Share News

YS sharmila Reddy: ఆ మీమ్స్ జగన్ చూడరా.. ‘పర్సనల్’ వ్యాఖ్యలపై షర్మిల కౌంటర్

ABN , Publish Date - Dec 04 , 2024 | 03:26 PM

అవినీతిలో నా పేరు ఎక్కడైనా ఉందా అని జగన్మోహన్ రెడ్డి తెలివిగా మాట్లాడుతున్నారు. 2021 లో అప్పటి సిఎం అంటే జగన్ కాక ఎవరొస్తారు అని వైఎస్ షర్మిల కౌంటర్ అటాక్ చేశారు...

YS sharmila Reddy: ఆ మీమ్స్ జగన్ చూడరా.. ‘పర్సనల్’ వ్యాఖ్యలపై షర్మిల కౌంటర్
YS Jaganmohan Reddy, YS sharmila

విజయవాడ: పచ్చకామెర్లు ఉన్నవాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందన్న చందంగా వైసీపీ వాళ్ల ప్రవర్తన ఉందంటూ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. ప్రజల సొమ్ముతో జల్సాలు చేసుకున్నారని గత పాలకులపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో రాహుల్, ప్రియాంక గాంధీలను బీజేపీ ప్రభుత్వం అడ్డుకోవడంపైనా ఆమె విరుచుకుపడ్డారు.


సీ వ్యూ కావాలా నాయనా..

నాపై చేసినట్టుగా నేను కూడా నిజంగా వ్యక్తిగత దూషణలకు దిగితే మీరు తట్టుకోలేరు. రిషికొండను గొరిగేశారు.... బాత్రూమ్ నుంచి మీకు సి వ్యూ కావాలా.. ప్రజల సొమ్ముతో మీరు సోకులు చేసుకుంటారా.. మద్యపాన నిషేధం అన్నారు.. మద్యం పేరుతో దోపిడీ చేశారు. జలయజ్ఞం పేరుతో దోపిడీ చేసి వైఎస్ ఆశయాలను నీరు‌గార్చారు. ఫీజు రీయంబర్స్‌మెంట్ ఎగ్గొట్టారు. గంగవరం పోర్ట్‌ను అదానీకి 600 కే ఇచ్చారు. వివేకానంద రెడ్డి ప్రజల మనిషి కాదా.. ఆ గొప్ప నాయకుడిని హత్య చేసింది ఎవరు?.. సిబీఐ ఛార్జిషీట్‌లో అవినాష్ రెడ్టి పేరు పెట్టారు.. అయినా జగన్ పక్కన పెట్టుకున్నాడు. నా మీద సోషల్ మీడియా‌లో నీచంగా పోస్టులు పెడితే అడ్డుకోలేదు. ఇటువంటి అంశాలను మాట్లాడితే మీరు పర్సనల్ అంటారా. ‘‘నా చిన్నాయన‌ను నేను చంపుకుంటా... నా తల్లి, నా చెల్లిని గెంటేస్తా..’’ అని మీమ్స్ కూడా వస్తున్నాయి. నేను ఎవరి మీద పర్సనల్‌గా మాట్లాడటం లేదన్నారు.


నన్నెలా ప్రశ్నిస్తారు..

జగన్, చంద్రబాబు పాలనలో అవినీతి మీద మాట్లాడటం పర్సనల్ అంటే నేనేమీ చేయలేను. కాకినాడ పోర్ట్ ను బలవంతంగా రాయించుకున్నారు. గంగవరం, కృష్ణపట్నం పోర్ట్‌లో కూడా ఇదే అక్రమం జరిగింది. అన్ని పోర్ట్‌లలో జరిగిన అక్రమాలపై చంద్రబాబు విచారణ చేయించాలి. ఈ అవినీతి పై ఎసీబీకి కూడా ఫిర్యాదు చేస్తాం. నాకు అదనపు భద్రత ఎవరూ కల్పించ‌లేదు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ వచ్చి షర్మిల‌ పట్టించుకోలేదని అన్నారా ఎవరైనా వచ్చి మీడియా తో మాట్లాడారా... మీరు మాట్లాడించండి చూద్దాం. పదవుల నుంచి తీసేసిన వారి మాటలు పట్టుకుని నన్ను అడగటం‌ కరెక్ట్ కాదు. అటువంటి మాటలు నన్ను అడగటం కరెక్ట్ కాదు.


రాహుల్ పర్యటనను అడ్డుకుంటారా..

