలవాలి’’ పర్యటన.. చివరగా ఎవరిని కలిశారంటే?

అలాంటి వేళ ప్రజల్లోకి వెళ్లి వైయస్ భారతీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే.. వారి నుంచి వచ్చే స్పందన ఎలా ఉంటుందనే ఓ చర్చ సైతం సాగుతోంది. అదీకాక ఈ ఎన్నికల్లో వైయస్ జగన్‌కు మద్దతుగా వైయస్ ఫ్యామిలీ నుంచి ప్రచారం నిర్వహించే వారు ఒక్కరంటే ఒక్కరు కూడా కనిపించడం లేదు. దాంతో జగన్‌కి మద్దతుగా వైయస్ భారతీ ఒక్కరే ప్రచారం చేయనున్నారనే ఓ ప్రచారం అయితే జరుగుతోంది.


ఇంకోవైపు కన్న తల్లి వైయస్ విజయమ్మను జగన్‌కు మద్దతుగా ఎన్నిక ప్రచారానికి తీసుకు వద్దామా? అంటే కుమారుడి కోసం ప్రచారం చేస్తే.. కుమార్తెకు నష్టం వాటిల్లుతోంది. అదే కుమార్తె కోసం ప్రచారం చేస్తే కుమారుడు నష్ట పోతాడని ఆలోచించి.. మధ్యే మార్గంగా యూఎస్‌లోని వైయస్ షర్మిల కుమారుడు వైయస్ రాజారెడ్డి వద్దకు వైయస్ విజయమ్మ వెళ్లిపోయినట్లు సమాచారం.

ఈ ఎన్నికల క్రతువు పూర్తైన తర్వాత ఆమె హైదరాబాద్‌ తిరిగి వస్తారనే ప్రచారం సాగుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో వైయస్ జగన్ కోసం భారతీ.. అదీ సొంత ఇలాకా... కడప జిల్లా పులివెందుల్లో ఎన్నికల ప్రచారం చేస్తే.. వైయస్ జగన్‌కు ఓట్లు పడతాయా? అని సందేహం సర్వత్రా వ్యక్తమవుతోంది.

జగన్‌కు బిగ్ షాక్ ఇచ్చిన ఎమ్మెల్యే.. నేరుగా ఆమె వద్దకు వెళ్లి..

రాష్ట్రంలో వైసీపీ గెలుపు దేవుడెరుగు. పులివెందుల్లో మాత్రం ఎన్నికల పలితం ఏమాత్రం కాస్తా అటు ఇటు అయినా.. ఆ తర్వాత పరిస్థితులు దారుణాతి దారుణంగా ఉంటాయని ఓ చర్చ సైతం జిల్లాలో సాగుతోంది.

మరోవైపు గత ఎన్నికల వేళ వైయస్ జగన్ గెలుపు కోసం వైయస్ భారతీ ఒంటరిగా ప్రచారం చేసిన దాఖలాలు అయితే లేవు. వైయస్ షర్మిల, వైయస్ విజయమ్మతో కలిసే ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారనే ఓ ప్రచారం నడుస్తోంది.


మరి ఈ ఎన్నికల వేళ వైయస్ భారతీ ఒంటరిగా అంటే.. తన కుటుంబ సభ్యులు ఎవరు లేకుండా భర్త గెలుపు కోసం ఆమె ప్రచారం చేస్తారా? అనే సందేహం సైతం రాజకీయ వర్గల్లో నడుస్తోంది.

Nara Lokesh: విశాఖ వైసీపీ నేతలపై లోకేశ్ ఫైర్

ఇక వైయస్ వివేకానందరెడ్డి దారుణ హత్య అంశం..జగన్ పార్టీని తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. అలాంటి వేళ వైయస్ భారతీ ఎన్నికల ప్రచారానికి వెళ్లితే.. ప్రజల నుంచి.. అదీ జిల్లా ప్రజల నుంచి వచ్చే స్పందన ఎలా ఉంటుందని సర్వత్ర ఆసక్తిగా అయితే వ్యక్తమవుతుంది.

ఆంధ్రపద్రేశ్ వార్తలు కోసం..

Updated Date - Apr 13 , 2024 | 03:37 PM