Share News

YS Sharmila: దమ్ముంటే అసెంబ్లీకి వెళ్లు.. జగన్‌కు ఇచ్చిపడేసిన షర్మిల..

ABN , Publish Date - Nov 14 , 2024 | 10:19 AM

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ బడ్జెట్‌పై చేసిన కామెంట్స్‌కు APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇప్పటికీ అసెంబ్లీకి వెళ్ళే దమ్ము లేకుంటే రాజీనామాలు చేసి ఎన్నికలకు వెళ్ళాలని సవాల్ విసిరారు.

YS Sharmila: దమ్ముంటే అసెంబ్లీకి వెళ్లు.. జగన్‌కు ఇచ్చిపడేసిన షర్మిల..
Sharmila

అమరావతి: ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుంది వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరు అని APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి కౌంటర్ వేశారు. బడ్జెట్ బాగోలేదని, రాష్ట్ర ప్రజలకు ఉపయోగం కానీ బడ్జెట్ అని కాంగ్రెస్ పార్టీ, వైసీపీ కంటే ముందుగా ప్రెస్‌మీట్ పెట్టి చెప్పిందని.. తాము చెప్పిందే జగన్ మళ్లీ ప్రెస్‌మీట్ పెట్టి చెప్పాడన్నారు.

ఇన్ సిగ్నిఫికెంట్ పార్టీ..

జగన్ పార్టీకి 38 శాతం ఓట్లు వచ్చినా.. అసెంబ్లీకి వెళ్ళనప్పుడు, వైసీపీకి కాంగ్రెస్ పార్టీకి పెద్ద తేడా ఏం లేదన్నారు. 38 శాతం ఓట్ షేర్ పెట్టుకొని అసెంబ్లీకి పోనీ వైసీపీని నిజానికి ఒక "ఇన్ సిగ్నిఫికెంట్"పార్టీగా మార్చింది జగనేనని షర్మిల విమర్శలు గుప్పించారు. అసెంబ్లీలో అడుగు పెట్టలేని, ప్రజా సమస్యల కోసం సభల్లో పట్టుబట్టలేని, పాలకపక్షాన్ని అసెంబ్లీ వేదికగా ప్రశ్నించలేని, అసమర్థ వైసీపీ ఇవ్వాళ రాష్ట్రంలో అసలైన "ఇన్ సిగ్నిఫికెంట్ పార్టీ" అని పేర్కొన్నారు.

రాజీనామా చేయండి..

ప్రజలు వైసీపీకి ఓట్లు వేసింది ఇంట్లో కూర్చోవడానికి కాదని.. సొంత మైకుల ముందు కాకుండా..అసెంబ్లీ మైకుల ముందు మాట్లాడాలన్నారు. మీకు చిత్తశుద్ది ఉంటే.. నిండు సభలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై సభ దద్దరిల్లేలా చేయండి అని సూచించారు. ప్రతిపక్షం కాకపోయినా..11 మంది ప్రజాపక్షం అనిపించుకోండన్నారు. ఇప్పటికీ అసెంబ్లీకి వెళ్ళే దమ్ము లేకుంటే రాజీనామాలు చేసి.. ఎన్నికలకు వెళ్ళాలని సవాల్ విసిరారు. అప్పుడు ఎవరు ఇన్ సిగ్నిఫికెంట్.. ఎవరు ఇంపార్టెంట్ తేలుతుంది అని కామెంట్స్ చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేయాలని లేదా దమ్ముంటే అసెంబ్లీకి వెళ్లి బడ్జెట్‌పై చర్చించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలకు నిధుల కేటాయింపుపై నిలదీయాలన్నారు.

Updated Date - Nov 14 , 2024 | 10:22 AM