ఉత్తర్‌ప్రదేశ్‌లో గొడవలకు బిజేపీ ప్రకటనలే కారణం. ప్రతి మసీదు కింద శివాలయం ఉందని బిజేపీ ప్రచారం చేస్తుంది. ఇంతమంది చనిపోయారంటే బిజేపీదే బాధ్యత. మత రాజకీయాలు చేయడం ఆ పార్టీకి కొత్త కాదు. వాళ్ల డిఎన్‌ఏలోనే అది ఉందని ఇప్పుడు మళ్లీ నిరూపించారు. రాహుల్, ప్రియాంక‌ అక్కడకు వెళితే మీకొచ్చిన నష్టమేంటి? బీజేపీ మతతత్వ రాజకీయాలకు ప్రజలు బుద్ధి చెప్పాలి. రాహుల్ పర్యటనను అడ్డకోవడాన్ని ఖండిస్తున్నాం.


ఆ ఉద్యోగాల జాడేది..

సూపర్ సిక్స్ అమలు చేయకుండా చంద్రబాబు మోసం చేస్తున్నారంటూ వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఆరు నెలల్లో సీఎం చంద్రబాబు ఏం చేశారో చెప్పాలి. ఆర్నెళ్లయినా సూపర్ సిక్స్ జాడేదని ఆమె ప్రశ్నించారు. ఇప్పటికీ తమ పార్టీ తెచ్చిన పథకాలు, విధి విధానాలేమిటో ప్రకటించలేదన్నారు. చంద్రబాబు ఇంత కాలయాపన చేయడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రైతులకు సాయం చేయలేదు. యువతకు ఉద్యోగాలు. నిరుద్యోగులకు భృతి ఇవ్వనేలేదు. ఇరవై లక్షల మంది యువతకు ఇస్తానన్న మూడు వేల రూపాయల మాటేది. వారికి ఉద్యోగాలు ఎప్పుడిస్తారో బాబు చెప్పాలని ఆమె నిలదీశారు. 18యేళ్లు పూర్తి చేసిన ఏ ఒక్కరికైనా 1500 ఇచ్చారా అని ఆమె డిమాండ్ చేశారు. అదానీతో జరిగిన విద్యుత్ ఒప్పందాల్లో రూ. 1750 కోట్ల మేర ముడుపులు అందుకున్నట్టు అమెరికా దర్యాప్తు సంస్థ చెప్తోంది. నా పేరు ఎక్కడైనా ఉందా అని జగన్మోహన్ రెడ్డి తెలివిగా మాట్లాడుతున్నారు. 2021 లో అప్పటి సిఎం అంటే జగన్ కాక ఎవరొస్తారు. జగన్ వ్యాఖ్యలు చూస్తే వెర్రి తనం అనుకుంటున్నారు.


జగన్ చేసినట్టు బాబు ఎందుకు చేయరు..

ఏ రాష్ట్రం‌లో లేని విధంగా అధిక ధరలకు మన రాష్ట్రం‌లోనే ఒప్పందాలు ఎందుకు? ప్రజల పై ఇంత భారం‌ పడుతుంటే... చీమ కుట్టినట్లు అయినా లేదా.. చంద్రబాబు ఒప్పందం రద్దులో ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు. లాంగ్ టర్మ్ డీల్ చేయకూడదని తెలిసినా జగన్ ఎందుకు అమలు చేశారు. జగన్, అదానీ మధ్య ఒప్పందం ఎందుకు రద్దు చేయరు. చంద్రబాబు‌కు కూడా ఏమైనా డబ్బులు అందాయా. చంద్రబాబు ఒప్పందాలను జగన్ చాలా తేలిగ్గా రద్దు చేశారు. జగన్ ఒప్పందాలను చంద్రబాబు ఎందుకు రద్దు చేయడం లేదు. ఈనెల నుంచే ఈ విద్యుత్ భారాలు ప్రజల పై మోపారు. అక్రమాలు అని స్పష్టంగా తెలిసినా చంద్రబాబు స్పందించరా. ఈ ఒప్పందాలు రద్దు చేయాలని చంద్రబాబు‌ డిమాండ్ చేస్తున్నాం. కేంద్రం జోక్యం చేసుకుని అదానీ, జగన్ మధ్య ఒప్పందాలు రద్దు‌చేయాలి అని షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు.

Harish Rao: నన్ను అరెస్ట్ చేయొద్దు.. హైకోర్టును ఆశ్రయించిన హరీష్ రావు..


Updated Date - Dec 04 , 2024 | 03:26 PM