Share News

YS Sharmila: వెంకట్‌రెడ్డి లాంటి తీగలే కాదు.. పెద్ద డొంకలు సైతం కదలాలి

ABN , Publish Date - Sep 28 , 2024 | 03:45 PM

వెంకటరెడ్డి అరెస్ట్‌పై పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శనివారం అమరావతిలో స్పందించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన గనుల దోపిడీపై వెంకట్ రెడ్డి లాంటి తీగలే కాదు..పెద్ద డొంకలు సైతం కదల్చాల్సిన అవసరం ఉందన్నారు. ఆ పెద్ద డొంక ఏ ప్యాలెస్‌లో ఉన్నా విచారణ జరపాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

YS Sharmila: వెంకట్‌రెడ్డి లాంటి తీగలే కాదు.. పెద్ద డొంకలు సైతం కదలాలి

అమరావతి, సెప్టెంబర్ 28: గత జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై నిగ్గు తేల్చేందుకు చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. అందులోభాగంగా గనులు, మైనింగ్ కేటాయింపులు, ఇసుక అక్రమ రవాణాలో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలపై ఆ శాఖ డైరెక్టర్ వెంకట్‌రెడ్డిని ఏసీబీ అధికారులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. వెంకటరెడ్డి అరెస్ట్‌పై పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శనివారం అమరావతిలో స్పందించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన గనుల దోపిడీపై వెంకట్ రెడ్డి లాంటి తీగలే కాదు..పెద్ద డొంకలు సైతం కదల్చాల్సిన అవసరం ఉందన్నారు. ఆ పెద్ద డొంక ఏ ప్యాలెస్‌లో ఉన్నా విచారణ జరపాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Also Read: Harish Rao: కన్నీరు పెట్టుకున్న హరీశ్ రావు.. ఇంతకీ ఏమైందంటే..

Also Read: PM Modi: నేడు జమ్మూకు ప్రధాని మోదీ


రూ. 2,566 కోట్ల దోపిడీకి పాల్పడ్డ ఘనుడు వెంకట్‌రెడ్డి అయితే.. ఆ తెర వెనుక ఉండి, సర్వం తానై, వేల కోట్లు కాజేసిన ఆ ఘనాపాటి ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునన్నారు. గత ఐదేళ్లుగా రాష్ట్రంలో అడ్డగోలుగా సహజ సంపదను దోచుకు తిన్నారని గత ప్రభుత్వ పాలకులపై పీసీసీ చీఫ్ మండిపడ్డారు. అస్మదీయ కంపెనీలకే మైనింగ్ కాంట్రాక్టులు సైతం కట్టబెట్టారని ఈ సందర్భంగా విమర్శించారు.

Tamilnadu: నగదుతో కంటైనర్‌లో పరారీ... సినీ ఫక్కీలో ఛేజింగ్..


టెండర్లు, ఒప్పందాలు, ఏపీఎంఎంసీ నిబంధనలన్ని తుంగలోకి తొక్కి తాము అనుకున్న కంపెనీకే టెండర్లు కట్టబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలు సైతం బేఖాతరు చేశారన్నారు. రాష్ట్ర ఖజానాకు చేరవలసిన నిధులు.. సొంత ఖజానాకు తరలించారని వైఎస్ షర్మిల ఆరోపించారు.

Also Read: మా భారతి అక్క..హోంమంత్రి అనిత సెటైర్లు


గత ప్రభుత్వ హయంలో జరిగిన మైనింగ్ కుంభకోణంపై ఏసీబీ విచారణతో పాటు పూర్తి స్థాయి సమగ్ర దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు. చిన్న చేపలను ఆడించి సొమ్ము చేసుకున్న పెద్ద తిమింగలాన్ని పట్టుకొనేలా ఈ కేసులో దర్యాప్తు జరగాలని కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. సహజ వనరుల దోపిడీపై సీబీఐతో విచారణ కోరాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆమె సూచించారు.

Also Read: Bhavika Mangalanandan: పాకిస్థాన్ సంగతి ప్రపంచానికి తెలుసు

Also Read: Hardeep Singh Puri: పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గనున్నాయా? కేంద్రమంత్రి కీలక ప్రకటన


గత జగన్ ప్రభుత్వ హయాంలో అన్ని రంగాల్లో భారీగా అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఆ క్రమంలో గనులు, అక్రమ మైనింగ్‌లో భారీగా అవినీతి చోటు చేసుకున్నట్లు చంద్రబాబు ప్రభుత్వం గుర్తించింది. దీంతో నాటి గనుల శాఖ డైరెక్టర్ వెంకట్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్దం చేసింది. దీంతో ఆయన ఢిల్లీ కంటోన్మెంట్‌లో నెలలు తరబడి తలదాచుకున్నారు. ఈ విషయాన్ని కనిపెట్టిన ఏసీబీ సైతం అతడిని అరెస్ట్ చేసేందుకు చర్యలు చేపట్టింది.

Also Read: Nirmala Sitharaman: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌పై కేసు నమోదుకు ఆదేశం

Also Read: Web Story: గోంగూర వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే.. అసలు వదిలి పెట్టరు


ఈ విషయాన్ని వెంకట్ రెడ్డి పసిగట్టారు. దీంతో తన మకాం హైదరాబాద్‌లోని శంషాబాద్ సమీపంలోని అత్యంత ఖరీదైన బ్యూటీ గ్రీన్ ఫార్మ్ హౌస్‌కు మార్చారు. అతడి ఆచూకీ కనిపెట్టిన ఏసీబీ అతడిని శుక్రవారం అరెస్ట్ చేసింది. అనంతరం అతడిని కోర్టులో హాజరు పరచగా.. 14 రోజుల కస్టడీ విధించింది. ఇండియన్ కోస్ట్ గార్డ్‌ అధికారి అయిన వెంకట్ రెడ్డి.. డిప్యూటేషన్‌పై జగన్ ప్రభుత్వంలో గనుల శాఖలో ఉన్నతాధికారిగా చేరిన సంగతి తెలిసిందే.

Also Read: Mumbai: నగరానికి పొంచి ఉన్న ముప్పు.. అప్రమత్తమైన పోలీసులు

For National News And Telugu News..

Updated Date - Sep 28 , 2024 | 03:47 PM